Cm Revanth Reddy women bill : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యా ఖ్య, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎప్పుడు తెచ్చినా మద్దతిస్తాం
రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర --ప్రతిపక్షాలు ఓడించింది బీజేపీ దురుద్దేశాలనే --ప్రొరేటా పద్ధతి డీలిమిటేషన్‌తో రాష్ట్రాల మధ్య అంతరం --బిల్లుల విషయంలో బీజేపీ, మోదీకి నిజాయితీ లేదు --నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశాలు జరపాలి -- న్యూఢిల్లీ మీడియా సమావేశం లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy women bill : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలో మూడొంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేయాలని, అ న్ని వర్గాల రిజర్వేషన్లు రద్దుచే యాల ని బీజేపీ భావిస్తోందని అందుకే చార్ సౌ పార్ (400 సీట్లకు మించి) నినాదంతో 2024 ఎన్ని క లకు వెళ్లారు, ఆఎన్నికల్లో గెలిస్తే రా జ్యాంగ మార్పుతో పాటు, రిజ ర్వేషన్లు తొలగించా లని బీజేపీ భావించగా ప్రజలు జాగృతమై 240 సీట్లకే బీజే పీని పరిమితం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుము ల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ మా ర్పు, రిజర్వేషన్ల ఎత్తివేయాలంటే బీజేపీకి 2/3 వంతుల మె జారిటీ కావాలని, ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు, ని యోజ కవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు బిల్లుల ము సుగులో రాజ్యాంగం మార్పు, రిజ ర్వేషన్ల రద్దుకు బీజేపీ మ రోసారి చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు కలిసి ఓడించాయని సీఎం అన్నారు. బిల్లులు వీగిపోవ డం కేవలం కేంద్రంలోని అధికార పార్టీ ఓటమే కాదు బీజేపి చిత్త శుద్ది కూడా అని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చిత్తశుద్ది సరిగా లేనందునే రాజ్యాంగ సవరణబిల్లు వీగిపో యింద న్నారు. పార్లమెంట్‌లో ఓడి పోయింది బీజేపీ ప్రభుత్వ దు రుద్దేశమేనన్నారు. ఈ బిల్లులు వీగిపోవ డానికి కారణమైన నేతలందరికీ కృ తజ్ఞతలు తెలుపుతున్నట్లు సీఎం తెలిపా రు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక ని వాసంలో శనివారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లా డారు.
ప్రస్తుతం లోక్ సభలో ఉన్న 543 సీ ట్లలో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాసనసభల్లో 1/3 వంతు సీట్లు మ హిళలకు రిజ ర్వేషన్లు కల్పించేలా మహిళా రిజర్వేషన్లపై సోమవారం వర కు కొత్త చట్టాలను రూపొందిం చి పార్లమెంట్ ముందుకు తీ సుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలా బి ల్లు తెస్తే ఇండియా కూటమితో కలిపి 2023 మా దిరిగా ఆ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని, సోమవారం బిల్ పాస్ చేసుకొని మంగళవారం నుంచే ఈ చట్టాన్ని అమలు చేయ వచ్చని సీఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనకు అఖిలపక్ష సమా వేశాలు ఏర్పాటు చేయాలని, నిపు ణుల తో చర్చించాలని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తె లుసు కోవాలని, ప్రతి లోక్‌సభ నియోజక వర్గం పరిధిలో ప్రజాభిప్రాయ సేకర ణ చేపట్టి జాతీయ ఏకాభిప్రాయ సాధ నకు కృషి చేయాలని ముఖ్య మంత్రి సూచించారు. ఆయా రా ష్ట్రాలతో సంప్రదించి శాసనసభల్లో స్థానాల సంఖ్య పెంచ వచ్చని సీఎం అన్నారు.
రాజ్యాంగాన్ని మార్చుతానంటే దేశ ప్రజలు ఒప్పుకోరని, దీం తో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల ని మేం యోచి స్తే దానిని కాంగ్రెస్ అ డ్డుకుందని తమను బద్నాం చేసే ప ని లో మోదీ, బీజేపీ పడ్డాయని సీఎం విమర్శించారు. అందు లో భాగంగానే ఆందోళనలు చేపట్టారన్నారు. ఇప్పటికైనా ప్ర ధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ది చాటుకోవా లని, సరైన పద్ధతిలో బిల్లులు త యారు చేయాలని సీఎం సూచిం చా రు. పార్లమెంట్‌లో ఓడిపోయింది మోదీ అహంకారం తప్ప మరొకటి కాదన్నారు.కాంగ్రెస్ పార్టీకి దేశం మొదటి ప్రాధా న్యత అని, ఆ తర్వాత ప్రజలు, చివరగా పార్టీ అ ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నరేంద్ర మోదీ, బీజేపీకి మాత్రం తొలుత పార్టీ, తర్వాత సొం త విషయాలు, ఆతర్వాతే దేశమని సీఎం అన్నారు. ఉత్తర, దక్షిణాల మధ్య అంతరాలు సృష్టించి అడ్డుగోడలు పెట్టొదని మోదీ, బీజేపీకి సీఎం హి తవు పలికారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు భాగమేనని,దేశంలోనే ద క్షిణాది ప్రజలు బతుకు తున్నారని, దేశసేవలో తాము ఎవరికన్నా తక్కువ కాదని, దేశాన్ని కాపాడుకో వడం తమ బాధ్యత అని సీఎం రే వంత్ రెడ్డి అన్నారు. మహిళా రి జ ర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ చిత్త శుద్ది ఏమిటో తేల్చుకుందామని సీఎం రే వంత్ రెడ్డి సవాల్ విసిరారు. 201 1 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎ న్నికల కమిషన్ దగ్గర ఉన్నాయ న్నారు. 2009లో డీలిమిటేషన్ జ రిగిందని, ఆ లెక్కలతో ఆగష్టు15, 2026 లోపు మహిళలకు 33 శా తం రిజర్వేషన్లను కల్పించవచ్చని సీఎం అన్నారు. ఆ రిజర్వేషన్లతో ప్రధాన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉత్తర ప్రదేశ్‌లో 2027లో జరిగే ఎన్నికల్లో అమలు చేయవచ్చన్నా రు. ఆ విధంగా రిజర్వేషన్లు అమ లు చేస్తే తెలంగాణ సీఎం గా తాను బాధ్యత తీసుకొని దక్షిణాది రా ష్ట్రాల సీఎంలు స్టాలిన్, పినరయి విజయన్, సిద్ధరామయ్య, చంద్ర బాబు నాయుడు, పుదుచ్చేరి సీ ఎం రంగసామిలతో చర్చలు జరు పుతానని సీఎం తెలిపారు.
ఇండియా కూటమి నేతల మద్ద తు కూడగతానని చెప్పా రు. 202 3 లో పాస్ అయిన బిల్లులో సవరణలు చేయాల నుకుంటే ఒక చిన్న మార్పుతో రిజర్వేషన్లు అమలు చేసే అ వకాశం ఉందని సీఎంరేవంత్ రెడ్డి అన్నారు. కానీ బీజేపీ ఉ ద్దేశం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల ఎత్తివేయడమేనని, పార్లమెంట్ వే ది కగా జరిగిన ఈ తీరును 140 కోట్ల మంది దేశ ప్రజలు చూశారన్నారు. దేశ భవిష్యత్‌ను, సమగ్రతను బ లహీనపర్చేలా దేశ రాజకీయ చిత్ర పటాన్నే మార్చే బిల్లు ను కేంద్ర ప్ర భుత్వం శుక్రవారం తీసుకువచ్చిం దని, దానిని ప్రతిపక్ష పార్టీలు ఓడిం చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపా రు. ప్రతిపక్షాలు అడ్డుకున్నది ప్ర మాదకరమైన నియోజకవ ర్గాల పు నర్విభజననే తప్ప మరేం కాదన్నా రు. ప్రతిపక్షాలు నిలువరించింది ఓ డించింది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్నే నని సీఎం స్పష్టం చేశారు. బిల్లుల విషయంలో బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నిజాయితీ లేదనిసీ ఎం విమర్శిం చారు. మహిళా బిల్లు కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసిందన్నారు. తమకు గం ట సమయం ఇస్తే బిల్లు ను మార్చి వేస్తామని అమిత్ షా అన్నారని సోమవారం వరకు సమయం ఉం దని, ప్రస్తుతం ఉన్న 543 సీట్లతోనే బీజేపీ మహిళా బిల్లు తీసుకువస్తే మంగళవారమే పాస్ చేస్తామని తెలిపారు.
బీజేపీ తెచ్చిన డీలిమిటేషన్ దక్షి ణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రా లు, చిన్న రాష్ట్రాలను రాజకీయం గా దెబ్బతీసే డీలి మిటేషన్ అని, దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే డీలి మిటేషన్ అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విధానాల ఆధారం గా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ ని యంత్రణ పాటించాయని ఫలితం గా ఆయా రాష్ట్రాల్లో జనాభా తగ్గి పోయిందన్నారు. దేశానికి విధే యం గా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలను ప్రోత్సహించా ల్సిం ది పోయి జరిమానా విధిస్తామనడం ఏవిధంగా సరైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డ ను రక్షించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర విభజ నపై పలుమార్లు ద్వేషం చూపార ని, ఇప్పుడు ఆయన బా టలోనే ఎంపీ తేజస్వీ సూర్య పయనిస్తు న్నారని సీఎం మం డిపడ్డారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ మోదీ దృష్టిని ఆకర్షిం చి ప్రమోషన్లు పొందేందుకు ప్రయ త్నిస్తున్నారనే త ప్ప ప్రజల అభిప్రా యాలను పట్టించుకోవడం లేదని సీఎం విమర్శించారు. తాను సూ చించిన విధానం కిషన్ రెడ్డికి న చ్చ కపోతే ప్రత్యామ్నాయం ఏమిటో చె ప్పాలే తప్ప ఎదురు దాడి చేయడ మేమిటని సీఎం ప్రశ్నించారు. మహిళా రిజ ర్వేషన్ల విషయంలో కా గ్రెస్ పార్టీ చిత్తశుద్దిని ఏ ఒక్కరూ ప్ర శ్నించలేరని సీఎం రేవంత్ రెడ్డి అ న్నారు. అగ్రరాజ్యం అమె రికాలో ఓ టు హక్కు కోసం మహిళలు 150 సంవత్సరాలు పోరాడారని, కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెం టనే పురుషులతో పాటు మహిళల కు ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేననన్నారు. దేశానికి మహిళా రాష్ట్ర పతి, ప్రధానమంత్రి లను కాంగ్రెస్ అందించిందని, లోక్ సభ స్పీకర్‌గా, అనేక రాష్ట్రాల్లో గ వర్నర్లు, ముఖ్యమంత్రులుగా మ హిళలను కాంగ్రెస్ పార్టీ చేసిందని సీఎం తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్య్రానికి పూర్వమే మహిళలు అధ్య క్షులుగా ఎన్నికయ్యారని, స్వాతాంత్య్ర నంతరం ఇందిరా గాంధీ, సోనియా గాంధీ అధ్యక్షులుగా సేవలందించా రని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.సోనియా గాంధీ సుదీర్ఘ కాలం కాం గ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పని చేశారని సీ ఎం తెలిపారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శా తం రిజర్వేషన్లు తీసుకువచ్చారని ఫలితమే ఇప్పు డు దేశంలో పలు ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో మహి ళల ప్రా తినిధ్యం 50 శాతానికి చేరు కుందన్నారు. 1980లో ఏర్ప డిన బీజేపీకి ఇప్పటి వరకు 15 మంది అధ్యక్షులైతే అం దులో ఒక్కరూ కూడా మహిళ లేరని సీఎం తెలిపారు. అ డ్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లు రెండు మూ డు సార్లు అధ్యక్షులయ్యారని, కానీ ఒక్క మహిళకు అవకా శం ఇవ్వలేద న్నారు. అలాంటి బీజేపీ మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పా ర్టీనిఎలా విమర్శిస్తుందని సీఎం ప్ర శ్నించారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, విప్‌లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీ ర్ల ఐలయ్య, ఎమ్మె ల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, బు య్యా ని మనోహర్ రెడ్డి,తూడి మే ఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





