Cm RevanthReddy review house sites : ఆరింటిలో ఇంకొకటి ఆరంభం ఇందిరమ్మ ఇళ్ళు
--ఈనెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ళ పథకం ప్రారంభం --అర్హులైన పేదలoదరికి లబ్ధిచేకూరేలా మార్గదర్శకం --సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం --మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లతో శ్రీకారం --విధి విదానాల రూపకల్పనపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఆరింటిలో ఇంకొకటి ఆరంభం
ఇందిరమ్మ ఇళ్ళు
–ఈనెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ళ పథకం ప్రారంభం
–అర్హులైన పేదలoదరికి లబ్ధిచేకూరేలా మార్గదర్శకం
–సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం
–మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లతో శ్రీకారం
–విధి విదానాల రూపకల్పనపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ప్రజా దీవెన/ హైదరాబాద్: ఆరు గ్యారెంటీ పథకాల అమలులో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆరింటి లో మరొకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ( CM RevanthReddy) నిర్ణయం తీసుకున్నా రు. దీంతో అందుకు అవసరమై న ఏర్పాట్లు చేయాలని అధికారుల ను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలని నిర్ణయించారు.
శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పధాన కార్యదర్శిశాంతికుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించా రు. అందుకు అనుగుణంగా విధి విధానాలను తయారు చేయాలని చెప్పారు.
ప్రజాపాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధా న్యమివ్వాలని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ ఇండ్ల ( double bed rooms) నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా, అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూ డాలని అధికారులను అప్రమత్తం చేశారు. ముందుగా ఒక్కో నియో జకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం తన ఆకాం క్షను వ్యక్తం చేశారు.
ఇందిర మ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారని, ఇల్లు లేని నిరుపేదల కు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారని వెల్లడించారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలనుసిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గద ర్శకాలు రూపొందించాలని ( Formulate strict guidelines) చెప్పారు.
సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకా ల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సీఎం సూ చించారు. లబ్ధిదారులు సొంత ఇల్లు తనకు అనుగుణంగా నిర్మాణం చేపట్టినప్పటికీ తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివి ధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సీఎం సూ చించారు. జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని చెప్పారు.