CM RevanthReddy Musi river renovation : మూసీ మురిపించేనా
--సుందరీకరణ దిశగా అడుగులకు రేవంత్ ప్రభుత్వం సన్నద్ధం --మూసీనదికి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ అనుమతుల నిలిపివేత --సంపదను సృష్టించే వనరుగా ఉపయోగించుకోవాలని నిర్ణయం --మూసీ సుందరీకరణపై హెచ్‌ఎండీ ఏ అధికారులకు ఆదేశాలు
మూసీ మురిపించేనా
–సుందరీకరణ దిశగా అడుగులకు రేవంత్ ప్రభుత్వం సన్నద్ధం
–మూసీనదికి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ అనుమతుల నిలిపివేత
–సంపదను సృష్టించే వనరుగా ఉపయోగించుకోవాలని నిర్ణయం
–మూసీ సుందరీకరణపై హెచ్‌ఎండీ ఏ అధికారులకు ఆదేశాలు
ప్రజాదీవెన/ హైదరాబాద్: లండన్ థేమ్స్ నది తరహాలో హైదరాబా ద్ మూసీ నదిని సుందరీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ( CM Re vanthReddy) ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. ఆ దిశగా చ ర్యలు కూడా చేపట్టింది. మూసీ సుందరీకరణపై హెచ్‌ఎండీఏ ( H mda) అధికారులకు కీలక ఆదే శాలు కూడా జారీ చేశారు. నదిలో తాగునీరు పారే విధంగా చర్యలు తీసుకోవా లన్నారు. సంపదను సృష్టించే వనరుగా ఉపయోగించు కోవాలన్నా రు. అందులో భాగంగా నదిని సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు. మూ సీ నది అభివృద్దిలో భాగంగా తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీ సుకుంది. మూసీనది నుంచి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ, లేఅవు ట్ అనుమతులను నిలిపే యాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.
వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులనూ అనుమ తించ వద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇటీవల ఉత్తర్వు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను నదికి ఇరువైపులా వెంటనే అమ లు చేయాలని జోనల్ కమిషనర్లు, ఉప కమిషనర్లు, ప్రణాళికాధికా రులు, సహాయ ప్రణాళికాధికారులను ఆదేశించారు. ఎంఆర్‌డీసీ ఎల్ (మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అభ్యర్థన మేర కు జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.
మూసీ నదిలో మంచి నీ ళ్లు పారించాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం మూసీ నదిపై ఇటీవల సర్వే జరగ్గా బఫర్ జోన్‌లో నిర్మాణ పనులను అధికారులు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో నది పొడవునా ఎలాంటి కట్టడాలను అనుమతించవద్ద ని సంబంధిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ప్రంచాయతీలు, జీహె చ్‌ఎంసీకి ఎంఆర్‌డీసీఎల్ లేఖ రాయగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ తా జా ఉత్తర్వును జారీ చేశారు. రెవెన్యూ హద్దును ప్రామాణికంగా చేసు కుని 50 మీటర్ల బఫర్‌లో అనుమతులు ఇవ్వొద్దని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది.