Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Ila Tripathi : జిల్లా కలెక్టర్ అప్పీల్, ఆరబెట్టిన పత్తిని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి

 

Collector Ila Tripathi : ప్రజా దీవెన, మునుగోడు: అకాల వ ర్షాలను దృష్టిలో ఉంచుకొని పత్తి రై తులు రెండు మూడు రోజులు ఆగి పత్తిని ఆరబెట్టుకుని కొనుగోలు కేం ద్రాలకు తీసుకురావాలని జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. శు క్రవారం ఆమె నల్గొండ జిల్లా ము ను గోడు మండల కేంద్రంలో కాటన్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లో బాలాజీ కాటన్ ఇండ స్ట్రీస్ లో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేం ద్రాన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ కాటన్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, మిల్లర్ల తో ముఖాముఖి మాట్లాడారు. రైతు లకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుం డా పత్తిని కొనుగోలు చేయాలని చె ప్పారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్ట ర్, డిసిసిబి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి లు పత్తి తేమశాతాన్ని పరిశీలించారు. అంతేకాక తూకం యంత్రం ద్వారా తూకాన్ని పరీక్షించారు .తేమ 8 నుండి 12 శాతం లోపు ఉండేవిధం గా కొనుగోలు కేంద్రాలకు తీసుకు రా వాలని కలెక్టర్ రైతులకు చెప్పారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ము నుగోడు పత్తి కొనుగోలు కేంద్రం అతి ముఖ్యమైందని,ఎల్ 1 సెంటర్ గా ఉన్న ఈ కేంద్రంలో గతంలో రైతులు ఇతర జిల్లాల నుండి పత్తిని తీసుకు వచ్చే వారని, అప్పుడు జిల్లా రైతు లు పత్తిని అమ్మడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ,ఈ సంవత్సరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా కిసాన్ కపాస్ యాప్ ను ఏ ర్పాటు చేసిందని, ఈ యాప్ ద్వా రా ముందుగా స్లాట్ బుక్ చేసుకు న్న రైతుల పత్తి సరైన తేమ శాతం తో ,నాణ్యతా ప్రమాణాలతో ఉంటే అదేరోజు కొనుగోలు చేయడం జరు గుతుందని ఆమె తెలిపారు.

ఒక సీజన్ లో రైతు మూడు సార్లు స్లాట్ బుక్ చేసుకోవచ్చని, ఒకవేళ ఏదైనా కారణం చేత బుక్ చేసుకు న్న స్లాట్ ను క్యాన్సల్ చేసుకోవచ్చ ని ,ఆ స్లాట్ అలాగే ఉంటుందని స్ప ష్టం చేశారు. మునుగోడు కేంద్రంలో 1900 మెట్రిక్ టన్నుల పత్తిని కొ ను గోలు చేసే సామర్థ్యం ఉన్నందున చుట్టుపక్కల రైతులకు పత్తి అమ్మ కంలో ఎలాంటి ఇబ్బందులేదని చె ప్పారు. ఈ రెండు మూడు రోజులు రైతులెవరు స్లాట్ ను బుక్ చేసుకో వద్దని, వర్షాలు తగ్గిన తర్వాత స్లా ట్ బుక్ చేసుకోవాలని,పత్తిని బాగా ఆరబెట్టి తీసుకురావాలన్నారు.

ఒకవేళ వర్షంలో స్లాట్ బుక్ చేసు కు ని వస్తే తేమ ఎక్కువగా ఉంటే తి ప్పి పంపే అవకాశం ఉంటుందని,ఈ విషయంలో రైతులు పూర్తిగా సహ కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అ నంతరం జిల్లా కలెక్టర్ మునుగోడు మండలం కచలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిఖంగా త నిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, అ మ్మిన ధాన్యం వివరాలను అడిగి తె లుసుకున్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవా లని, రైతులు కొనుగోలు కేంద్రం వద్దే ఉండి ధాన్యాన్ని టార్పాలిన్ లతో కప్పిఉంచాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అ దనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ,కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికా రి బాలాజీ నింజె, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, పౌరసరఫరాల జిల్లా మేనే జ ర్ గోపి కృష్ణ ,మార్కెటింగ్ ఎడి ఛా యాదేవి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు కలెక్టర్ వెంట ఉన్నారు.