CM Revanth Reddy key decision : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణయం, విత్తనాల నుంచి కొనుగోళ్ళ వరకు కార్యాచరణకు ప్రత్యేక కమిటీ
-- రైతు వేదికల్లో విత్తనాలు, ఎరు వుల పంపిణీ --ఎరువులపైన కేంద్రం పైన ఎప్ప టికప్పుడు ఒత్తిడి --ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల టీం --వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

CM Revanth Reddy key decision : ప్రజా దీవెన, హైద రాబాద్: రైతుల కు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచర ణ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవం త్‌రెడ్డి అదే శించారు. పంట వేసినప్పటి నుంచే రైతుల వివరాల న మో దు, పంటల వివరాల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధా న్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశలో వ్యవసా య శాఖకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు.
ఎంసి ఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో నిర్వహించిన సమీక్షలో ము ఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధ ర్ బాబు, రాజ్య సభ సభ్యుడు వేం నరేం దర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు, సి ఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి , వ్యవసాయ శాఖ కార్యద ర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ ర వీంద్ర, వ్యవసాయ శా ఖ డైరెక్టర్ గోపి, ప్రణాళిక శాఖ కార్య దర్శి గౌరవ్ ఉప్పల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటివరకు ఉన్న అనుభవాలు, రైతు లు ఇబ్బంది పడకుండా చేపట్టాల్సిన చర్యలపై రైతు కమిష న్, అగ్రికల్చ ర్ యూనివర్సిటీ, వ్యవసాయ నిపుణులు ఇచ్చి న సలహాలు, సూచ నలను సమీక్ష సమావేశంలో చ ర్చించా రు. రైతులు ఎక్కడా ఇబ్బం ది పడకుండా వచ్చే సీజన్ నుం చే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఇప్పుడే ఉన్నతాధికారుల క మిటీ ఏర్పా టు చేయాలని అదేశించారు. వ్యవ సాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యం లో పనిచేసే ఈ కమిటీలో వ్యవసా య శాఖ డైరెక్టర్, సివిల్ సప్లయిస్ మేనేజింగ్ డైరెక్టర్, ప్లానింగ్ వి భాగo కార్యదర్శి ఈ కమిటీలో సభ్యు లుగా ఉంటారన్నారు.
విత్తనాల పంపిణీ మొదలు పంట వేసినప్పటి నుంచే అన్ని గ్రామాల్లో రైతుల వివరాల నమోదు, పంటల వివరాల రికా ర్డులు, పంట ఉత్ప త్తుల అంచనాలు, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన చర్యలు, తీసు కోవాల్సిన జాగ్రత్తలను ఈ కమిటీ ఎప్ప టికప్పుడు పరిశీ లి స్తుంది. క్షేత్రస్థా యిలో పర్యవేక్షించడంతో పాటు ఈ ప్రక్రి య కు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ కూ ర్చుకుంటుంది.ఏ రైతు ఏ పంట వేశాడు.
ఏ గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలు కచ్చి తం గా క్షేత్ర స్థాయి పరిశీలనతో నమోదు చే యాలని చెప్పారు. కనీస మద్దతు ధరలు, కేంద్రం నిర్దేశించిన కోటాలను అ ను సరించి రాష్ట్రంలో పంట ఉత్పత్తుల కొను గోళ్లు సాఫీగా జరి గేలా అన్ని చర్యలు చేపట్టాలని సీఎం ఆదే శించారు.
ధాన్యం కొనుగోళ్ల సమయంలో అ కాల వర్షాలు, తూకం, రవాణా, ని ల్వ, మార్కెటింగ్ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.సన్న వడ్లు పం డించే రైతులకు బోనస్ ఇ స్తున్న నేపథ్యంలో 7 రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశిం చారు. ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు ఇవ్వాలని చె ప్పారు. రైతు వేదికల్లోనే సన్న వడ్ల విత్తనాలు అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకోవాల ని సూచించారు. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి డేటా సేకరిం చాలని, ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహ న ఉం డాలని స్పష్టం చేశారు.
రైతు వేదికలను ఇకపై రైతులకు ఉ పయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రిస్పష్టం చేశారు. రై తులు అక్క డే తమ వివరాలు న మోదు చేసుకొ ని విత్తనాలు, ఎరువు లు కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ తో పాటు రెవెన్యూ, పోలీస్ విభా గాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని సూచించారు.
జిల్లాల్లో వీటి నిర్వహణ, పర్యవే క్షణ బాధ్యతలను అదనపు కలెక్ట ర్లకు అప్పగించాలని ఆదేశించారు.వ్యవసాయ శాఖలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచుకో వాలని సీఎం సూచించారు. ఏఐ ఆధారిత విధానాలను సమర్థంగా విని యోగించాలని చెప్పారు. అగ్రి కల్చర్ యూనివర్సిటీని నోడ ల్ ఏజెన్సీగా పెట్టుకొని విత్తనాల నుంచి కొనుగోళ్ల వరకు మొత్తం వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయి స్, అగ్రికల్చర్ యూనివర్సి టీ సమన్వయంతో పనిచేయాల ని చెప్పారు. భద్రాద్రి కొత్త గూడం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పై లట్ ప్రాజెక్ట్ ఫలితాలు అధ్యయనం చేయాలని, రైతులకు ఉ పయోగంగా ఉంటే మరింత విస్తృతంగా వినియోగించుకో వాలని అన్నారు.
ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఫెర్టి లైజర్లను యాప్ ద్వారా బుక్ చేసే విధానం తీసు కురావాలని సీఎం ఆ దేశించారు. యాప్ ద్వారా రైతులు బు క్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చే యాలని సూచించారు. యూరియా పంపిణీ బాధ్యతను జి ల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని చెప్పారు. ఖరీఫ్ సీజ న్ కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటా యిం పులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు ము ఖ్యమంత్రి సూచించారు.
రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరు వులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒ త్తిడి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎరు వుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వ హించి, వాస్తవ పరిస్థితిని వివరించాలని సూచించారు. అవ సరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని చెప్పారు.
మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించే దిశ గా చర్యలు తీసుకోవాల ని సీఎం సూచించారు. వ్యాపారులకు తలోగ్గకుండా ఈ సా రి ప్రభుత్వం వ్యూహత్మకంగా వ్యవహరించిన కారణంగా మొక్కజొన్న కొనుగోళ్లతో వచ్చే నష్టం తగ్గించగలిగా మని సీ ఎం వివరించారు. గతంలో రూ.13 వేలకు టన్ను అమ్మిన ప రిస్థితి ఉందని.
ఈసారి దాదాపు రూ. 21 వేలకు పైగా టెం డర్ రేట్ వచ్చిం దని చెప్పారు. ఆయిల్‌ఫెడ్ ను మరింత బ లోపేతం చేసి లాభ లదిశలో నడిపించాలని అధికారు లకు ఆదేశించారు. ప్రభుత్వ డైరీని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమం త్రి స్పష్టం చేశారు. సకాలంలో పాల రైతులకు చెల్లింపులు జరపాలని సూచించారు.





