Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CmRevanthReddy : సీఎం రేవంత్ రెడ్డి కీలకప్రకటన, వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మరో నాలుగున్నర ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మరో నా లుగున్నర ఇందిరమ్మ ఇండ్లు మం జూరు

CmRevanthReddy:  ప్రజా దీవెన, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మరో నాలుగున్నర ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. భ ద్రాద్రి కొత్తగూడెం ( kothagudem) జిల్లా బెండాలపాడులో ఇం దిరమ్మ ఇండ్ల పైలా న్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఇండ్ల నిర్మాణం పూర్తి చేసు కుని గృహప్రవేశం చేసుకున్న కుటుం బాలతో కొద్దిసేపు గడిపారు. గృహప్రవేశం చేసిన ఇండ్లను ఒక్కొక్క టిగా పరిశీలించారు. కుటుంబ సభ్యులతో కలిసి చాప మీద కూర్చొ ని వారిచ్చిన అల్పాహారం తీసుకున్నారు. గృహ ప్రవేశం చేసిన కు టుంబాలకు చీరలను బహూరకరించారు. గృహ ప్రవేశం చేసిన సం దర్భంగా కుటుంబ సభ్యుల అనుభూతిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికుల బాగో గులను అడిగి తెలుసుకున్నారు. అంద రూ సంతోషంగా ఉన్నారా, సన్నబి య్యం వస్తున్నాయా, రేషన్ కార్డు లు వచ్చాయా వంటి అం శాలను అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామానికి ఎన్ని ఇండ్లు మం జూరయ్యాయని ప్రశ్నించినప్పుడు 312 ఇండ్లు మంజూరైనట్టు ఆ నందంగా చెప్పారు.

ఇండ్లు మంజూరైన వారంతా సంతో షంగా, చల్లగా ఉండాలని ముఖ్య మంత్రి ఆకాంక్షిస్తూ పిల్లలను బాగా చదివించాలని, వారికి పెళ్లిళ్లయ్యాక వారికీ ఇండ్లిస్తామని చెప్పారు. గృహ ప్రవేశం చేసుకు న్న ముహూర్తాన చిరు జల్లులు కురవడం శుభసంకేతమని అన్నా రు.

గడిచిన పదేండ్లలో ఏటా రెండు లక్ష ల ఇండ్లు కట్టినా రాష్ట్రంలో ఇప్పటి కి 20 లక్షల ఇండ్లు పూర్తయ్యేవని అన్నారు. మొదటి విడతగా 4.5 ల క్షల ఇండ్లు మంజూరు చేశామని చె బుతూ వచ్చే రెండేండ్లలో మరో నాలుగున్న లక్షల ఇండ్లిస్తామని ప్రకటించారు.