CM RevanthReddy BJP Bandi Sanjay సీఎం రేవంత్ రెడ్డికి ‘ బండి’ బహిరంగ లేఖ
--ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటకెక్కించే అవకాశం --రాజకీయ ప్రయోజనాల కోసమే ట్యాపింగ్ కేసుపై విచారణ ఆలస్యం --ఫోన్ ట్యాపింగ్ అతి తీవ్రమైన నేర మైనందునే సిబిఐ విచారణ కోరాం --సీఎం రేవంత్ కు బహిరంగ లేఖలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
సీఎం రేవంత్ రెడ్డికి
‘ బండి’ బహిరంగ లేఖ
–ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటకెక్కించే అవకాశం
–రాజకీయ ప్రయోజనాల కోసమే ట్యాపింగ్ కేసుపై విచారణ ఆలస్యం
–ఫోన్ ట్యాపింగ్ అతి తీవ్రమైన నేర మైనందునే సిబిఐ విచారణ కోరాం
–సీఎం రేవంత్ కు బహిరంగ లేఖలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారం చేపట్టిన తర్వాత అనేకానేక అక్రమాలు వెలుగుచూసినా సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహించడం సబబు కాదని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అన్నింటి మాదిరిగానే అత్యంత నేర మైన ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా ఆటకెక్కించే ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు.కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.
ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని బండి సంజయ్ వ్యాఖ్యా నించారు.రాజకీయ ప్రయో జనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయి లో ఒత్తిళ్లు కొనసాగుతున్నాయని అన్నారు. భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ ద్రుష్టికి వచ్చిందన్న సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కారకులు కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచా రిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయత పెరుగుతుందని ఆశా భావం వ్యక్తంచేశారు.ఆ పని చేయకపోవడంవల్లే సీబీఐ విచారణ కోరుతున్నామని చెప్పారు.ఫోన్ ట్యాపింగ్ అత్యంత తీవ్రమైన నేర మని, ప్రజాప్రతినిధులకు రాజ్యాం గం, ప్రజాస్వామ్యం ప్రసాదించిన హక్కులను కూడా ఫోన్ ట్యాపింగ్ తో కాలరాశారని విచారం వ్యక్తం చేశారు.
భార్యాభర్తలు మాట్లాడుకు నే అంశాలను కూడా ట్యాపింగ్ చేసి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారులు, బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలుసహా పలువురు సెల బ్రిటీ లను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పాటు తమ అవసరాల ను తీర్చుకున్నారని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేకంగా పరికరాలు తెప్పిం చారని, బీఆర్ఎస్ ఓడిపోయాక ఫోన్ ట్యాపింగ్ పరికరాల ధ్వంసం పేరుతో దేశ భద్రతకు, ఉగ్రవాదు లకు సంబంధించిన కీలకమైన సమాచార డేటాను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు.వ్యాపార సంస్థలు, ప్రతిపక్షాలకు విరాళాలు ఇవ్వకుండా ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నారని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికాలో తలదా చుకున్నా ఎందుకు రప్పించలేక పోయారని ప్రశ్నించారు. ఫోన్ ట్యా పింగ్ పై వాస్తవాలు నిగ్గు తేలాలంటే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యా ప్తు సంస్థలు జోక్యం అనివార్యమని వ్యాఖ్యానించారు.మీరే సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయాలని, రాష్ట్రం లోకి సీబీఐ రాకుండా గత ప్రభు త్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాలపై సైబర్ దాడికి కారకుడైన మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచారణ జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. రాజ్యాంగంపై ప్రమా ణం చేసి రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘించిన కేసీఆర్ ను, కేటీఆర్ లు ఎమ్మె ల్యే పదవులకు అనర్హులని తెలంగాణ శాసనసభా నాయకుడిగా ఉ న్న మీరు కేసీఆర్, కేటీఆర్ లను అనర్హులుగా ప్రకటించే విష యంపై స్పీకర్ కు లేఖ రాయాలని కోరారు.