Congress MP candidates : కాoగి ‘రేసు ‘లో మరో నలుగురు
--భువనగిరి, నిజామాబాద్, ఆదిలా బాద్,మెదక్‌లకు అభ్యర్థుల ఖరారు --టి.జీవన్‌రెడ్డి, భువనగిరికి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి,ఆత్రం సుగుణ, నీలం మధు పేర్లు ఫైనల్ --సామాజిక సమీకరణాల కారణంగా మరో నాలుగు స్థానాలు పెండింగ్
కాoగి ‘రేసు ‘లో మరో నలుగురు
–భువనగిరి, నిజామాబాద్, ఆదిలా బాద్,మెదక్‌లకు అభ్యర్థుల ఖరారు
–టి.జీవన్‌రెడ్డి, భువనగిరికి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి,ఆత్రం సుగుణ, నీలం మధు పేర్లు ఫైనల్
–సామాజిక సమీకరణాల కారణంగా మరో నాలుగు స్థానాలు పెండింగ్
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: తెలంగాణ లో లోక్‌సభ ఎన్నికలకు మరో నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులను ( congress candidates) ప్రకటించింది అధిష్ఠానం. పెండింగ్ లో ఉన్న ఎనిమిది స్థానాలకు గాను నాలుగు స్థానాలు భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌లకు అభ్యర్థులను ఖరారు చేసిం ది. నిజామాబాద్ టికెట్‌ను పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్రె డ్డికి కేటాయించగా, తీవ్ర పోటీ నెలకొన్న భువనగిరి నుంచి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడైన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అవ కాశం దక్కించుకున్నారు.
ఆదిలాబాద్ (ఎస్టీ) కు ఆత్రం సుగుణ, మెదక్‌కు నీలం మధును అ భ్యర్థులుగా ప్రకటిం చింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను బుధ వారం రాత్రి ఏఐసీసీ విడుదల చేసింది. పోటీ తీవ్రంగా ఉన్న ఖమ్మం, హైదరాబాద్, కరీం నగర్, వరంగల్ జరిగిన చర్చలో సీఎం రేవంత్ ( CM RevanthReddy) రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పా ల్గొన్నారు. కాగా పెం డింగ్ లో ఉన్న మరో నాలుగు స్థానాలకు అభ్య ర్థులను ఖరారు చేయ డానికి ఈ నెల 31న సీఈసీ భేటీ కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా తెలంగాణ లో మెజారిటీ స్థానాలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న కాంగ్రెస్‌కు సామాజిక సమీకరణాల దృష్ట్యా అభ్యర్థుల ఖరారు ఆలస్యమవు తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రక టించిన నాలుగు స్థానాల్లో రెండు చోట్ల రెడ్డి సామాజికవర్గాని కి, ఒక చోట బీసీకి అవకాశం కల్పించింది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో గిరి జన మహిళకు టికెట్ కేటాయించింది.అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ రాష్ట్రం లోని మొత్తం 17 సీట్లలో ఆరు చోట్ల బీసీలను అభ్యర్థులుగా ప్రకటిం చింది. బీజేపీ సైతం బీసీలకు 5 టికెట్లు ఇచ్చింది.
కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు 13 అభ్యర్థులను ప్రకటించగా మూడు స్థానాలకు మా త్రమే బీసీలను అభ్యర్థులుగా నిలిపింది. దీంతో మిగ తా పార్టీలు బీసీ లకు పెద్దపీట వేయగా కాంగ్రెస్ బీసీలకు తక్కువ సీట్లు కేటాయిస్తే బీసీలు దూరమవుతారని భావిస్తున్నట్తు తెలుస్తోం ది. తాజాగా ఖమ్మం స్థానానికి బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే చర్చ కాం గ్రెస్‌లో జరు గుతున్నట్లు సమాచారం. కాగా లోక్‌సభ అభ్యర్థి త్వాన్ని ఆశిస్తున్న అభ్యర్థులు, వారి బంధువులు టికెట్ల కోసం సీఎం రేవంత్ కు ఆయన నివాసం యమున బ్లాక్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవా రం సాయం త్రం విమానంలో ఢిల్లీ ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్న సీఎం రేవంత్ తన నివాసానికి చేరుకున్నారు.
అక్కడ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( minister pon gulati Srinivas Reddy) సీఎం రేవంత్‌ను కలి సి తన తమ్ముడు ప్రసాద్‌రెడ్డికి ఖమ్మం టికె ట్ కేటాయించాలని కోరి నట్లు తెలిసింది. ఆదిలాబాద్ టికెట్ కోసం నరేష్‌జాదవ్ టికెట్ సీఎం కు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఓ యూ విద్యార్థి ఉద్యమనేతలలో ఒక్కరైన పున్నా కైలాష్‌నేత బీసీ, ఉద్యమ కారుల కోటాలో ఎంపీ అభ్యర్థిగా అవ కాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ సీఈసీ భేటీ ముగిసిన అనం తరం సీఎం రేవంత్ హైదరా బాద్‌కు తిరుగుపయనమయ్యారు.