Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Congress confidant activity: కాంగ్రెస్ కాన్ఫిడెంట్ కార్యాచరణ

-- భారీగా పార్టీలో చేరికలపై పక్కా ప్లాన్ --అధికారంలోకి రాగానే ఆదరిస్తామని వాగ్దానాలు --అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైనం --చేరికలపై పెద్ద, చిన్న నేతలతో సంప్రదింపులు -- ఇక మీదట జోరందుకోనున్న కాంగ్రెస్ లోకి చేరికలు

కాంగ్రెస్ కాన్ఫిడెంట్ కార్యాచరణ

— భారీగా పార్టీలో చేరికలపై పక్కా ప్లాన్
–అధికారంలోకి రాగానే ఆదరిస్తామని వాగ్దానాలు
–అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైనం
–చేరికలపై పెద్ద, చిన్న నేతలతో సంప్రదింపులు
— ఇక మీదట జోరందుకోనున్న కాంగ్రెస్ లోకి చేరికలు

ప్రజా దీవెన/నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం తో అనుసరిస్తున్న వ్యూహాలు వరుస చేరికలకు బలం చేకూరుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ నేతలే లక్ష్యంగా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని బిఆర్ఎస్ నేతలను పార్టిలో చేర్చుకుంటూ అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల శామ్యూల్, కోదాడలో కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, హుజూర్నగర్ లో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనా రవి, నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో  పాటు ఏడుగురు కౌన్సిలర్లు, గుర్రంపోడు జడ్పిటిసి గాలి రవికుమార్ తదితరులు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకోగా, 12 నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీలో అసమ్మతి గుoబనంగా ఉంది.

ఆయా నియోజకవర్గాల్లో ఎప్పుడు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. రాష్టoలో రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ విపక్ష నేతలను అక్కున చేర్చుకుని ఆయా పార్టీలను దాదాపు క్లోజ్ అనే స్థాయికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఆయితే పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడంతో తెలంగాణ లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఊహించని విధంగా జోష్ వచ్చింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వచ్చిరాగానే కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి సారించింది.

ఈ నేపద్యంలో కేవలం ఇతర పార్టీల చేరికలే కాకుండా ప్రధానంగా సీఎం  కేసీఆర్ నేతృత్వంలోని బిఅర్ఎస్ నేతలే లక్ష్యంగా హస్తం పార్టీ ఊహించని విధంగా వ్యూహాలకు పదును పెడుతోంది. బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇలా చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు, చేరుతూనే ఉన్నారు.

మరో వైపు రాష్ట్రస్థాయి. పాపులారిటీ ఉన్న గులాబీ నేతలను లాగేందుకు కాంగ్రెస్ ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక బీఆర్ఎస్ కు చెందిన గ్రామ స్థాయి లీడర్లు మొదలు మండల, జిల్లా స్థాయి నేతలనూ ఆకర్షించే ప్రయత్నాలను కాంగ్రెస్ ప్రారంభించింది.

నేతల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా..వార్డు స్థాయి నుంచి వాంటెడ్ లీడర్  వరకు ఒక్కొక్కరిగా అందరినీ గులాబీ పార్టీకి దూరం చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుoది.

రాష్ట్రస్థాయి నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఇలా చిన్న పెద్దాయన తేడా లేకుండా బిఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చు కోవడం ద్వారా గులాబీ అభ్యర్థుల్లో గందరగోళాన్ని సృష్టించడంతో పాటు కాన్ఫిడెన్స్  తగ్గించవచ్చని కాంగ్రెస్ బలంగా నమ్ముతున్నది.

ఇప్పుడు పోల్ మేనేజ్ మెంట్ లో కీలకంగా వ్యవహరించే లోకల్ నాయకులు, కార్యకర్తలను డీమోరల్ చేసే పనిపై దృష్టి సారించిందని చెప్పవచ్చు. పోలింగ్ కు ఇంకా నెలకు పైగా  సమయం ఉండడంతో అప్పటికల్లా వీలునన్ని చేరికలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుoది.

ఇందులో భాగంగానే అనేక నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్, వైస్ చైర్మన్, చైర్పర్సన్, మేయర్ తదితర స్థాయిల్లోని లీడర్లను ఆకట్టుకునేపనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది.

అధికార పార్టీలో అసంతృప్తిలే వరంగా…. బీఆర్ఎస్ పై ప్రజల్లో  వ్యక్తమవుతున్న వ్యతిరేకత, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న అసంతృప్తులు, ప్రజలకు సమాధానం చెప్పుకోలేని నిస్సహాయత, పదేoడ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కింది స్థాయి నేతలకు తగిన అవకాశాలు కల్పించకపో వడం, నియోజకవర్గ స్థాయిలో రాజకీయంగా ఎదగ నివ్వకపోవడం.

ఇలాంటివన్నీ ఆ పార్టీ నుంచి నేతలు దూరం కావడానికి కారణ మయ్యాయని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఈసారి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కాంగ్రెస్ కు పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారని, అందుకే బీఆర్ఎస్ ను విడిచిపెట్టాలనే నిర్ణయానికి నేతలు వచ్చారని పేర్కొంటున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నవారందరికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా అవకాశాలు, కీలక పదవులు దక్కుతాయని హామీ ఇస్తున్నారు.