Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Congress Minister komatireddy venkatreddy elections : పార్లమెంటు ఎన్నికల్లో పక్కా పద్నాలుగు హస్తగతం

--బిఆర్ఎస్ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు --పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కట్టలే, రేషన్ కార్డ్ ఇవ్వలేదు --పదేళ్లలో ఫామ్ హౌస్ కే పరిమిత మయ్యాడు --రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

పార్లమెంటు ఎన్నికల్లో

పక్కా పద్నాలుగు హస్తగతం

–బిఆర్ఎస్ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు
–పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కట్టలే, రేషన్ కార్డ్ ఇవ్వలేదు
–పదేళ్లలో ఫామ్ హౌస్ కే పరిమిత మయ్యాడు
–రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన/సూర్యాపేట:పార్లమెంటు ఎన్నికల్లో భాగంగాతెలంగాణ లో పక్క పద్నాలుగు ఎంపీ స్థానాలను హస్తగతం చేసుకుంటామని, అంతకంటే కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉం దని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించి ప్రతిపక్షంలో కూర్చున్న బి ఆర్ ఎస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవదని జోస్యం చెప్పారు.

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల డీఎస్సి నోటిఫికేషన్ ప్రకటనతో పాటు గ్రూప్ -1 ప్రకటించడం జరిగిందని తెలిపారు. పొ లం బాట పేరుతో మోసగాడు బయటకు వచ్చాడని, పదేళ్లలో ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడని కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు.

బిడ్డ జైలుకు పోయి, ట్యాపింగ్ కేసు బయటకు రావడంతో కుటుంబ మంతా ఎక్కడ జైళ్లకు పోతారన్న భయంతో ప్రజలను డైవర్ట్ చేయ డానికే పొలం బాట పట్టారని ధ్వజమెత్తారు.రైతులు అప్పుల పాలై కరువుతో చనిపోయారన్నది అవాస్తవమని, పంట ఎండిపోయిన వాటి లెక్కలు తీసి రైతులకు నష్ట పరిహారం అందిస్తామని వెల్లడిం చారు.

 

భువన గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని తుంగతుర్తి శాస నసభ నియోజకవర్గం అర్వపల్లి మండ లం అడవివేముల గ్రామంలో గ్రామ దేవత అయిన శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనమహో త్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంత రం మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సా మెల్, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కాంగ్రె స్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తదితరులతో కలిసి ఆ యన మీడియాతో మాట్లాడారు.

శవాల మీద పేలాలు ఎరుకోవడం కేటీఆర్, హరీష్ రావు మానుకోవా లని, నాడు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరక్క పోవడంతో 20ఏండ్లు ఉన్న యువకులు బలిదానాలు చేసుకు న్నారని హితవు పలికారు. శవరాజకీయలు చేసి రైతుల జీవితాలతో అడుకోవద్దని, తెలంగాణ లో కరువు వచ్చింది కేసీఆర్ చేసిన పాపల వల్లనే అని, బిఆర్ ఎస్ రూ. 7లక్షల కోట్ల దోపిడీ చేసి ఒక్క ఇల్లు కట్టలేదని, భద్రాద్రి రాము లోరి పాదాల సాక్షిగా జూన్ 4నుండి ఒక్కో నియోజక వర్గానికి 3500 ఇండ్లు ఇస్తున్నామని ప్రకటించారు.

రూ.50వేల కోట్లతో మూసి ప్రక్షాలన చేసేందుకు ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఎన్నికల ముందు కాం గ్రెస్ కట్టిన ఔటర్ రింగ్ రోడ్డు రూ.7వేల కోట్లకు కమిషన్లు తీసుకొని అమ్ముకు న్నార ని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రూపు రేఖలు మార్చేలా ఔటర్ రింగ్ రోడ్డు ప్యారలాల్ గా రూ.30వేల కోట్ల తో రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని, అందుకు సంబంధిం చిన టెండర్లు త్వరలో పిలుస్తున్నామని వెల్లడించారు.

నిజాంలు 70ఏండ్లు తెలంగాణ పాలిస్తామని అనుకున్నారు కానీ తె లంగాణా ప్రజలు తెలివితో ఓడగొట్టారని, దక్షిణ తెలంగాణలో 36 స్థానాలకు 32 స్థానాలను గెలుచుకున్నామని,ఖమ్మంలో 11స్థానాలు గెలుచుకున్నాం, ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరా రని దీంతో క్లీన్ స్వీప్ చేశామని చెప్పారు. సూర్యాపేటలో ఇసుక అ మ్ము కొని దోచుకున్నా సొమ్ముతో వచ్చిన డబ్బులతో జగదీశ్ రెడ్డి 3వే ల ఓట్లతో గెలిచాడని, అది గెలుపే కాదని, ఉమ్మడి నల్లగొండ జిల్లా ను జగదీశ్ రెడ్డి సర్వ నాశనం చేశాడని ఆరోపించారు.

జగదీశ్ రెడ్డి గెలిచిన పట్టించుకోవాల్సిన పని లేదని, ఆయనకు తెలి వి లేదు, బుర్ర లేదు, ఆయన రాజకీయ నాయకుడే కాదని ఎద్దేవా చే శారు. కృష్ణ జలాలను డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతో గోదావ రి నీటిని నింపుతామని పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి, రాయలసీమ ద్వా రా జగన్ మోహన్ రెడ్డి నీటిని తీసుకపోయిండని గుర్తు చేశారు.

రూ. 2వేల కోట్లు ఇస్తే పూర్తి అయ్యే ఎస్ ఎల్.బి.సి పూర్తి అయితే క రువు ఉన్నా నీళ్లు వచ్చేవని, రూ.2లక్షల కోట్లతో కూలిపోయే కాళే శ్వరం ప్రాజెక్టు కట్టారని అన్నారు.దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులకు నిధులు ఎందుకు ఇవ్వలేదని, పాలమూరు, డిండి ప్రాజెక్టులను ఎం దుకు పూర్తి చేయలేదని, అందుకే దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పై 40, 50వేల మెజార్టీ తేడాతో కాంగ్రెస్ గెలిచిందని వివరించారు.

రూ.3,300కోట్లతో ఎస్.ఎల్.బి.సి సొరంగం, బ్రాహ్మణ వెలిగంద ప్రా జెక్టు కోసం కేటాయించామని,రూ.50వేల కోట్లతో మూసి ప్రక్షాళన చే సి నాలుగేండ్లల్లో సుందరంగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. మూ సి డ్రైనేజీ సపరేట్ చేస్తూ మూ డు నెలల్లో ప్రక్షాళన పనులను మొద లు పెడుతామని పేర్కొన్నా రు.

*చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలి…* 2023 అసెంబ్లీ ఎన్నికలలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలును ఏవి ధంగానైతే తుంగతుర్తి ప్రజలు 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలి పించారో అదే విధంగానే  భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు.

15 సంవత్సరాలుగా ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ లలో అనుని త్యం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి ,అనేక ఉద్యమాలు పోరాటాలు చే సి కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి రావడా నికి అత్యంత క్రియాశీలకం గా పనిచేసిన మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కు మార్ రెడ్డిని కూడా అదేవిధంగా ఐదు లక్షల భారీ మెజారిటీతో గెలి పించాలని తుంగతుర్తి ప్రజలు, భువనగిరి నియోజకవర్గం కార్యకర్త లు, నాయకులు, ప్రజలను మంత్రి ఈ సందర్భంగా కోరారు.

కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మన అయిదు గ్యారెంటీ ల గురించి వివరించి వచ్చే 30 రోజులు కష్టపడడం ద్వారా హస్తం గుర్తుపై ఓటే యాలని ప్రచారం చేయాలని సూచించారు. 30 రోజులు మీరు కష్ట పడండి 48 నెలలు మేము మీకు అండగా ఉంటామని, అర్ధరాత్రైనా అపరాత్రైనా మీకు ఏ ఇబ్బంది కలిగిన మీ వెన్నంటి ఉంటామని భ రోసా ఇచ్చారు.

అధికారంలో ఉన్నందున 5 సంవత్సరాలు మీకు అండగా మేము ఉంటామని, మీకు ఏ కష్టం వచ్చినా మంత్రిగా నేను వస్తాను ఎమ్మె ల్యే సామెల్, ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు జిల్లా నాయకు లు వచ్చి ఆదుకుంటారని మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ లాగా దోచుకు తినేది కాంగ్రెస్ పార్టీ కాదని, పేద ప్రజ లను ఆదుకోవాల ని సోనియా గాంధీ నాడు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పేద ప్రజలకు కడుపునింపారని గుర్తు చేశారు. ఈ 30 రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను నాయకు లను ప్రజలను కోరారు.