Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cm RevanthReddy fire : సారూ కారు గ్యారేజికే మళ్ళీ రోడ్డేక్కేది మర్చిపోండి

--పిట్టలదొరకే తాతయ్య అవతారం లో కేసీఆర్ --మా ఎమ్మెల్యేలను ముట్టుకో మాడి మసై పోతావ్ --పాలమూరు ప్రజలు మంచి చెడు లను గ్రహించండి --గడీల దొరలను ఇకపై నమ్మితే నట్టేట ముంచుతారు --మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

సారూ కారు గ్యారేజికే

మళ్ళీ రోడ్డేక్కేది మర్చిపోండి

–పిట్టలదొరకే తాతయ్య అవతారం లో కేసీఆర్
–మా ఎమ్మెల్యేలను ముట్టుకో మాడి మసై పోతావ్
–పాలమూరు ప్రజలు మంచి చెడు లను గ్రహించండి
–గడీల దొరలను ఇకపై నమ్మితే నట్టేట ముంచుతారు
–మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాదీవెన, మహబూబ్ నగర్: బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ సారు ఆయన కారు రెండు గ్యారేజ్ కి వెళ్ళాయని, మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి లే దని ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి ( CM Revanth Re ddy) ఎద్దేవా చేశారు. ఆయ న కారు గ్యారేజీలో మూలకు పడ్డదని అది పాత ఇనుము సామానో డికి అమ్ముకోవడానికి తప్ప పనికిరాద ని వ్యాఖ్యానించారు.

మాఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటావా, కాంగ్రెస్ ఎమ్మెల్యే లను ము ట్టు కుంటే మాడి మాసై పోతావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్ర వారం మహబూబ్​నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీచంద్‌ రెడ్డి నామినే షన్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

అంతకు ముందు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు తన ఇం టి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్ళగా వేలాది మంది కార్యక ర్తలు పాల్గొన్న ఈ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి కెసిఆర్ పై, బిఆర్ఎస్ ( brs ) పై నిప్పులు చెరిగారు. ఈ పదేళ్లలో పాలమూరు కు కేసీఆర్​ ఏం చేశా రని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

ఏం చేశారని పాలమూ రు ప్రజలు బీఆర్​ఎస్​కు ఓటేయా లనీ, పాల మూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టామన్న ఆయన, గులాబీ పార్టీ పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చిందని దుయ్యబట్టారు. ఇప్ప టికైనా పాలమూరు ప్రజలు కళ్లు తెరిచారన్న సీఎం, గడీ దొరలను నమ్మవద్దని నమ్మితే నట్టేట ముంచుతారని అన్నారు.

మాదిగల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న రేవంత్‌రెడ్డి, అందుకోసం పార్లమెంట్‌, సుప్రీంకోర్టులో పోరాడతామని హామీ ఇచ్చారు. వంశీచంద్‌కు ఓటే సి దిల్లీ పంపించి మహబూబ్‌ న గర్‌ అభివృద్ధి కి తోడ్పాటు అందించాలని కోరారు. 20 మంది ఎమ్మె ల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు.

ఇక్కడ కాపలా ఉన్న ది రేవంత్‌రెడ్డి అని, మా ఎమ్మెల్యేల ను ముట్టు కో చూద్దాం మాడి మసైపోతావు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పాల మూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టా మని అయితే ఈ పదే ళ్లుగా జిల్లాను ఎడారిగా మార్చారని ద్వజమెత్తారు.

పాలమూరు రం గారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా, పార్ల మెంటులో నిద్రపోవ డాని కేనా భారాసకు ఓటు వేయాలని రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చే సిందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం మూడునెలలు మాత్రమే అయ్యిందని, పిట్టల దొరకు తాతయ్యగా కేసీఆర్ తయారయ్యారని విమర్శించారు.

పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. పనిలోపనిగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణపైనా విరుచుకుపడ్డారు. పదేళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ ( m odi) గల్లీ లో కేసీఆర్ పాలనను చూశామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కట య్యాయ ని, తమను ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించా రు.

లక్ష మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థు లను గెలిపించాలని ప్రజలను కోరా రు. ఎంపీ ఎన్నికల్లో పాలమూరు లో కాంగ్రెస్ జెండా ఎగురు తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ పాలమూ రు నుంచి గెలిచి చేసిందేమి లేదని విమర్శించారు. పాల మూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని, పాల మూరు లిప్ట్ ను కూడా పూర్తి చేయలేదన్నారు.

గతంలో పాల మూరుకు మంత్రి పదవులు కూడా దక్కలేదని, డీకే అరుణ కూడా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. పాల మూరు అభివృద్ధి కావలంటే 2 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిపించాలని కోరారు సీఎం రేవంత్, వంశీచంద్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించా లన్నారు.కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయ ని తనకు ఎమ్మెల్యేలను కాపాడు కునే శక్తి ఉందని సీ ఎం ధీమా వ్యక్తం చేశారు.