Congress MP candidate raghuveer reddy : ప్రజా శ్రేయస్సే ప్రామాణికం
--నాన్న అడుగుజాడల్లోనే నా ప్రయాణం కొనసాగుతోంది --దేశంలో రాహుల్, నల్లగొండ లో రఘువీర్ రెడ్డి గ్యారంటీ --దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తాo --కాంగ్రెస్, నాన్న హయాంలోని అభివృద్ధినా గెలుపుకు నాంది --నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి నయా సొగసులు --కేంద్ర విద్యాసంస్థల సాధన, ప్రాజె క్టుల సత్వర పూర్తి ధ్యేయం --యావత్ పార్లమెంట్ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో పాటుపడతాం --ప్రజా దీవెన తో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ముఖాముఖి
ప్రజా శ్రేయస్సే ప్రామాణికం
–నాన్న అడుగుజాడల్లోనే నా ప్రయాణం కొనసాగుతోంది
–దేశంలో రాహుల్, నల్లగొండ లో రఘువీర్ రెడ్డి గ్యారంటీ
–దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తాo
–కాంగ్రెస్, నాన్న హయాంలోని అభివృద్ధినా గెలుపుకు నాంది
–నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి నయా సొగసులు
–కేంద్ర విద్యాసంస్థల సాధన, ప్రాజె క్టుల సత్వర పూర్తి ధ్యేయం
–యావత్ పార్లమెంట్ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో పాటుపడతాం
–ప్రజా దీవెన తో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ముఖాముఖి
ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సే ధ్యేయం గా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ, నాన్న కుందూరు జానారెడ్డి ( janareddy) అడుగుజాడల్లో ప్రజా ప్రయోజనం ప్రామాణికంగా నా ప్రయాణం కొన సాగుతుoదని నల్ల గొండ పార్లమెంటు నియోజ కవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి ( raghuv eer reddy) పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొం దిన మరుక్షణం నుం చే పార్లమెంటు నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతో పాటుపడుతానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తరపున నల్లగొండ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘువీర్ రెడ్డి ప్రజా ‘ *దీవెన* ‘ తో ముఖాముఖి చర్చలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత పాల నలో భారత్ ను విశ్వగురుగా నిలిపింది. దేశ భవిష్యత్ కోసం కాంగ్రెస్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు.
కాంగ్రెస్ అమలు చేసిన పలు కార్యక్రమాలు ప్రజలను చైతన్యవంతు లను చేయ డమే కాకుండా వారిని పరిపూర్ణంగా అనుభవించే అవ కాశం కల్పించింది. గతంలో, ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు కాంగ్రెస్ పై అమితమైన అభిమానం పెరిగేలా చేశాయి. ప్రస్తుతం దే శంలోని యావత్ ప్రజలు కాంగ్రెస్ (congress) పార్టీని కోరుకుంటు న్నారు.
దేశా భివృద్ధి, ప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తామని ప్రజలoద రికి తెలుసిపోయింది. కాంగ్రెస్ పార్టీ పై, నాన్న జానారెడ్డి గత ముప్పై ఏళ్ళ పైగా జరిగిన అభివృద్ధి, సంక్షేమం వారికి అపారమైన నమ్మకం , విశ్వాసం కలుగిoచినందున గెలిపిస్తారు.నాన్న జానారెడ్డి అడుగు జాడల్లోనే నా ప్రయాణం కొనసాగుతుంది.ఆ కోణంలో నల్లగొండ పార్ల మెంట్ కు నయా సొగసులు అద్దుతాము.
క్రమ శిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా నాన్న జానారెడ్డి గతంలో అనే క పదవులను అధిరో హించి ప్రజలకు సేవ చేశారు. నాన్న చేసిన ప్ర జాసేవ, నాపై ప్రజలకు ఉన్న నమ్మకమే నన్ను విజయతీరాలకు చేరు స్తుంది. లోక్ సభ ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ,( Rahul Gan dhi) నల్లగొండలో రఘువీర్ రెడ్డి విజయం గ్యారంటీ.గత పది సంవ త్సరాల కాలంలో దేశంలో అరాచక పాలన చేసిన బిజెపికి, రాష్ట్రంలో పది సంవత్స రాల కాలంలో అవినీతి పాలనలో మునిగిపోయిన బి ఆర్ఎస్ కు ఓట్లు వేసే పరిస్థితులలో ప్రజలు లేరు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం ఉంది. జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఆరు గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి కృషితోభారీ మెజార్టీతో గెల వబోతున్నాం.ఈ నెల 13వ తేదీ న జరిగే ఎన్నికల్లో (loke sabha) నూటికి నూరుపాళ్లు చేతి గుర్తుపై పోటీ చేస్తున్న నాదే పక్కా. కేవలం మెజార్టీ కోసమే మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తపన.
ప్రచార సరళి, ప్రజా స్పందన తీరు ఎలా ఉంది…ప్రణాళికా బద్ధంగా రోజుకో నియో జకవర్గంలో ప్రచారం కొనసాగి స్తున్నాం. పార్టీ నాయ కులు, కార్య కర్తల నుంచే కాకుండా సాధారణ ప్రజల నుంచి కూడా మంచి స్పం దన కానవస్తుంది. అక్కడా ఇక్కడా అని కాకుండా పట్ట ణాల్లో, గ్రామాల్లో ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తు న్నప్పటికి ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ కు వలసలు కొనసాగుతున్నా యి.
గెలిచిన తర్వాత అభివృద్ధి ప్రణా ళిక ఎలా ఉండబోతోంది.. సాగు నీటి ప్రాజెక్టులు, రోడ్ల అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతాను. నేను ఎంపీగా గెలిచిన తర్వాత నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లో పెండింగ్ లో ఉన్న సాగునీ టి ప్రాజెక్టులను సత్వరపూర్తికి కృషి చేయిస్తా. దేవరకొండలో అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో 7 ఎత్తిపో తల పథకాలు, మిర్యాలగూడలో 3, నాగార్జున సాగర్ లో నెల్లికల్, ఇతర ఎత్తిపోతల పథకాలు పెండింగ్ లో ఉన్నాయి. బ్రాహ్మణ వెల్లెం ల చివరి దశలో ఉంది. ఏడు అసెంబ్లీ నియో జకవర్గాల్లో ఆయా ప్రాం తం పరిస్థితుల ఆధారంగా పరిశ్ర మలు తీసు కొచ్చి స్థానిక యువత కు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తా. రైల్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తా. నడికుడి- బీబీనగర్ డబ్లిం గ్ పనులను వేగంగా పూర్తి చేసేలా చూస్తా. నల్లగొండ- కొండమల్లేపల్లి రోడ్డుతో పాటు పలు రాష్ట్ర రహదా రులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కృషిచేస్తా. కేంద్రంతో సంప్రదింపుల ద్వారా కేంద్ర విద్యా సంస్థలు సాధించేందుకు కృషి చేస్తా. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ ఎంబీకి అప్పగించింది గత బీఆర్ ఎస్ ప్రభుత్వమే అందరికి తెలి సిందే. ప్రభుత్వ ఆలోచన కు అను గుణంగా అనుగుణంగా పనిచేస్తా.
స్ధానిక పరిస్థితు లపై మీ ప్రణాళిక లు ఎలా ఉన్నాయి.. సమగ్ర ప్రణాళికలతో ఆయా ప్రాంతాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతాను.అన్ని ప్రాంతాలలో సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. లోక్ సభ పరిధిలోని ఏడు నియో జకవర్గాలలో ఆయా రంగాలక నుగుణంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చే శాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM RevanthReddy) సహకా రంతో సంబంధిత నియోజక వర్గంలో ఏ రంగంలో అభివృద్ధికి అవకా శాలు ఉన్నాయో చూసి తద నుగుణంగా ముందుకు సాగుతం. పరి శ్రమలు వచ్చేలా చేసి నిరుద్యో గులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. గత పదివేల బిఆర్ఎస్ పాల నలో ఏలాంటి అభివృద్ధి జరగలేదు.
మిర్యాలగూడలో ఆహార శుద్ధి పరిశ్రమలు, నల్లగొండలో ఐటీ సేవలు, దేవరకొండలో స్వయం ఉపా ధి, హుజూర్నగర్, కోదాడలో సిమెంట్ క్వారీ పరిశ్రమల ను ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉ ద్యోగ అవకాశాలు కల్పిస్తాను. నల్గొండకు ధీటుగా మిర్యాలగూడ లో పరిశ్రమలు, స్వయం ఉపాధి రంగాల్లో ప్రభుత్వం ద్వారా పలు సం స్కరణలు చేపడుతాం.
విద్యా ఉపాధి రంగాల అభివృద్ధి ఎలా ఉండబోతోంది.. కేంద్ర ప్రభు త్వ విద్యాసంస్థలు నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు కృషి. కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేస్తాను. ఇప్పుడు చలకుర్తిలో ఉన్న నవోదయ పాఠశాల జానా రెడ్డి హయాంలో వచ్చిం దే. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక కేంద్రీ య విద్యా లయం ఉండేలా చర్యలు తీసుకుంటాను. ఈ విష యం లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రంలో ఒత్తిడి తీసుకువస్తాను.నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాసమ స్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించేలా కృషి చేస్తాను.
ఎన్నికల్లో ఎంత మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నారు.. ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను చెప్పి, చూపించి ఆ పై ర ఎన్నికల్లో ఓట్లడుగుతా. ఇప్పటికే రాష్ట్ర ప్ర భుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉంది. కష్టపడి పనిచేసే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది. లోక్ సభ నియోజకవర్గంలో ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులున్నా రు. వీరందరినీ సమన్వయం చేసు కుంటూ ఈ ఎన్నికల్లో ముందు కెళ్తున్నాం. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ నల్లగొండ నుంచే వస్తుందని ఆశిస్తున్నాను.
Congress mp candidate raghuveer reddy