Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM RevanthReddy : సీఎం రేవంత్ కీలక పిలుపు, వామపక్ష తీవ్రవాద భావజాల అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలి

 

CM RevanthReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జనజీవన స్రవం తిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వా ములు కావాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపుని చ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చ ట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, శాంతిని పరిరక్షిస్తూ తె లంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అ గ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ గోషామహల్‌లో (Goshamahal) నిర్వహించిన పోలీస్ ఫ్లా గ్ డే పరేడ్‌లో ము ఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కో ల్పోయిన పోలీసు అమర వీరులను స్మరి స్తూ వారికి శ్రద్ధాంజలి ఘ టించారు. విధినిర్వహణలో అమ రు లైన పోలీసు కుటుంబాల సభ్యు లను పరామర్శించారు. శాంతి భద్ర తల పరిరక్షణలో తెలం గాణ పోలీసులు దేశానికి ఆదర్శింగా నిలి చారని అభినందించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ఎదు ర్కొంటున్న సవాళ్లు, పోలీసు సంక్షేమానికి (police welfare ) ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలు వివరించారు. ఇటీవలి కాలంలో కొందరు కీలక మా వో యిస్టు నాయకులు లొంగిపోయిన అంశాన్ని ప్రస్తావిస్తూ మిగిలిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవా లని కోరారు. ఈ సం ద ర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…

పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా. విధి నిర్వహణ లో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వచ్చినా వెను క డుగు వేయరు. నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాల ర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకో వడం మనందరి కర్తవ్యం.

పోలీసు ఉద్యోగం కత్తి మీద సాము వం టిదే. పోలీసులకు ప్రతిక్ష ణం పరీక్షే, ప్రతి దినం పోరాట మే. ఒకవైపు నేరాల అదుపు, మరో వైపు నేరాల విచారణ, ట్రాఫిక్ ని యంత్రణ, పగటి గస్తీ, రాత్రి గస్తీ, బందోబస్తు, వీఐపీల రక్షణ.. ఇలా సవాలక్ష బాధ్యతలతో విరామం లేకుండా పని చేస్తూ మనమందరం ప్రశాంతంగా జీవించేందుకు త మ జీవితాలను త్యాగం చేస్తున్నారు.

మన ప్రాణానికి వారి ప్రాణాలను అ డ్డుపెట్టే పోలీసుల రుణం ఏమి చ్చినా తీరదు. సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వర్తిస్తున్న పో లీసులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మా ప్రభుత్వం పోలీసుల సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టే బు ల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేశాం.సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదు లు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అం దిం చాం.

విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒక రికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథ కాలను అంద జేస్తున్నాం. మెడికల్ సీట్లలోను పోలీస్ అమరుల పి ల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం.

తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్‌గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు కోటి రూపా యలను, ఎస్సై సీఐ లకు కోటి 25 లక్షల రూపాయలను, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలను, ఎస్పీలకు ఇ తర ఐపీఎస్ అధి కారు లకు 2 కోట్ల రూపాయలకు పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణ యం తీసుకుంది.

ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, తె లంగాణలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అ ర్పించారు. 3 రోజుల కింద నిజామాబాద్ లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్ర మోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం చెందారు. భర్త ప్రమోద్‌ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. 1 కోటి రూపా యలు ఎక్స్‌గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వర కు లాస్ట్ పే డ్రాన్ వేతనంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం.

వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షే మం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషి యా, పోలీస్ సంక్షేమం నుండి 8 ల క్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్ర మోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం.ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకా రం, దేశంలోనే తెలం గాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది. అలాగే, పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్ విధా నంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినం దనలు పొందింది. ఈ విజయాలు తెలంగాణ పోలీస్‌ సిబ్బంది నిరం తర కృషి, అంకితభావానికి నిదర్శనం.

తెలంగాణ పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజి లెన్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్, సీసీఎస్, సైబ ర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్‌ల సారధ్యం వహించడం మా ప్రభుత్వానికి గర్వ కారణం. హై దరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ కీలక పోలీసు కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా ఏడుగురు మహి ళా అధికారులే. ఆ బాధ్యతతోనే పోలీసు సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థల ను ఏర్పాటు చేస్తామ ని హామీ ఇచ్చాం. అందులో భాగంగా పోలీ సుల పిల్లలకు అంతర్జాతీ య ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగా రెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండి యా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించాం.

పోలీస్‌ శాఖ ఇదే పనితీరును కొన సాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటున్నాను. పారదర్శకత, జవాబుదారీతనం, నై తిక విలువలు పాటించడం పోలీసింగ్ కు మూల స్థంభాలు. ఇవే స మాజాన్ని పోలీసులకు దగ్గరికి చేయడంతోపాటు పో లీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొం ది స్తాయి. సమా జానికి దగ్గరగా ఉండే పోలీ సింగ్ మోడల్‌ను అనుసరించాలి..” అని కోరారు.ఈ కార్యక్ర మం లో రాష్ట్ర డీజీపీ శివ ధర్ రెడ్డి, ఆయా విభాగాలకు చెంది న ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ము ఖ్య మంత్రి పోలీసు సురక్ష రూపొం దించిన “అమరులువారు” పుస్తకా న్ని ఆవిష్కరించారు.