Congress ministers BRS leaders : కాంగ్రెస్ మంత్రులు మూర్కుల్లా వ్యవహరిస్తున్నారు
--ప్రజలకేమి చేస్తారో చెప్పకుండా కెసిఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు --కారుకూతల కోమటిరెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు --మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ఈడిగ ఆంజ నేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు
కాంగ్రెస్ మంత్రులు
మూర్కుల్లా వ్యవహరిస్తున్నారు
–ప్రజలకేమి చేస్తారో చెప్పకుండా కెసిఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు
–కారుకూతల కోమటిరెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు
–మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ఈడిగ ఆంజ నేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు
ప్రజా దీవెన/ హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రులు చాలా దుర్మార్గంగా, అసభ్యకర పదజాలంతో కూడిన మాటలు మాట్లాడుతూ మూర్ఖులు గా మారిపోయారని బీఆర్ఎస్ (brs) నేతలు ఈడిగ ఆంజ నేయ గౌడ్,గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు ద్వజమె త్తారు. రాష్ట్రానికో, పాల మూరు జిల్లాకో ఏం చేస్తారో చెప్పకుండా కెసీఆర్ ( kcr) పై, బి ఆర్ ఎస్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతు న్నారని అన్నారు. గురువారం తెలం గాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ప్రతిరోజు సునీల్ కొనుగోలు బూతులు ఎలా మాట్లాడాలో అని మం త్రులకు ఆన్లైన్ క్లాసులు ఇప్పిస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టకుంటే మంత్రులుగా( minist ers) ప్రజలు గుర్తించడం లేదనుకుంటున్నారా అని అన్నారు. మం త్రి కోమ టి రెడ్డి రోజుకో కోటు వేసుకుని విక్రుతంగా మట్లాడితే మీకు గౌరవం రాదని, కోతలరెడ్డి, కారుకూతలరెడ్డి అయినటువంటి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి ఒల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఇలాగే బూ తులు మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ మీద మంత్రులు మాట్లాడితే గొప్పవారి మౌతానుకుంటున్నా రని, కేసీఆర్ కంటే గొప్పలపాలన చేసి మంచిపేరు తెచ్చుకోవాలాని, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్ జీవితం ముందు మీరు ఏపాటి అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఇంతకాలం రాజకీయ బేతాళులుగా ఉన్నారని, కాలం కలి సొచ్చి గాలికి మంత్రి పదవులు రావడంతో తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
కోమటిరెడ్డి తో సహా కొందరు మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజల ముందు జోకర్లుగా మిగిలిపోవడం ఖాయమని స్పష్టం చేశా రు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అంటేనే ఒంటిపై చీమలు పాకినట్టు ప్రవర్తించిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి భజన చేస్తున్నా రని ఎద్దేవా చేశారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గురుంచి ఏమి మా ట్లాడారో మర్చిపోయినట్టున్నారు కాని ప్రజలు మర్చిపోలేదని చెప్పా రు.
మాజీ పిసిసి ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ దగ్గర రూ. 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడని రేవంత్ రెడ్డిని ఆరోపించిన కోమటిరెడ్డి ఇప్పుడు పదవుల కోసం రేవంత్ రెడ్డి కాళ్ళకాడపడిన ట్లు తిరుగుతున్నాడని ద్వజమెత్తారు. కోమటిరెడ్డి సోదరులకు వాళ్ళ పార్టీ మీద గౌరవం ఉండదు, సొంత పార్టీ మీద అసలు గౌరవం ఉండదు, గతంలో మునుగోడు ఎన్నికల్లో బిజెపిలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేశాడని గుర్తు చేశారు.
గత పదేళ్ల కేసీఆర్ పాలనలో పోస్టుమార్టం చేసుకుంటా పోతే వచ్చేది ఏముండదని, ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ లో ఓసీలకు పోస్టులు పెంచారు, బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు.బీసీ మహిళలకు పోస్టులు లేకుండా పోయాయని, సవరించి మళ్లీ గ్రూప్- 1 నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.