Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

రైతులకు గుడ్ న్యూస్

ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రంలో చాలా చోట్ల పంట నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట నేలకొరిగింది. మామిడి, నిమ్మ, బత్తాయి వంటి ఉద్యాన వన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం
ఎకరానికి రూ.10వేలు ఇవ్వడానికి సిద్ధం

ప్రజాదీవెన, హైదరాబాద్: ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రంలో చాలా చోట్ల పంట నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట నేలకొరిగింది. మామిడి, నిమ్మ, బత్తాయి వంటి ఉద్యాన వన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి ధాన్యం అయితే పంట పొలంలోనే మెులకలు వచ్చాయి. దీంతో అన్నదాత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రతిపక్ష నేత, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. పంట నష్ట పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. తాజాగా.. రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 15,246 మంది రైతులకు చెందిన 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనాకు వచ్చింది. ఈ మేరకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.15.81 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎన్నికల సంఘం అనుమతితో నేడో రేపో రైతుల ఖాతాల్లోకి పరిహారం డబ్బులు జమ చేయనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక రైతు రుణమాఫీ, వరికి రూ. 500 బోనస్ అంశంపై సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు. ఎన్నికల హామీలను నిలబెట్టుుకంటామని.. ఆగస్టు 15 తేదీలోపు రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వరికి ప్రకటించిన రూ. 500 బోనస్‌ను కూడా వచ్చే సీజన్ నుంచి రైతులకు అందజేస్తామని చెప్పారు.

Compensation for crops