Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cm revanth reddy RTC employees : ఆర్టీసీ ఉద్యోగులకు ఆనంద సమయం

--21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ --జూన్ 1వ తేదీ నుంచి అమలులో కిరానున్న కొత్త ఫిట్ మెంట్ --కొత్త ఫిట్ మెంట్ తో ఆర్టీసీపై నెలకు రూ. 35 కోట్ల భారం --ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం సత్వర నిర్ణయం --అధికారికంగా వెల్లడించిన రవాణా కమిటీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

ఆర్టీసీ ఉద్యోగులకు ఆనంద సమయం

–21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ
–జూన్ 1వ తేదీ నుంచి అమలులో కిరానున్న కొత్త ఫిట్ మెంట్
–కొత్త ఫిట్ మెంట్ తో ఆర్టీసీపై నెలకు రూ. 35 కోట్ల భారం
–ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం సత్వర నిర్ణయం
–అధికారికంగా వెల్లడించిన రవాణా కమిటీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

ప్రజా దీవెన/హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఏకంగా 21 శాతం ఫిట్‌మెంట్‌ (fitments) తో పీఆర్సీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేస్తూ 2017 పీఆర్సీని పూర్తి స్థాయిలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని, ఆర్టీసీ ( tsrtc ) ఉద్యోగుల సంక్షే మం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్ల డించారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్ మెంట్ అమలు చేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు.

కొత్త ఫిట్ మెంట్ తో ఆర్టీసీపై నెలకు రూ. 35 కోట్ల భారం పడుతుంద ని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అంద జేశారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి (prc) సం బంధిం చిన వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇస్తూ ఆర్టీసీ ఉద్యోగు ల పీఆర్సీ అంశాన్ని ముఖ్య మంత్రి రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరి ష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. హామీ ఇచ్చిన రెండు రో జుల్లోనే ప్రభుత్వం మాటనిల బెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులకు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. అయి తే ఈ సందర్భంగా మాట్లాడుతూ 16 నుండి ఫిట్మెంట్ 21 శాతా నికి పెంచడానికి కృషి చేసిన ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు దన్య వాదాలు తెలియజేశారు.

సంస్థలో మొత్తంగా 53 వేల 71 మందికి ఈ ఫీట్మెంట్ ప్రయోజనం చేకూరుస్తుందని, ఇంత పెద్ద ప్రకటన లో భాగస్వామిని అయినందు కు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం లో విలీనంపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపు ఆర్టీసి లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, అందుకు సమర్థవంతంగా అమలు చేయడంలో ఆర్టీసి సంస్థ వారి బాధ్యత నెరవేరుస్తున్నారని కొనియా డారు.

ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చే శారని వివరించారు. పెండింగ్ లో రూ. 280 కోట్ల బాండ్స్ నెక్లెస్ రో డ్డు లో ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి ప్రకటించారని, రెండు రో జుల్లో పేమెంట్ జరిగిపోతాయని తెలిపారు.2017లో 17శా తం పీ ఆర్సీ పై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని, ఆర్టీసి సంస్థ గ తంలో జరిగిన అనేక అంశాల వల్ల పి ఎఫ్, సి సి ఎస్ లని వాడుకున్న పరి స్థితి ఉందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్ప టికి పీఆర్సీ 2017 లో 16 శాతం అమలు చేయలేకపోయిందని గుర్తు చేశారు.

మొత్తాని కి ఆపరేషనల్ లాస్ నుండి ప్రాఫిట్ ఒరియంటేషన్ కి వె ళ్తుందని, బోనస్ లు ఇతర బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్తు న్నామని వివారించారు. ఫిట్మెంట్ అమలు చేయడం ద్వారా ప్రతి సం వత్సరం 418.11 కోట్ల భారం పడుతుందన్నారు. ఆర్టీసి కుటుంబా లని మాకు మద్దతు ఇచ్చాయి వారికి అండగా ఉండాలని మా ప్రభు త్వం నిర్ణయించిందని వెల్లడించారు. జూన్ 1 2024 నుండి ఇది అ మలులోకి వస్తుందని, 2017 నుండి ఇది పెండింగ్ లో ఉందని గు ర్తు చేశారు.

మహాలక్ష్మి పథకం వచ్చిన తరువాత బస్సులు ,బస్ స్టాండ్ లు కళ కళలాడుతు న్నాయని, 60 శాతం ఉన్న అక్యుపెన్సి 100 శాతం దాటుతుందని చెప్పారు.ఆర్టీసీలో నూతన ఉద్యోగనియమాలు చేప డతామని, 3 వేల బస్సులు కొత్తగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్క డ కూడా బస్సులు తగ్గించే పరిస్థితి ఉండదని,సంస్థ ను ముందుకు తీసుకుపోవడనికి అందరం భాగస్వామ్యం కావాలని కోరారు. కొత్త రుట్ల లో బస్సులు నడపాలని డిమాండ్స్ వస్తున్నాయ ని గుర్తు చేశారు.

ప్రభుత్వం మీద మంత్రి మీద కోపం ఉంటే వేరే పద్ద తిలో వెళ్లండి, ఆ ర్టీసి పై విమర్శలు బంద్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్న అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైల్వే లాగా ఆర్టీసి బస్సులు పని చేస్తున్నాయని, ఆర్టీసి ని బడనామ్ చేయాలని చూస్తున్నారని, ఆర్టీసి మహిళలకు ఉచితంగా ఇస్తుంటే ఆటో వాళ్ళని రెచ్చగొడుతు న్నారని ద్వజమెత్తారు.