Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM RevanthReddy two guarantees : మరో రెండు గ్యారంటీలపై మేధోమథనం 

--ఈ నెల 27 లేదా 29వ తేదీన ప్రారంభానికి రంగం సిద్ధం --గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు శ్రీకారం --విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సమీక్ష

 మరో రెండు గ్యారంటీలపై మేధోమథనం 

–ఈ నెల 27 లేదా 29వ తేదీన ప్రారంభానికి రంగం సిద్ధం

–గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు శ్రీకారం

–విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం  రేవంత్ రెడ్డి సమీక్ష

ప్రజా దీవెన/హైదరాబాద్: గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిం డర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ( CM RevanthReddy) అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులం దరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి కేబినేట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు డు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారం టీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్ష లకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలుగా ( two guarantees) గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమ లు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించా ల్సిన విధి విధానాలపై చర్చించారు.

ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సి లిండర్ అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ( Direct beneficiaries of government subsidy) ఖాతాకు బదిలీ చేయాలా, ఏజె న్సీలకు చెల్లించాలా, అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సా ధ్యాసాధ్యాలపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎలాగైనా సరే లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిం డర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపి ణీ చేసే ఏజెన్సీలతో చర్చలు (Negotiations with gas cylinder dispensing agencies) జరపాలని సూచించారు. ప్రభుత్వం త రఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లిం చేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

అనుమానాలు అపోహాలకు తావు లేకుండా గృహ జ్యోతి (gruha Jyothi) పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యు త్తు శాఖ అధికారు లను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథ కం వర్తింపజేయా లని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశా రు. మార్చి మొద టి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పు డు అర్హులైన వారం దరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.

ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశమివ్వాలని సీఎం సూచించారు. విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు.

ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్తు శాఖ తగినంత ప్రచారం కూడా చేపట్టాలన్నారు. తప్పులను సవరించుకున్న అర్హులం దరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపజేయాలని చెప్పారు. అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు.

ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొన సాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ డీఎస్ చౌహ న్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.