CM Revanth Reddy Nalgonda Visit announced : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీ లక ప్రకటన, ఈనెల 17న సీఎం రే వంత్ రెడ్డి నల్లగొండజిల్లా పర్యటన

CM Revanth Reddy Nalgonda Visit announced : ప్రజా దీవెన, నల్లగొండ:ఈనెల17న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రె డ్డి నల్లగొండ జిల్లా పర్యటనకు రా నున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధ వారం ఆయన జిల్లాలో వివిధ అ భివృద్ధి, సంక్షేమ పథకాల శంకుస్థా పనలు, ప్రారంభోత్స వాల నిమిత్తం నల్గొండ జిల్లాకు వచ్చిన మంత్రి మాన్యం చె ల్క ఉర్దూ మీడియం ప్రై మరీ పాఠశాల పనులకు శంకుస్థా పన చేసిన అనంతరం మీడియాప్రతినిధులతో మాట్లాడా రు.
రాష్ట్రంలో సుమారు 13000 కోట్ల రూపాయలతో” హ్యం రోడ్లను” ని ర్మించనున్నామని, ఇందులో భా గంగా 6300 కిలోమీటర్ల రోడ్లను డ బుల్ రోడ్డు గా మార్చేందుకు టెండ ర్లు పిలవడం జరిగిందని, పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 17న సాయంత్రం కనగల్ సమీపంలో హ్యాం రోడ్ల పనులకు శంకుస్థాపన చేయ నున్నారని, అనంతరం ధర్వే శిపురం ఎల్లమ్మ దర్శనం చేసు కొనున్నారని తెలిపారు. పంచాయతీ రాజ్ కి సంబంధించి మరో 7,000 కోట్ల రూపాయలతో నూతన రహదారులు ని ర్మించనున్నట్లు చెప్పారు.
హ్యాం రోడ్లలో భాగంగా మొదటి ప్యాకేజీ కింద సిఆర్ఎఫ్ ద్వారా 3 00 కోట్ల రూపాయలతో ధర్వేశిపురం నుండి గుర్రం పోడు, కొండమల్లే పల్లి నుండి డిండి వరకు డబుల్ రోడ్డు చే పట్టడం జరిగిందని, మొత్తం 34 ప్యాకేజీలుగా విభజించా మని, 13000 కోట్ల రూపాయల పనులకు రాష్ట్ర ముఖ్య మంత్రి శంకుస్థాప న చేయనున్నట్లు వెల్లడించారు. శంకుస్థా పన అనంతరం తెలంగాణ లోనే భారీ బహిరంగ సమావేశా న్ని కనగల్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపా రు.
డబుల్ రోడ్ల నిర్మాణం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కా కుండా, ప రిశ్రమలు వచ్చే అవకాశం ఉందని, తద్వారా యు వతకు ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. నల్ల గొండ తో పాటు, వలిగొండ,ఆలేరు తదితర ప్రాంతాలకు కూడా 60 0 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించ నున్నమని తెలిపారు. అలాగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 125 కోట్ల రూ పాయలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు ఈ వారంలో టెండ ర్లు పిలువనున్నామని, నల్లగొండ పట్టణాన్ని తెలంగాణలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ విద్యాసంవత్సరం అల్పాహారం,మధ్యాహ్నభోజనం
చదువు జీవితాలను మారుస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా రు. రాష్ట్ర ప్రభు త్వం విద్య ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొ ని రాష్ట్రంలోని మూడున్న ర లక్షల మంది ఇంటర్ విద్యార్థు లకు ఈ అకాడమిక్ విద్యా సంవత్స రం నుండే ఉదయం అల్పాహారంతో పాటు, మధ్యాహ్న భోజనం అందించనున్న ట్లు వెల్లడించారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూ మ్ ఇండ్లను పరిశీలించారు.
జూలై 1న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయా ల ని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో అన్ని వసతులు కల్పిం చా లని, ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వాటిని కూ డా పూర్తి చేసి గృహప్ర వే శాలకు సిద్ధం చేయాలని అధికా రు లను ఆదేశించారు. అం తేకాక 6 కోట్ల రూపాయలతో తిప్పర్తి మండల కేంద్రంలో మంజూరైన జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను తనిఖీ చేశారు.
అనంతరం మీడియా ప్రతినిధుల తో మంత్రి మాట్లాడుతూ గత సం వత్సరం జిల్లాలోని తిప్పర్తి, కనగల్ మండలాలలో ఒక్కొక్కటి 6 కో ట్ల రూపాయలతో అధునాతన సౌ కర్యాలు కల్పించేలా జూనియర్ కళాశాల భవనాలను మంజూరు చే యడం జరిగిందని, పూర్తి నాణ్య తతో ఈ భవనాలను ని ర్మించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసు కుంటున్నామని, పనులు పురోగతిలో ఉన్నాయని తె లిపా రు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, చదువు జీవి తాలను మారుస్తుందని, విద్యాభి వృద్ధిలో భాగంగా న ల్గొండ జిల్లా కేం ద్రంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యా లయా న్ని తీసుకురావడమే కాకుండా, బీఫార్మసీ, లాకోర్సులను తీ సుకురావడం జరిగిందన్నారు.
తిప్పర్తి జూనియర్ కళాశాల భవన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని ఆయన అధి కారులను, కాంట్రాక్టర్ ను ఆ దేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల 50 వేల మంది ఇంటర్ విద్యార్థులకు అల్పా హారంతో పాటు భోజనాన్ని ఈ విద్యా సంవ త్సరం నుండి ఇవ్వనున్నదని అందువల్ల వి ద్యార్థులు ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా ఉన్నచోటనే ఉ న్నత విద్యను అభ్యసించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఇంటర్ కళాశాలలో కంప్యూ టర్ విద్యతో పాటు, ఆర్టిఫీషి యల్ ఇంటలిజెన్స్ అందించనున్నామని, ప్రతీక్ ఫౌం డేషన్ సహకారంతో బొట్టుగూడా ప్రతీక్ పాఠశాలలో ఏఐ అందిస్తు న్నట్లు తెలిపారు.
తిప్పర్తి మండల కేంద్రంలో నిర్మించి న 100 డబుల్ బెడ్ రూ మ్ ఇండ్ల ను జూలై 1 నాటి కి అన్ని వసతు లతో పూర్తిచేసి గృహప్రవేశాలకు సి ద్ధం చేయాలని, అన్ని ఒకేరోజు ప్రారం భించే విధంగా తీసుకోవాలని అధికారుల ఆదేశించామ ని, అంతే గాక తనవంతుగా ఒక్కో ఇంటికి 25వేల రూపా యల ను గృహప్రవే శాల సందర్భంగా లబ్ధిదారులకు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే నల్గొండ పట్టణంలో కలెక్టర్ కార్యా లయం వెనక నిర్మించిన డబుల్ బె డ్ రూమ్ ఇండ్లను కూడా ప్రారం భించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని తెలిపా రు.
తిప్పర్తి మండ ల కేంద్రంలో డాక్ట ర్ బి.ఆర్ అంబేద్కర్, బా బు జగ్జీవన్ రామ్ విగ్రహా లను ఏర్పాటు చేశామని, మ హిళ ల అభివృద్ధిలో భాగంగా స్వయం సహాయక మహిళలకు ప్ర తి మండలంలో రైస్ మిల్లు ఏర్పాటు చేసే లా చర్యలు తీసు కుంటున్నామని, మహిళలు ఆర్థికంగా పైకి వస్తే కుటుంబాని కి తోడుగా ఉంటారని అన్నారు.
ఇటీవలే రాష్ట్రంలో మహిళా స్వ యం సహాయక సంఘాల కు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల ను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు 10 త ర్వాత ఎట్టి పరిస్థితులలో చదువు ను ఆపరాదని ఆయన కోరారు. చ దువుకుంటే టెక్నికల్ కోర్సుల ద్వా రా ఉద్యోగాలు పొంద వచ్చని దీన్ని దృష్టిలో ఉంచుకొని నల్గొండలో న్యాక్, సెట్వి సంస్థలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు .జిల్లా క లె క్టర్ బి .చంద్రశేఖర్, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, మార్కె ట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, సంపత్ రెడ్డి, బద్దం సుధీ ర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) June 10, 2026






