Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMRevanthReddy: సీఎం రేవంత్ కీలక ప్రకటన, ప్రపంచపర్యాటక రంగంలో సమున్నత స్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది

 

CMRevanthReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ లో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటిం చారు. పర్యాటక రంగంలో ప్రపం చం లో సమున్నత స్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చే స్తోందని స్పష్టం చేశారు. పెట్టుబ డులకు, పర్యాటకులకు సంపూర్ణ ర క్షణ కల్పిస్తామని చెప్పారు.ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున శిల్పా రామం, సంప్రదాయ వేదికలో ‘టూ రిజం కాంక్లేవ్ -2025’ లో ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృ ష్ణారావు, వా కిటి శ్రీహరి, సలహాదారు వేం నరేం దర్ రెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పర్యా టక రంగంలో వి విధ ప్రాజెక్టులపై ప్ర భుత్వంతో కు దిరిన ఎంఓయూ లను ముఖ్య మంత్రి సమక్షంలో అందజేశారు.

ఈ సందర్భంగా కాంక్లేవ్‌ను ఉద్దేశిం చి ముఖ్యమంత్రి చేసిన ప్రసం గం యావత్తు ఆయన మాటల్లోనే…తె లంగాణ ఏర్పడిన తర్వాత గత ప దేళ్లుగా పర్యాటక రంగంలో రాష్ట్రా నికి ప్రత్యేక విధానం లేదు. తమ ప్ర భుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించ డమే కాకుండా మొట్టమొదటి తె లంగాణ టూరిజం కాంక్లేవ్ -2025 నిర్వహిం చ డం అభినందనీయం. వివిధ టూరిజం ప్రాజెక్టుల కోసం 15 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టు బడులను ఆకర్షించాం. టూరిజం రంగంలో పెట్టుబడులకు తెలంగాణ లో ఎన్నో అవకాశాలు ఉన్నా యి. అందుకే, అధికారులు ఈ ఏడాది 5 0 వేల కోట్ల మేరకు పెట్టు బడులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.

హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ లాంటి ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. టైగర్ రిజర్వు, కవాల్ టైగర్ రిజర్వ్, వారస త్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొంది న రామప్ప దేవాలయం తో పాటు, వేయి స్తంభాల గుడి, ఆలంపూర్ శ క్తి పీఠాలు ఇలా చె ప్పుకుంటూ పోతే అనేక ప్రత్యేకతలున్న ప్రాంతాలున్నాయి.

తెలంగాణలో అత్యుత్తమ, సాం స్కృతిక పర్యాటక ప్రాంతాలున్నా యి. అందుకే ఎకో టూరిజం, మెడి కల్ టూరిజం, టెంపుల్ టూరి జం ఇలా అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తు న్నాం. గొప్ప సాంస్కృతిక వార సత్వం కలిగిన హైదరాబాద్ ఓల్డ్ సి టీ కాదు. ఒరిజినల్ సిటీ. ప్రపం చ నగరాలతో పోటీ పడాలన్న లక్ష్యా న్ని పెట్టుకున్నాం. ఐటీ, ఫార్మా రం గాలే కాదు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలి.

ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో మిస్ వరల్డ్ పోటీ లను నిర్వహించాం. హైదరాబాద్ అత్యం త సురక్షితమైన నగరం. పెట్టుబడు లు, పర్యాటకుల రక్షణ విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.ఈ కార్య క్రమంలో టూరిజం కార్పొరేషన్ చై ర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ ఫిలిమ్ డెవల ప్మెంట్ కార్పొరేషన్ చై ర్మన్ దిల్ రాజు, టూరిజం శాఖ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి జయేశ్ రం జన్, తెలంగాణ డీజీపీ జితేందర్ తో పా టు ఉన్నతాధికారులు పాల్గొ న్నారు. టూరిజం రంగంలో ఉత్తమ సేవలు అందించిన వివిధ సంస్థలకు ఈ కార్యక్రమంలో అవార్డుల ను బహూకరించారు.