Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM RevanthReddy BRS Ktr : రేవంత్ రెడ్డి లీకువీరుడు

--అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం -- ఏ ఒక్క హీరోయిన్ తోనూ నాకు సంబంధం లేదు --తప్పుడు ప్రచారం చేస్తే సహించబోను --చేరికలకు పార్టీ గేట్లు ఎత్తడం కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తు --ప్రకృతి కరువు కానే కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు -- రేవంత్ సర్కార్ పై బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజo

రేవంత్ రెడ్డి లీకువీరుడు

–అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం
— ఏ ఒక్క హీరోయిన్ తోనూ నాకు సంబంధం లేదు
–తప్పుడు ప్రచారం చేస్తే సహించబోను
–చేరికలకు పార్టీ గేట్లు ఎత్తడం కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తు
–ప్రకృతి కరువు కానే కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు
— రేవంత్ సర్కార్ పై బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజo

ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం లీకుల వీరుడని బిఆర్ఎస్ కార్యనిర్వహక అద్యక్షుడు కేటీఆర్ ( ktr) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయిందని ప్రభుత్వం ఏర్పాటైన ఇంకా కూడా అబద్ధాలతోనే కాలం వెళ్ళబుచ్చున్నారని విమర్శించారు. తనకు ఏ సినిమా హీరో యిన్ తో సంబంధం లేదని, తన క్యారెక్టర్  తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వారి తాట తీస్తామంటూ హెచ్చరించారు. మిషన్ భగీరథను సక్రమంగా నిర్వహించటం కూడా కాంగ్రెస్ ప్రభు త్వానికి చేతకావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం లో మాట్లా డారు. ఇది ప్రకృతి ప్రకోపo వల్ల వచ్చిన కరువు కాదని, అసమర్ధ కాంగ్రెస్ వల్ల వచ్చిన కరువని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు ఉన్నా వినియోగించుకోవడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నా రు. ఫోన్ ట్యాపింగ్ మీద కాకుండా వాటర్ ట్యాప్ మీద దృష్టి పెట్టా లని హితవు పలికారు. చేరికల కోసం పార్టీ గేట్లు ఎత్తడం కాకుండా రైతుల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM RevanthReddy) కేటీఆర్ సూచించారు.

తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల్లో సాగుకు నీరు అందించే అవకాశా లు ఉన్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కావాలని కుట్ర పూరితంగా రైతు లకు సాగు నీరు ఇవ్వలేదని విమర్శ లు గుప్పించారు. నాగార్జున సా గర్, సింగూరు, ఎల్లంపల్లి, ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ లో నీళ్లు ఉన్నా యని కేటీఆర్ గుర్తు చేశారు. చుట్టూ నీళ్లు ఉండగా హైదరాబాద్ వాసులు ఎందుకు ట్యాంకర్లతో నీటిని కొంటున్నారని ప్రశ్నించారు. మీకు ఓటు వేయలేదని నగర ప్రజలపై కక్ష కట్టారా అని నిలదీశారు. సాగర్ నుంచి 14 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉందని ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ చేసే తెలివి కూడా లేదని దుయ్యబట్టారు.

సాగు నీరు ఇవ్వ కుండా పంటలు ఎండిపోయేలా చేశారని, కాళేశ్వ రం నుంచి జల పరవళ్లు తొక్కుతున్నా ప్రభుత్వా నికి సోయి లేదన్నా రు. పంటలు ఎండిపోవాలనేదే కాంగ్రెస్ ఉద్దేశమని, పంటలు పండి తే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఇలాంటి కుట్రలకు తేరలేపారని కేటీఆ ర్ ఆరోపించారు. తన క్యారెక్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తా తెలంగాణలో సంచల నం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై నా కేటీఆర్ స్పందిం చారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సం బంధం లేదని పునరుద్ఘాటించారు.

తాను ఎవరినో హీరోయిన్ ను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడు తున్నారని అదంతా అవా స్తమని కొట్టిపారేశారు. బిఆర్ఎస్ ను వీ డిన ఇద్దరు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నిక ఖాయం అని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి మళ్ళీ వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సుప్రీం కోర్టు కూ డా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. పార్టీలు మారి న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై కచ్చితంగా కోర్టుకు వెళ్తామన్నారు.

స్టేషన్ ఘన్పూర్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావటం ఖాయమని కేటీ ఆర్ వ్యాఖ్యానించారు. ఆ రెండు స్థానాలను భారాస గెలుచుకుంటుం దని వెల్లడించారు. భవిష్యత్ లో ఇంకా పార్టీ మారిన వారి స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయని హెచ్చరించారు. ఆదివారం వరకు అనర్హత వేటుపై గడువు ఇస్తున్నా మన్నారు. లేని పక్షంలో కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ట్యాపింగ్ వ్యవహారానికి తనుకు ఎలాంటి సంబంధం లేదని మళ్లీ మళ్లీ చెబుతున్నానని వ్యాఖ్యానించారు.

అలాగే అనవసర ఆరోపణలు చేస్తే ఎవరినీ వదిలి పెట్టబోమని తాను ఎవరికీ భయడనని వార్నింగ్ ఇచ్చారు. మంత్రైనా, ముఖ్య మంత్రి అయినా  తాటతీస్తామన్నారు. దమ్ముంటే, సీఎం రేవంత్ భాషలో మొగోడు అయితే ఫోన్ ట్యాపింగ్ పై 2004 నుంచి ఇప్పటి వరకు విచార ణ చేసి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

*ప్రజల గొంతుకలు తడపండి*… రాష్ట్రంలో గొంతెండి ప్రజలు గొడవ చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గొంతు చించుకుని అబ ద్ధాలు చెబుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించా రు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తాగునీటి కష్టాలు లేవని కేసీఆర్ అంటే నీళ్లు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు అని సాగు నీరు లేక పల్లెలు, తాగు నీరు లేక పట్టణాలు తల్లడిల్లుతున్నాయ న్నారు.

కేసీఆర్ జనగామ, నల్గొండ పర్యటనకు వెళ్లగానే గాయత్రి, నంది పంపు హౌజ్ ఎలా ప్రారంభం అయిందో చెప్పాలని, ఇన్నాళ్లు ఆ నీటిని ఎందుకు దాచి పెట్టారని, పంటలు ఎండే పరిస్థితి ఎందుకు తెచ్చారని,  కొట్టుకుపో యిందన్న కాళేశ్వరం నుంచి జల పరవళ్ళు ఎలా తొక్కాయని ప్రశ్నల వర్షం కురిపించారు.ఇది కాలంతో వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. ఓటు వేయ లేదని హైదరాబాద్ ప్రజలపై సీఎం కక్ష కట్టారా, ఎందుకు హైదరాబాద్‌ కు మంచి నీరు ఇవ్వడంలేదు, ట్యాంకర్‌లు ఎందుకు బుక్ చేసుకునే పరిస్థితి వచ్చింది అని కేటీఆర్ ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో ఒక్క మార్చిలోనే 2 లక్షల 30 వేల ట్యాంకర్‌లు బుక్ చేసుకున్నారని, ఈ ట్యాంకర్‌లకు బిల్లులు ముఖ్యమంత్రి కడతారా అని నిలదీశారు. ట్యాంకర్లను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తు న్నాన న్నారు. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ నింపాలన్నారు. పాల న అనుభవం లేదని, నేర్చుకోవాలి అన్న జిజ్ఞాస కూడా లేదని విమ ర్శించారు.

ఎవరు ఆత్మహ త్యలు చేసుకుంటారో, ఎక్కడ పంటలు ఎండుతయో మేము చెబితే ఇక ప్రభుత్వం ఎందుకన్నారు. అయినా ఆత్మహ త్యలు చేసుకున్న 218 రైతుల వివరాలు పంపిస్తామన్నారు. ఫోన్ ట్యాపిం గ్‌లో అప్పటి అధికారులకు భాధ్యత లేదా,  రవిగుప్తా, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి బాధ్యులు కాదా ఒక్క కేసీఆర్ మాత్రమే బాధ్యుడా అని కేటీఆర్ ప్రశ్నించా రు. ఫోన్ ట్యాపింగ్‌పై 2004 నుంచి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.