Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 8:50 am Posted by : praja deveena

CmRevantReddy : సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, తండోపతండాలుగా తరలివచ్చి ఉజ్వలతెలంగాణలో పాలుపంచుకోండి

 

CmRevantReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తరలిరండి ఉజ్వల తెలంగాణలో పాలుపం చుకోండి..” అన్న నినాదం తో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపం చం లో పేరొందిన ప్రముఖులు, పారిశ్రా మిక వేత్తలు, టెక్నాలజీ రం గనిపుణులు హాజరుకానున్నారు. డి సెం బర్ 8, 9 తేదీల్లో హైదరా బాద్​ భారత్ ఫ్యూచర్ సిటీ (Bharath Future City) లో జరగ నున్న ఈ సద స్సు నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతు న్నాయి. హైదరా బాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అం తర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు.

ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రము ఖులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయ ర్ , ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డై రెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గ జం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరే ట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నట్టు ఇప్పటికే సమా చా రం పంపించారు.UAE రాజవం శానికి చెందిన, ఎమి రేట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ డైరెక్టర్ షేఖ్ తారిక్ బిన్ ఫైజల్ అల్ ఖసిమి, రస్ అల్ ఖైమా (RasAlKha ima h) ప్రతినిధులు,

డుయిష్ బోర్సే (Deutsc he Börse) గ్రూప్ హెడ్ లు డ్విగ్ హిం జెల్మన్ (Ludwig Heinz elm ann), ఎన్రిషన్ (Enrission) వ్యవ స్థాపక భాగస్వామి విన్స్టన్ (Win ston), మాండయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ (Mandai WildLife) గ్రూప్ సీఈఓ బెన్నెట్ నియో ( Bennett Neo)తో పాటు పలు టెక్ కంపెనీల సీఈవో లు, పెట్టు బడిదారులు, స్టార్టప్ వ్య వస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు.

2047 నాటికి వికసిత్ భారత్ – జా తీయ వృద్ధి లక్ష్యాలకు అనుగు ణం గా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రై జింగ్ 2047’ దార్శనికపత్రం తయా రు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళితవృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌ మ్యాప్‌ను రూపొందించింది.

ఈ లక్ష్యాలను ప్రభుత్వం సంకల్పా న్ని ప్రపంచ వేదికపై ప్రదర్శిం చేం దుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరా బాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Risi ng Global Sum mit 2025) ను నిర్వహిస్తున్నాం. తప్పకుండా తరలిరండని ము ఖ్యమoత్రి పేరిట సం దేశంతో ఆహ్వాన లేఖలు పంపించారు.

తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడు లకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్ట మై న లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధ న అంశాలను ఈ వేద కగా చాటి చె ప్పాలని ప్రభుత్వం సంకల్పించింది.

*లియోనెల్ మెస్సీ..* రెండు రో జుల పాటు జరిగే సదస్సులో డి సెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2 047 డాక్యుమెంట్‌ను ముఖ్య మంత్రి ఆవిష్కరిస్తారు.తర్వాత ఈనెల 13న ప్రపంచ ఫుట్‌ బాల్ దిగ్గజం, గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) లయనెల్ మెస్సీ హైదరా బాద్‌కు రానున్నారు. ఆయన పా ల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బా ల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్ర త్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుంది.