
Congress SeniorLeader Jeevan Reddy : ప్రజా దీవె న, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మరో ఆ సక్తికర మలుపు తిరిగే సూచనలు క నిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు దీర్ఘ కాలం సేవలందించిన సీని యర్ నేత టి. జీవన్ రెడ్డి (T.Jee vanReddy) పార్టీని వీడే దిశగా సంకేతాలు ఇచ్చారు. ఆ యన నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మార గా, పరిస్థితిని చక్కదిద్దేందు కు కాంగ్రెస్ అధిష్ఠానం వేగంగా పావులు కదిపింది.
జగిత్యాలలో మంగళవారం జరిగిన కీలక భేటీలో పిసిసి అ ధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ఆది శ్రీనివాస్ (Adi Srinivas), స చిన్ సావంత్ (Sachin S awant) వంటి నేతలు జీవన్ రెడ్డిని కలిసి ఆయనను ఒ ప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఈ భేటీ అనంతరం జీవ న్ రెడ్డి మాటలు మరింత చర్చకు దారితీశాయి.
నా రాజకీయ ప్రయాణం పూలబాట కాదు… ముళ్లబాట అ ని ఆయన వ్యాఖ్యానిస్తూ, గత పదేళ్లుగా తాను ఒంటరిగా చేసిన పోరాటాన్ని పార్టీ సరైన రీతిలో గుర్తించలేద ని ఆవే దన వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ పదవి దక్కకపోయినా పార్టీ అ ధికారంలోకి రావడం తనకు సంతో షమేనని చెప్పిన ఆ యన, తన పాత్రను మాత్రం విస్మరించారని సూచించారు. ఇక పదవుల విషయంలో అసమానతలపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు.
రేవంత్ రెడ్డి (RevanthReddy) ముఖ్యమంత్రిగా, భట్టి విక్ర మార్క (Bhatti Vikramarka) డిప్యూటీ సీఎంగా నియమి తులైన సందర్భా న్ని ప్రస్తావిస్తూ శాసన మండలిలో నా స్థా నం ఏమిటని నిలదీశారు. పార్టీ మార్పుల రాజకీయాలపై కూడా ఆయన కఠినవ్యాఖ్యలు చేశారు. మనం కే. చంద్రశే ఖర్ రావు (K.Chandrashekar Rao) మార్గాన్ని అనుస రించాలా అని ప్రశ్నిస్తూ, పార్టీ సిద్ధాంతాలపై స్పష్టత అ వస రమని సూచించారు. అలాగే రాహుల్ గాంధీ (RahulGan dhi) ఆలోచనలు, రాష్ట్ర నేతల చర్యల మధ్య తేడాపై కూ డా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక అధిష్టానం నుంచి కే సీ వేణు గోపాల్ (K.C.Venugopa l) ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొంటూ, పార్టీపై అ సహనం వ్యక్తం చేశారు. తనను నిజంగా బుజ్జగించాలనే ప్ర యత్నం జరగలేదని, తాను పార్టీ విడిచిపోతున్నాననే స మాచారం వచ్చిన తర్వాతే నాయకులు వచ్చి వెళ్లారని ఆ యన వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలు చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గ త విభేదాలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నా యి. జీవన్ రెడ్డి చివరి నిర్ణయం ఏమిటి? ఆయన నిజంగా పార్టీకి గుడ్‌బై చెబుతారా లేక చివరి క్షణంలో రాజీ సాధ్యమ వుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.



