Congress addresses corruption and irregularities: అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
--బోఫోర్స్ కేసులో పీకల లోతు కూరుకపోయిన చరిత్ర గాందీ కుటుంబానిది -- రాహుల్ కు ఉన్న ఏకైక అర్హత వారసత్వ అర్హతనే -- చెప్పుకోవడానికి ఏమీ లేకనే నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పుతున్నారు -- కాంగ్రెస్ నేతలకు జ్ఞానం, విజ్ఞానం, విచక్షణ, వినయం లేనేలేవు --కేసీఆర్ మీద మాట్లాడటం అంటే సూర్యుడి మీద ఉమ్మివేయడమే
అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
–బోఫోర్స్ కేసులో పీకల లోతు కూరుకపోయిన చరిత్ర గాందీ కుటుంబానిది
— రాహుల్ కు ఉన్న ఏకైక అర్హత వారసత్వ అర్హతనే
— చెప్పుకోవడానికి ఏమీ లేకనే నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పుతున్నారు
— కాంగ్రెస్ నేతలకు జ్ఞానం, విజ్ఞానం, విచక్షణ, వినయం లేనేలేవు
–కేసీఆర్ మీద మాట్లాడటం అంటే సూర్యుడి మీద ఉమ్మివేయడమే
ప్రజా దీవెన/సూర్యాపేట: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గే ను మూలన పడేసిన గాంధీ కుటుంబం కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరం గా (It is ironic that the Gandhi family, which cornered President Kharge, talks about family rule) ఉందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యాపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మంత్రి నిన్న రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. రాహుల్ కు ఉన్న ఏకైక అర్హత వారసత్వ అర్హత నే అని (He said that Rahul’s only right is inheritance right) పేర్కోన్నారు. కుంభకోణాలకు , అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
పగలు దొంగతనం చేస్తూ దొరికిపోయిన పగటి దొంగ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ చదువుతున్నారని (Rahul is reading a script written by a day thief who was caught stealing) విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష కోట్ల లోపే ఉంటుందని, అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా అంటారని ప్రశ్నించారు. ఇంత అవినీతి జరిగితే ఎందుకు పిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయం అన్నారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అన్నారు. మోడీ దయా దాక్షిణ్యల మీద బతుకుంది గాంధీ కుటుంభం అన్నారు. బోఫోర్స్ కేసులో పీకల లోతు కూరుకు పోయిన చరిత్ర గాందీ కుటుంబానిదని ( The history of the Bofors case is that of the Gandhi family) మంత్రి, గుజరాత్ ఎన్నికల్లో అటువైపు చూడకపోవడమే కాంగ్రెస్, బిజెపి ల లాలూచీ రాజకీయాలకు నిదర్శనం అన్నారు.
తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేకనే నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతుర్రు అని మండి పడ్డారు. కాంగ్రెస్ నేతలకు జ్ఞానం, విజ్ఞానం, విచక్షణ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ బ్రతుకు నాశనం అయింది నే అవాకులు చవాకులు పలుకుతున్నారని అన్నారు.కేసీఆర్ మీద మాట్లాడటం అంటే సూర్యుడి మీద ఉమ్మివేయడమే అన్నారు.
కేసీఆర్ వల్లే తెలంగాణ ససశ్యామలం అయిందని అన్నారు. ఏ యాత్ర ను చివరి వరకు ముగించిన చరిత్ర రాహుల్ కు లేదన్నారు. ఏ యాత్రలు బీఆర్ఎస్ జైత్రయాత్ర ను అపలేవన్నారు. తెలంగాణా లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం అన్నారు.
ఈ సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి,బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాల వెంకటనారాయణ గౌడ్, జిల్లా గ్రంధాల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.