Concession in school fees for children of journalists: జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజులో రాయితీ
-- జిల్లా కలెక్టర్ కు టీయూడబ్ల్యుజే హెచ్- 143 వినతి
జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజులో రాయితీ
— జిల్లా కలెక్టర్ కు టీయూడబ్ల్యుజే హెచ్- 143 వినతి
ప్రజా దీవెన/నల్లగొండ: నల్లగొండ జిల్లాలో వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50% రాయితీ అవకాశం కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (tuwj h -143) జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ కోరారు. సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ కు వినతిపత్రం అందజేసి సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేర్చడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని అలాంటి జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో స్కూల్ ఫీజులను రాయితీ ఇస్తున్నప్పటికీ నలగొండ జిల్లాలో మాత్రం అమలు కావడంలేదని, తక్షణమే అమలయ్యేలా డీఈఓ కార్యాలయం నుంచి అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేయించాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ ఆర్. వి కర్ణన్ సానుకూలంగా స్పందించి డీఈఓతో మాట్లాడి సర్కులర్ జారీ చేసే విధంగా, ప్రైవేట్ పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దీకొండ రవిశంకర్, శ్రీనివాస్, గాదె రమేష్, అంజయ్య, డెస్క్ జర్నలిస్టులు లక్ష్మీనారాయణ వెంకటేశ్వర్లు, ఆరిఫ్, సురేష్, నియోజకవర్గ నాయకులు దండంపల్లి రవికుమార్, ఉబ్బని సైదులు, వెంకట మధు, భాస్కర్, శివ, కారింగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.