CM RevanthReddy chevella meeting : అల్లాటప్పాగాళ్ళం కాదు అన్నీoటిని అధిగమించే వచ్చాం..
--అషామాషి అవాకులు చవాకులు అనవసరంగా వద్దు --నువ్వు, మీ అయ్యే కాదు ఎవ్వరొచ్చినా కుర్చీని తాకలేరు --కార్యకర్తల కష్టం మీద వచ్చినోళ్ళము కబర్ధార్ --నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తే కడుపుమంటతో చస్తున్నారు -- త్వరలో మెగా డీఎస్సీ, మార్చి ఏప్రిల్‌లలో 7వేల ఉద్యోగాల భర్తీ --మీరు మోగొల్లైతే ఒక్క ఎంపీ సీటైన గెలవండి చూస్తాం --చేవెళ్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం
అల్లాటప్పాగాళ్ళం కాదు..
అన్నీoటిని అధిగమించే వచ్చాం..
–అషామాషి అవాకులు చవాకులు అనవసరంగా వద్దు
–నువ్వు, మీ అయ్యే కాదు ఎవ్వరొచ్చినా కుర్చీని తాకలేరు
–కార్యకర్తల కష్టం మీద వచ్చినోళ్ళము కబర్ధార్
–నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తే కడుపుమంటతో చస్తున్నారు
— త్వరలో మెగా డీఎస్సీ, మార్చి ఏప్రిల్‌లలో 7వేల ఉద్యోగాల భర్తీ
–మీరు మోగొల్లైతే ఒక్క ఎంపీ సీటైన గెలవండి చూస్తాం
–చేవెళ్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం
ప్రజా దీవెన/ హైదరాబాద్: రాష్ట్రానికి నేనే సీఎం, నేనే పీసీసీ అధ్యక్షుడిని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు చేతనైతే, దమ్ముంటే, నువ్వు మగాడివైతే నీ పార్టీకి ఒక్క సీటు గెలిపించి చూపించు అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మేం అల్లాట ప్పాగాళ్లం కాదు, అయ్యని అడ్డుపెట్టుకుని కుర్చీ తీసుకోలేదు, జెండా లు మోసి, అక్రమ కేసులు ఎదుర్కొని చర్లపల్లి జైల్లో మగ్గినా భయప డకుండా, లొంగకుండా నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందపెట్టి ఈ కుర్చీలో కూర్చున్నామని, ఈ కుర్చీ ఇనాం కింద వచ్చిందో, అయ్య పేరుతో వచ్చిందో కాదని తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.
నలమల్ల అడవి నంచి తొక్కుకుంటూ నీలాంటి వాళ్ల నెత్తిమీద కాళ్లు పెట్టి మా కార్యకర్తలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారని, ఇది మా కార్యకర్తల త్యాగం, పోరాటాల ద్వారా వచ్చిందని అవేశంతో ప్రసంగిం చారు. మంగళవారం చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజా తర సభలో రేవంత్ మాట్లాడారు. నువ్వు మగాడివైతే వచ్చే పార్లమెం ట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మీ పార్టీకి ఒక్క సీటు గెలిపించి చూపించు అని సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ చేశారు.
నువ్వు వస్తావా, నీ అయ్య వస్తాడా మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డా అంటూ హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు పొద్దున లేస్తే చెత్త వాగుడు వాగుతూ ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, మేమెప్పు డు కూర్చుంటామా అని ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వం మూడు నెల లు ఉండదంటే మరొకరు ఆరు నెలలు ఉండదంటారు, ఆ సన్నాసు లకు చెప్పదలచున్నా, ఎవడైనా ఈ ప్రభుత్వం ఉండదని మాట్లాడితే మా కార్యకర్తలు పట్టుకుని చెట్టుకు కట్టేసి కొడతారని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి అని చెబితే కాంగ్రెస్‌కు మూడు సీట్లు కూడా వచ్చేవి కావని ఓ సన్నాసోడు అంటున్నాడు, కేటీఆర్‌కు ఈ వేదిక మీద నుంచే సవాల్ విసురుతున్నా ఈరోజు వారు మమ్మ ల్ని భుజాల మీద మోసినంత కాలం నువ్వు, మీ అయ్య మాత్రమే కాదు వాళ్ల దేవుడు కూడా కుర్చీని తాకలేడoటూ దుయ్యబట్టారు.
సోషల్ మీడియా ఉంటే మేము గెలిచే వాళ్లమని కేటీఆర్ అంటున్నా రు, ఉన్న టీవీలన్నీ మీచుట్టపోళ్లవే కదా మాకేమైనా టీవీ ఉందా, పే పర్ ఉందా సాయంత్రం సేద దీరడానికి జూబ్లీహిల్స్‌లో సినిమా వాళ్ల గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయా, మా కార్యకర్తలు కష్టపడి నిలబడి పోరాడితే మాకు ఈ అధికారం వచ్చిందని, మీరు చేసే తప్పుడు పనులను మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారని తెలిపారు.
మాకు ఏ ట్యూబ్ అవసరం లేదు, చివరికి దివాళా తీసి యూట్యూబ్ చానల్ పెట్టుకుంటామంటున్నాడు, అలాగే కృష్ణానగర్‌లో బ్రోకర్ దం దా కూడా పెట్టుకో రెండు కలిస్తే బాగానే నడుస్తాయని సూచించారు. తెలంగాణను దోచుకుంటే ప్రజలు చెప్పుతో కొట్టారనే విషయం వారికి అర్ధం కావడంలేదని, మీరు పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకు తింటే ప్ర జలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీతో బీఆర్‌ఎస్ కలిసి ఇద్దరూ కలిసి నాటకాలాడుతు న్నారని ఆరోపించారు.
మీ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థం కావా, అల్లం బెల్లంలాగా అలయ్ బలయ్ చేసుకుంటున్నారని, చీకట్లో కలిసిపోతూ పగలు కొట్టుకుంటున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. మధ్య చీకటి ఒ ప్పందం లేకుంటే కేటీఆర్‌ను సీఎంను చేస్తానని కేసీఆర్ మోదీ వద్ద ఎందుకు ప్రతిపాదన పెట్టారని, ఆయనేమైనా వీరి కుటుంబ పెద్దా, కుల పెద్దా, గుజరాత్ మోడల్ అంటే ఏంటి పదేళ్లపాటు ప్రధానమం త్రిగా మోదీ లేరా పేదలందరికీ ఇళ్లు ఎందుకు కట్టలేదని గుజరాత్ మోడల్ అంటే ఊర్లోవాళ్లను తగలబెట్టడం, ప్రభుత్వాలను పడగొట్ట డం, ఇతర రాష్ట్రాలకు వచ్చే కంపెనీలను గుజరాత్‌కు తరలించడం కాదా అని ప్రశ్నించారు. మాట వినని వాళ్లను జైల్లో పెట్టడం, ఈడీని, ఇన్‌కమ్ ట్యాక్స్, సీబీఐను ఉసికొల్పడమేనా అన్నారు.
రైతులకు రెట్టింపు ఆదాయం ఇస్తామని చెప్పి ఢిల్లీలో రైతులను కాల్చి చంపుతున్నారని, ఇక్కడ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మనిషి మంచోడే కానీ ఆయన పార్టీ సక్కగ లేదు, ఆయనే చెప్పాడు ఈ పార్టీలో ఏదో ఆశించి చేరితో అలా జరగడం లేదని చెప్పారు.అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపించాలి అని రేవంత్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ఫ్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మల్లు రవి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు