CM Revanth Reddy : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ ప్ర భుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్ర తిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తె లంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పా ల్గొనాల్సిందిగా ప్రధాన మం త్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వా నించారు.ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్కతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ భవన్ ప్రధానమంత్రి కా ర్యాలయంలో మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సి టీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత వికసిత్ భార త్ 2047 లక్ష్యాలకు అనుగు ణంగా, తనవంతుగా తెలంగాణ దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందించా ల న్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం రూపొందిం చినట్టు ముఖ్యమంత్రి వివరించా రు. వికసిత్ భా రత్ లక్ష్యాలను చే రుకోవడంలో 2047 నాటికి తెలంగాణ 3 ట్రి లి యన్ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదగాలని సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు.
వివిధ రంగాల్లో నిష్ణాతులు, నిపుణులు, నీతి ఆయోగ్ సలహా సూ చనలను క్రోడీకరించి మేధోమథనం అనంతరం విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు చెప్పారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అ నుగుణంగా ఫలితాలు సాధించడంలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్ర భుత్వం తగిన సహాయ సహాకారాలు అందించాలని ఈ సందర్భం గా ముఖ్య మంత్రి ప్రధానమంత్రిని కోరారు.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అను మతులు మంజూరు చేయాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీట ర్ల పొడవు నా విస్తరించే ప్రతిపాదనలను ఇప్ప టికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమ ర్పించిందని, రూ.43,848 వేల కోట్ల అంచనా వ్య యంతో ఈ ప్రాజెక్టు ను కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచ ర్గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉ త్తర భాగానికి కేబినేట్ ఆమోదంతో పాటు ఆర్థిక పరమైన అనుమతు లు, అలాగే దక్షిణ భాగం నిర్మాణా నికి అనుమతులు ఇవ్వాలని కోరా రు.రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతి పాదనల్లో ఉన్న రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు ను వీలైనంత తొందరగా చే పట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరా బాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీ న్‌ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబా ద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కా రిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టే లా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని విజ్ఞప్తి చేశా రు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్య క్షేత్రానికి నిరంతరాయంగా రవా ణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుం చి శ్రీశైలం వరకు నాలుగు వరుసల ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణ ప్ర తిపాదనలను ఆమోదించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.
కేంద్ర మంత్రులతో సీఎం బృందం భేటీ…. ముఖ్యమంత్రి ఎ. రే వం త్ రెడ్డి న్యూఢిల్లీలో సుడిగాలి పర్యటన కొనసాగిస్తున్నారు. పలు వురు కేంద్ర మంత్రులను మర్యాద పూర్వకంగా కలిశారు. పార్లమెం ట్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే, ఐటీ & సమాచార ప్ర సార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేం ద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహా రాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ని విడివిడిగా కలు సుకుని హైద రాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకా వాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గ్లోబల్ సమిట్‌లో ఆవిష్కరించనున్న తెలంగాణ రైజిం గ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధా న లక్ష్యాలు మరియు ప్రాధాన్యత అంశాలను కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ సంద ర్భంగా ముఖ్య మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క, ఎంపీలు డా క్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, సు రేష్ షెట్ట్కార్, చామల కిర ణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమా ర్ యాదవ్ ఉన్నారు.
ఏఐసిసి అగ్రనేతలకు ఆహ్వానం... ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రా హుల్ గాంధీని, ఎంపీ ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలి శారు. తెలంగాణ అభివృద్ధికి సం బంధించిన ఉమ్మడి లక్ష్యాలను పంచుకుంటూ వారితో కీలక చర్చలు జరిపారు.హైదరాబాద్‌లోని భా రత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టా త్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పా ల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృ ద్ధిని లక్ష్యంగా రూపొందించిన తెలం గాణ రైజింగ్ 2047 విజన్ డాక్యు మెంట్ గురించి అగ్రనేతల కు ము ఖ్యమంత్రి వివరించారు. ఈ సమా వేశంలో ముఖ్యమంత్రి తో పాటు ఉ ప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ఎంపీలు, ఏ ఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు.



