CM RevanthReddy government revenge formers : రాజకీయ కక్షతోనే రైతు పొట్టకొడుతోన్న కాంగ్రెస్
--మండుటెండల్లో రైతులకోసం కేసీఆర్ పొలాల్లోకి వెళ్తుంటే --మంత్రులు ఎసి రూములో క్రికెట్ చూస్తున్నారు --దేశానికే ఆదర్శంగా తయారైన వ్యవసాయాన్ని వంద రోజుల్లో ఆగంచేశారు --రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయకపోతే అధోగతే --కాంగ్రెస్ ప్రభుత్వం ఆలీబాబా 40 దొంగల తరహాలో ఉంది --రైతుబంధు ఇవ్వకపోవడంతో రైతులు అప్పులు చేసి సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది --అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల బాధ్యత బిఆర్ఎస్ దే --ఒక్కో మిల్లర్ వద్ద రూ. రెండు కోట్లు వసూళ్ళు చేయడమే మిల్లర్ల ఇష్టారాజ్యానికి కారణం --సూర్యాపేటలోని వాణిజ్య భవన్ సెంటర్ లో రైతులు, బిఆర్ఎస్ శ్రేణులతో కలసి రైతు దీక్ష లో మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి
రాజకీయ కక్షతోనే
రైతు పొట్టకొడుతోన్న కాంగ్రెస్
–మండుటెండల్లో రైతులకోసం కేసీఆర్ పొలాల్లోకి వెళ్తుంటే
–మంత్రులు ఎసి రూములో క్రికెట్ చూస్తున్నారు
–దేశానికే ఆదర్శంగా తయారైన వ్యవసాయాన్ని వంద రోజుల్లో ఆగంచేశారు
–రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయకపోతే అధోగతే
–కాంగ్రెస్ ప్రభుత్వం ఆలీబాబా 40 దొంగల తరహాలో ఉంది
–రైతుబంధు ఇవ్వకపోవడంతో రైతులు అప్పులు చేసి సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది
–అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల బాధ్యత బిఆర్ఎస్ దే
–ఒక్కో మిల్లర్ వద్ద రూ. రెండు కోట్లు వసూళ్ళు చేయడమే మిల్లర్ల ఇష్టారాజ్యానికి కారణం
–సూర్యాపేటలోని వాణిజ్య భవన్ సెంటర్ లో రైతులు, బిఆర్ఎస్ శ్రేణులతో కలసి రైతు దీక్ష లో మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన, సూర్యాపేట: కళ్ళముందే నాశనం అవుతున్న రైతుల కోసం ఆరోగ్యం సహకరించకున్నా మండే ఎండలను సైతం లెక్క చే యకుండా రైతుల కన్నీళ్లు తుడిచేందుకు కెసిఆర్ వెళ్తుంటే, ఏసీ రూ ములో కూర్చుని మంత్రులు (ministers) క్రికెట్ చూసుకుంటూ రైతాంగం పట్ల ప్రభు త్వానికి ఉన్న చిన్న చూపుకు నిదర్శనంగా ని లుస్తుందని మాజీమం త్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( ex minister jagadeeshReddy) తీవ్రస్థాయి లో మండిపడ్డారు.
రైతులకు అండగా టిఆర్ఎస్ తలపెట్టిన పోరుబా టలో భాగంగా సూ ర్యాపేటలోని వాణిజ్య భవన్ సెంటర్ లో శనివారం జరిగిన రైతు దీక్ష లో రైతులు, బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొ న్నారు.ఈ సందర్భం గా మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దునిద్ర వదిలించేం దుకే దీక్షలు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ చ్చిన తర్వాత 200 మం దికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రని వెల్లడించారు. రాజ కీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది రైతుల పొట్టలు కొట్టిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దేశానికే తలమానికంగా కేసీఆర్ తయారు చేసి న వ్యవసాయ రంగాన్ని వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆగంచే సిందని మండిపడ్డారు.రెండు రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ వెం టనే అమలు చేయకపో తే ఆత్మహత్యలు మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్ర భుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎండిన ప్రతి గింజ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.
రెండు లక్షల రుణ మాఫీ, క్వింటాకు 500 బోనస్, ఎండిన పంటల పై లెక్కలు తేల్చి ఎకరానికి 25 వేల నష్ట పరిహారం వెంటనే చెల్లించా ల ని డిమాండ్ చేశారు. ఆలీబాబా 40 దొంగల తరహా లో రాష్ట్రంలో పా లన ఉందన్న జగదీష్ రెడ్డి, దొంగల భరతం పట్టే బాధ్యతను బిఆ ర్ఎస్ తీసుకుంది అన్నారు. రైతుబంధు ( raithu bandhu ) ఇవ్వకపోవడంతో రైతులు అప్పులు చేసి సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంగా ఉన్నా ప్రజ ల కోసం పనిచేయడమే బిఆర్ఎస్ బాధ్యత అన్నారు.ప్రభుత్వంపై పోరాడేందుకు ఎటువంటి తెగింపుకైనా రైతాంగం సిద్ధంగా ఉండాలి అనీ పిలుపు నిచ్చారు. బి ఆర్ఎస్ పాల నలో క్వింటా కు 2500 గిట్టు బాటు ఉన్న ధాన్యం ద్వా రా నేడు 2100 అవడం వెనుక కారణాలను మాజీ మంత్రి భట్టబ యలు చేశారు. ఒక్కో మిల్లర్ వద్ద రెండు కోట్లు అక్రమ వసూల్లు చే యడమే ధర తగ్గడానికి, మిల్లర్ల ఇష్టారాజ్యానికి కారణం అన్నారు.
క్వింటాకు రైతులకు రావాల్సిన 400 రూపాయలు మంత్రుల జేబు ల్లోకి వెళ్లిందని ఆరోపించారు.జిల్లా మంత్రి ఒకరికి తెలియకుండా మరొకరు ఇలా నలుగురి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకున్నాడని ఆరోపించారు. తె లంగాణ రైతుల చెమట దళారులు ఢిల్లీ పెద్దల పాలు అవుతుందని అవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పోరాటంతో ప్రభుత్వం దిగివస్తుం దని భావిస్తున్నామన్నారు.
చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లనే తరిమికొట్టిన కేసీఆర్ కు చిల్లర నా యకులను తరమడం పెద్ద పని కాదన్నారు. రైతుల కోసం ఎన్నికల నిబంధనలను పక్కన పెడదామని కెసిఆర్ చెప్పినా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు.అధికారం మూర్ఖుల చేతుల్లోకి వెళ్ళిందన్నా రు. కట్టిన ఇళ్లు, పొట్టిన పొయ్యి ఉన్న ఏం చేయలేని చేతగాని రoడ ప్రభుత్వం వచ్చిందన్నారు.
కెసిఆర్ ను బదనం చేయడం, టిఆర్ఎస్ ను ప్రజల నుండి దూరం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని అన్నారు. రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్తితి ఉన్నా కావాలనే పిల్లర్లు కుంగాయని ప్రచారం చేశారని అన్నారు. రాష్టం లో సాగు, తాగు నీటి సమస్య మీద రివ్యూ చేసినోడే లేరన్నారు. టాంకర్ల తో నీటిని తరలిం చి పొలం కాపాడు కోవాలని రైతులు అగచాట్లు పడుతున్నారని అన్నారు.
తెలంగాణ లొ వసూళ్లు చేసి ఢిల్లీ లో ముడు పులు కడుతున్నారని అన్నారు.ఇది ప్రజా సమస్యలు పట్టని బరి తెగిం పు ప్రభుత్వం అ న్నారు. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వంపై కాళేశ్వరం జలాల మొద టి పలితం అందుకు న్న సూర్యాపేట ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఏ పోరాటానికైన సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.చైతన్యానికి ప్రతీక సూర్యాపేట గడ్డ రైతుల కోసం కొట్లాడటానికి ఎప్పుడూ సిద్ధమే అన్నారు.