Communist leader: మహోన్నత వ్యక్తి… అనంతరామ శర్మ
సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి తెలంగాణ పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు పెన్నా అనంతరామ శర్మ అని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
వారి ఆశయాలు.. ఆదర్శాలు నేటి యువతరానికి మార్గదర్శకం
కమ్యూనిస్టు లేకపోతే దేశానికి భవిష్యత్తు లేదు
సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
కమ్యూనిస్టులకు చివరికి మిగిలేది ఎర్రజెండా మాత్రమే
చనిపోయిన వ్యక్తి పై ఎర్రజెండా కప్పుకోవడమే నిజమైన కమ్యూనిస్టు
కేంద్ర కమిటీ సభ్యులు చేరుపెల్లి సీతారాములు
ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో: సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి తెలంగాణ పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు పెన్నా అనంతరామ శర్మ(Anantha rama sharma) అని సిపిఐ(ఎం)(CPIM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనములో ఏర్పాటుచేసిన ఆయన పార్దివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ కి ఇంకా భవిష్యత్తు లేదని గుడ్డిగా నమ్మి మేము ముందుకు పోవడం లేదని కమ్యూనిస్టు లేకపోతే దేశానికి భవిష్యత్తు లేదని అన్నారు.
అనంత రామ శర్మ ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించాడని పేర్కొన్నారు.నిరంతరం పేదల హక్కుల కోసం పోరాడిన అనంతరామ శర్మ(Anantha rama sharma) మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. ఆయనతో నాకు సన్నిహిత సంబంధం ఉందని నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి శర్మ అని పేర్కొన్నారు. నేటి రాజకీయాలు కలుషితమయ్యాయని నేటి నాయకులు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లో పనిచేయాలని సూచించారు.
వారి ఆశయాలు, ఆదర్శాలు నేటి యువతరానికి మార్గదర్శకం అని అన్నారు. కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని తెలిపారు.
అనంతరామ శర్మ మరణం కమ్యూనిస్టు పార్టీలకు ముఖ్యంగా సిపిఎం పార్టీకి తీవ్ర నష్టం అన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు చేరుపెల్లి సీతారాములు మాట్లాడుతూ పెన్నా అనంత రామశర్మ ప్రజా సంఘాలలో బాధ్యతలు నిర్వహించి కార్మికుల సమస్యలు పరిష్కరించాడని అన్నారు. కమ్యూనిస్టులకు చివరికి మిగిలేది ఎర్రజెండా మాత్రమే అని పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తి పై ఎర్రజెండా కప్పుకోవడమే నిజమైన కమ్యూనిస్టు అని తెలిపారు. పెన్నా అనంతరామ శర్మ మరణం ఎంతో బాధాకరమని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అనంత శర్మ స్వార్థక ఉద్యమకారుడని ప్రజా ఉద్యమంలో కలిసి పనిచేశాడని అన్నారు. రాజకీయాలలో సౌమ్యంగా ఉంటూ కఠిన నిర్ణయాలు తీసుకుంటాడని అన్నారు. ఆయన జీవితం స్వార్థకమైందన్నారు.
ఆయన ఆశయాలు నేటి యువత ముందుకు తీసుకుపోవాలని సూచించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ వయసులో తేడా ఉన్న ఉద్యమంలో కలిసి పని చేశామని తెలిపారు. అసంఘటిత రంగాన్ని సంఘటితం చేయడంలో అనంత శర్మ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పార్టీలో నిర్మాణ సమస్యలు వచ్చినప్పుడు నిబద్ధతతో నిలబడతాడని అన్నారు. రహస్యాలలో పనిచేస్తున్న కార్మికులకు సలహాలు ఇచ్చేవాడని తెలిపారు.రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మీ మాట్లాడుతూ పెన్నా అనంతశర్మ మరణం పంచతంత్ర ఉద్యమానికి, పార్టీకి తీరని లోటు అని అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అనంత శర్మ కమ్యూనిస్టు భావాలను, సిద్ధాంతాలను పాటించాడని తెలిపారు. ఆయన ఆశయాలకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజి నరసింహారావు మాట్లాడుతూ అనంత శర్మ సిపిఎం పార్టీలో సిఐటియు యూనియన్ కు సలహాదారుడుగా వ్యవహరిస్తూ ఎన్నో కార్మికుల సమస్యలు పరిష్కరించాడని తెలిపారు.
ఆయన మరణం కార్మిక లోకానికి తీరని లోటు అని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ చిన్న వయసు నుండి ఎర్రజెండా(communist party) పట్టి మరణించే వరకు అనంత శర్మ ఎన్నో పోరాటాలు చేశాడని అన్నారు. పోరాటంలో ఆటుపోటులు, ఆటంకాలు ఎదుర్కొంటూ ముందుకు సాగాడని తెలిపారు . ఆయన అడుగుజాడల్లో నేటి యువత ముందుకు సాగాలని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి కార్యదర్శులు, మల్లు నాగార్జున రెడ్డి, ఎండి జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, పాలడుగు నాగార్జున, నారి ఐలయ్య, పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, బండ శ్రీశైలం, చిన్నపాక లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Communist leader Anantha rama sharma passed away