CMRevanthReddy : కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ భూములివ్వాలని వినతి
CMRevanthReddy : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టను న్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ర క్షణ శాఖ భూములు బద లాయించాల ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢి ల్లీ పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో వారి నివాసంలో సమావేశమయ్యారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్న ప్రణాళికపై ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి సమగ్రంగా వివరించారు.
ఈ రెండు నదుల సంగమ స్థలంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మా ణం చేపడతామని, ఇందుకు అక్క డ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు (defence lands) రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలు వలకు సంకేతంగా ప్రతిష్టాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు ( saro ver project) నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలె డ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాం డ్ స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం మ్యూజియం నిర్మిస్తామని వివరించారు.
రాజ్‌నాథ్ తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఎంపీ లు పొరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొ రేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇవి నర సింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డా క్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.