Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 3:00 am Posted by : praja deveena

Cm Revanth Reddy sensational decision : తెలంగాణ కేబినెట్ సంచలననిర్ణయం, ఉపాధ్యాయులు, సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్నభోజనం

 

Cm Revanth Reddy sensational decision:  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వం సంచలన నిర్ణ యాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేద నిపిస్తోంది. అందుకు తార్కానంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సచివాల యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన హై-లెవెల్ కేబినెట్ మీటింగ్, రాష్ట్ర భవిష్య త్తును మార్చేసే కొన్ని సంచలన నిర్ణయాలకు వేది కైంది. కేబినెట్ ముగిసిన అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి.. కేవలం నిర్ణయా లు కాదు, తెలంగాణ ప్ర గతికి సరి కొత్త ‘రూట్ మ్యాప్స్’ అనౌన్స్ చేశారు.

టీచర్స్, స్టాఫ్‌కు కూడా ఉచిత భోజనం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పా ఠశాలలు, జూనియర్ కాలేజీల్లో కే వలం విద్యార్థులకే కాదు..చరిత్రలో మొదటిసా రిగా 1,500,000 (లక్షా యాభై వేల) మంది ఉపా ధ్యాయు లు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అం దించాలని కేబినెట్ సంచ లన నిర్ణ యం తీసుకుంది.బడుల్లో ఆకలికి తావుండొద్దు.. చ దువు చెప్పే గురువులకూ లోటుండొద్దన్న ఉద్దేశంతో ఈ కీల క నిర్ణయం తీసుకోవడం జ రిగిందని ప్రభుత్వం చెబుతోంది.

సుప్రీంకోర్టుకు ఉపాధి హామీ వివాదం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వీబీజీ రామ్‌జీ పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప తొక్కనుం ది. 2006 నాటి పాత ఉపాధి హామీ స్థానంలో వచ్చిన ఈ కొత్త స్కీమ్‌పై మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి కమిటీ ఇచ్చిన రి పోర్ట్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. శాస నసభ ఏకగ్రీవంగా వ్యతి రేకించినా కేంద్రం మొండిగా ముందుకెళ్తోందని మంత్రులు మండిపడ్డారు.అయితే, క్షేత్రస్థాయిలో కూలీలకు నష్టం జర గకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతానికి దీన్ని అమలు చేస్తూనే, లీగల్‌గా ఢిల్లీతో ఫైట్ చేయాలని కేబినెట్ డిసైడ్ అయింది.

 ‘మెగా రిక్రూట్‌మెంట్’లో సూపర్ స్పెషాలిటీ పోస్టులు

తెలంగాణ వైద్య రంగం నెక్స్ట్ లెవె ల్‌కు చేరబోతోంది. సన త్‌నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్ TIMS ఆ సుపత్రులతో పా టు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిమ్స్’ (NI MS) రేంజ్‌లో డెవలప్ చేయ నున్నారు.ఇందుకోసం ఏకంగా 6,2 78 డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టు లను కేబినెట్ మంజూ రు చేసింది.ఇక్కడ పేదలకు అందే కార్పొరేట్ వైద్యానికి సీ ఎం సహాయనిధి (CM RF) నుంచి నేరుగా LOCలు జారీ చే యనున్నారు.

రూ. 7,345 కోట్లతో ‘మూసీ రివర్‌ఫ్రంట్’

హైదరాబాద్‌ గ్లోబల్ లుక్‌ను మా ర్చేసే అత్యంత ప్రతిష్టాత్మక మైన మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ కు కే బి నెట్ గ్రీన్ సిగ్నల్ ఇ చ్చింది. ఫేజ్-1 లో భాగంగా గాంధీ సరోవర్ వరకు 21 కిలో మీటర్ల మేర ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనున్నారు. బడ్జెట్ లో రూ. 7,345 కోట్లు (పరిపాలనా అనుమతులు మంజూ రు) త్వరలోనే ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెండర్ల ప్రక్రి య ప్రారంభం కానుం ది. కాగా సంక్షేమం, ఆరోగ్యం, మౌ లిక వసతుల కల్పన.. ఈ మూడు రంగాల్లో తెలంగాణ స్పీడ్ పెం చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి కేబినెట్ ఈ వ్యూహాత్మక అడు గులు వేస్తోందని రాజకీయ పరిశ్రమలు భావిస్తున్నారు.