Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM revanthreddy : ప్రజలకు జవాబుదారీగా ప్రజాపాలన

--వినూత్న తరహాలో ఆలోచించండి --ప్రజలకు జవాబుదారీగా ఉండండి --తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దండి --వారానికో రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించండి --నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించండి --అతిత్వరలోనే సీఎం జిల్లాల పర్యటనలు ఉంటాయి --ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

ప్రజలకు జవాబుదారీగా

ప్రజాపాలన

–వినూత్న తరహాలో ఆలోచించండి
–ప్రజలకు జవాబుదారీగా ఉండండి
–తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దండి
–వారానికో రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించండి
–నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించండి
–అతిత్వరలోనే సీఎం జిల్లాల పర్యటనలు ఉంటాయి
–ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశా లు జారీ చేశారు. ఐఏఎస్ ( ias) అధికారులందరూ విధిగా తమ పరిధిలో ని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాపాలనను అం దించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని దిశానిర్దేశం చేశా రు.

అందరూ కలిసికట్టుగా పని చేసి ప్రజలకు సుపరిపాలనను అందించి తీరాలని చెప్పారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు (States)  ఆద ర్శం గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. తమ శాఖల పని తీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన (Cleansing) చేసుకోవాలని సీఎం సూచిం చారు. రాష్ట్ర ప్రజలకు ఉపయో గపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు.

ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్ షిప్ ఐడియాను (A flagship idea) రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు పలువురు ముఖ్యమంత్రులతో పని చేసి న అనుభవమున్న (experianc) అధికారులు ఇప్పటికీ కీలక వి భాగాల్లో ఉన్నారని, ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వ ప్రాధాన్యాతలను గుర్తించి అధికారులు తమ పనితీరును చాటుకోవాలని ముఖ్యమం త్రి స్పష్టంచేశారు.

ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వ హించాలని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేయా లని కోరారు. సచివాలయంలో (Secretariat) మంగళవారం అ న్ని విభాగాల కార్య దర్శులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమావే మయ్యారు.

మంత్రు లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ( komatireddy venkatre ddy ) తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్య మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమీక్షలో (review) పాల్గొన్నారు. మొత్తం 29 విభాగాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులందరూ ఏక తాటిపై పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. సచివాలయం నుంచి క్షేత్రస్థాయి (ground level) వరకు అంద రూ తమ విభాగాలపై పట్టు సాధించాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి న తొలి వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యా రంటీల్లో (six guarantees) అయిదు గ్యారంటీలను అమలు చేసిందని సీఎం చెప్పారు.

తర్వాత వంద రోజులు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్ర మాలు, పనులు నిలిచిపోయాయని, ఇకపై అధికారులు విధిగా పరి పాలనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు. దేశంలోనే అన్ని రాష్ట్రా లకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధి కారులపైనే ఉందని అన్నారు. తమ శాఖల పనితీరును మెరుగుపరి చేందుకు అవసరమైతే అధికారులు, సిబ్బంది ప్రక్షాళనచేసుకోవాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆ లోచనలను ఎప్పటికప్పుడు నేరుగా సీఎంవో (cmo) తో పంచు కో వాలని సూచించారు. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్ షిప్ ఐడియాను రెం డు వారాల్లో ప్రభుత్వానికి (governament) సమర్పించాలని ఆ దేశించారు. ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు అధికారులు క్రమశిక్షణ పాటించాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ప్రజా ప్ర యోజనాలకు ప్రాదాన్యమివ్వాలని సీఎం చెప్పారు.

వేళాపాళలను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి రోజు టైమ్ ప్రకారం సెక్రేటేరియట్లో అందుబాటులో ఉండాలని కోరారు. కేవలం ఆఫీసుల కు పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును  (performan ce)  పర్యవేక్షించేందు కు వారానికి ఒక రోజు విధిగా జిల్లాలకు క్షేత్ర పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. నెలకోసారి అన్ని జిల్లాల ఉన్న తాధికారులతో సమావే శం ఏర్పాటు చేసుకోవాలని, సంబంధిత విభాగం చేపట్టిన కార్యక్రమాలు, జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు.

చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ముఖ్యమంత్రి అ సంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు ప్రజలకు ఉపయోగ పడే పనులు చేయాలని, తమ అనుభవంతో సుపరిపాలన విధానా లు అమలు చేయాలని సూచించారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి సీఎస్ ను ఆదేశిం చా రు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవ లందించే అన్ని విభాగాలను అప్పుడప్పుడు విజిట్ చేయాలని చె ప్పారు.

ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనలు, దుర్ఘటనలన్నింటా అధికారులు సత్వరమే స్పందించాలని కోరారు. అ న్ని శాఖల్లో మెరుగైన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అధి కారులదేనని సీఎం గుర్తు చేశారు.వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్ర భుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు.

వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పని తీరు ఆధారంగానే అధికారులకు తదుపరి ఉన్నత అవకాశాలుంటాయని, బాగా పని చేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని సీఎం అధికారులకు భరోసా ఇచ్చారు. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపే రు తేవద్దని, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని చెప్పారు.

త్వరలోనే వారానికో జిల్లా (district)  పర్యటనకు వెళుతానని ము ఖ్య మంత్రి రేవంత్​ రెడ్డి ఈ సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్ర మాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని ( I will consi der) చెప్పారు. అక్కడి ప్రజలను కలుసుకునేలా తన పర్యటన ఉం టుందని అధికారులను అప్రమత్తం చేశారు. త్వరలోనే తన జిల్లా పర్యటనల షెడ్యూలు విడుదల చేస్తామని చెప్పారు.

CM revanthreddy