Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM RevanthReddy water Sagar lifts : పండ్ల తోటలను పరిరక్షించడం

--సాగర్ ఆయకట్టులో లిఫ్ట్ లతో ఎండుతున్న తోటలను రక్షించాలి --లిఫ్టులు, తూముల కింద యుద్ధ ప్రాతిపదికన చెర్వులను నింపాలి --తోటలను రక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది --మాజీమంత్రి, సూర్యాపే ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి

పండ్ల తోటలను పరిరక్షించడం

–సాగర్ ఆయకట్టులో లిఫ్ట్ లతో ఎండుతున్న తోటలను రక్షించాలి
–లిఫ్టులు, తూముల కింద యుద్ధ ప్రాతిపదికన చెర్వులను నింపాలి
–తోటలను రక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది
–మాజీమంత్రి, సూర్యాపే ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి

ప్రజా దీవెన/ మిర్యాలగూడ: నాగార్జున సాగర్ ఆయకట్టులో వెంట నే లిఫ్ట్ లను నడిపించి ఎండిపోతున్న పండ్ల తోటలను రక్షించాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. ఎడమ కాలువ పరి ధిలో లిఫ్టులు, తూము ల ద్వార యుద్ధ ప్రాతిపదికన చెరువులను నింపాలన్నారు. నీరు లేక ఎండిపోతున్న లక్షల ఎకరాల పండ్ల తోటల ను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

సాగర్ జలాశయంలో నీరు ఉన్నా, వాటిని ఉపయో గిం చుకోకుండా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిం చిందన్నారు. నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా నీళ్లు ఇవ్వ కుండా రైతుల పొలా లను ఎండబెట్టింద న్నారు. కాళేశ్వరం పైచెడు ప్రచారం చేసి, విధి లేని పరిస్థితుల్లో నిన్న మొన్న మోటార్లను ఆన్ చేసి హడా వుడిగా నీళ్లు వదిలారని, అ ప్పటికే పొలాలన్నీ నిలువైన ఎండిపోవడం తో లాభం లేకుండా పోయిందన్నారు.

ప్రతిపక్ష పార్టీగా రైతుల తరఫు న పోరాటం మొదలు పెట్టాం అన్న జగదీష్ రెడ్డి, స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారన్నారు. ప్రభుత్వం మెడలు వంచేదాకా మా పోరాటం ఆగదన్నారు. రేపు అన్ని నియో జక వర్గాల్లో నిరసన దీక్ష చేస్తున్నాం అ న్నారు.ఎస్ ఎల్ బి సి కింద కూడా నీటి విడుదల చేసి చెరువులను నింపాలని డిమాండ్ చేస్తు న్నామని అన్నారు.

ప్రాజెక్టుల్లో నీటిని సద్వి నియోగం చేసుకునే తెలివి కూడా ఈ ప్రభు త్వానికి లేదని దుయ్య బట్టారు. మూర్ఖత్వంతో అవగాహన రాయి త్యంతో నిర్లక్ష్యంతో పాలన చేస్తున్నారని విమర్శించారు. కరెంటును కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్న జగదీష్ రెడ్డి, కరెంటు నిర్వహణ లేకపోవ డంతో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బం దులు ఎదురవుతున్నా యన్నారు. ఎంతసేపు దోచుకోవడం పైనే సీఎం కు మంత్రులకు ధ్యాస ఉన్నదని మండిపడ్డారు.

నెలలో సగం రోజు లు సీఎం ఢిల్లీలో ఉంటు న్నాడని, సామంత రా జు లాగా ఢిల్లీకి కప్పం కడుతున్నాడని ఆరోపించారు. గ్రామాల్లో పశు పక్షాదులు తాగునీరు లేక అల్లాడుతు న్నా, జిల్లా మంత్రు లకు కనీస బాధ్యత లేదన్నారు. అసలు జిల్లా మంత్రులు ఉన్నారా లేదో కూడా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. జిల్లా మంత్రులకు సిగ్గులేదు, రైతులు చస్తున్నా పట్టిం పు లేదన్నారు.

జిల్లా మంత్రులు అక్రమ దందాలపైనే బిజీగా ఉన్నా రని ఫైరయ్యారు. జిల్లా మంత్రులు ఇద్దరు చేతకా నివారని, ఒక్కరికీ కూడా పాలనపై పట్టు లేదు, ప్రజ లంటే లెక్క లేద న్నారు. రైతుల సమస్యలపై రేపు బిఆర్ఎస్ తల పెట్టే దీక్షలలో పెద్ద ఎత్తున బిఆర్ శ్రేణులు పాల్గొని రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.