Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Comprehensive development with educational development విద్యాభివృద్ధి తోనే సమగ్రాభివృద్ధి

విద్యాభివృద్ధి తోనే సమగ్రాభివృద్ధి

నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

ప్రజా దీవెన/నల్లగొండ:విద్యాభివృద్ధి తోనే సమాజం సమగ్రాభివృద్ధి చెందుతుందని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి నిర్వహించ తలపెట్టిన విద్యా మహోత్సవం 2023 కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సదరు కార్యక్రమం వాల్ పోస్టర్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ(Telangana )రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ఎంతో కృషిచేస్తుందని కొనియాడారు. విద్యా ఉపాధి పరంగా విద్యార్థులకు(students)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తుoదని వివరించారు.

నల్లగొండ నియోజకవర్గ లోని మూడు మండలాలలో ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలలో పదవతరగతి పబ్లిక్ (public) పరీక్షలలో ఉన్నత గ్రేడు సాధించి , పాఠశాలలో ప్రదములుగా నిలిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారంతో సన్మానించే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. గాంధీ జ్ఞాన్ ప్రతిస్థాన్, గాంధీ గ్లోబల్ ఫామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యనాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా మహోత్సవం నిర్వహణలో గాంధీ (gandhi)   సంస్థలను భాగస్వాములు చేసినందుకు ఎమ్మెల్యే (mla )కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

నల్లగొండ నియోజకవర్గం లోని 95 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలో విశిష్ట గ్రేడు సాధించిన 172 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారం,ఉన్నత ఫలితాల కై కృషిచేసిన 95 మంది ప్రాధానోపాధ్యాయులకుఆత్మీయ పురస్కారం అంతేగాకుండా నీట్, జెఈఈ ప్రవేశ పరీక్షలలో ఉత్తమ ర్యాoకులు సాధించిన విద్యార్థుల అభినందించ నున్నట్లు తెలిపారు, ముఖ్యo గా ప్రభుత్వ పాఠశాలల్లో 10జి.పి.ఏ సాధించి విద్యార్థులందరికి 10 వేల రూపాయల నగదు పారితోషకం అందించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమములో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందిడి సైదిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సుంకరి భిక్షం గౌడ్, జాన్ రెడ్డి, శంకరయ్య గౌడ్, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్,రావుల శ్రీనివాస్ రెడ్డి, గాంధీ సంస్థల రాష్ట్ర కన్వీనర్లు గిరిధర్ గౌడ్ పోట్లపల్లి, బొమ్మపాల గిరిబాబు, ముక్కాముల నర్సింహ యాదవ్, ఎం.నాగమణి, జిల్లా ప్రతినిధులు ఆజీజ్, జ్యోతివెంకట్రెడ్డి, దాసరివెంకన్న, కుంభం అంజయ్య, ఎం.అరుణ,చంద్రశేఖర్,కోట్ల సైదులు, వై రాధిక, గుర్రం లింగారెడ్డి, గొర్రె వెంకట్ రెడ్డి, ఏస్ రవిబడేర్ రెడ్డి,గంజి అశోక్. మరియు వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.