Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Contact efforts are underway: సంప్రదింపు ప్రయత్నాలు సాగుతున్నాయి

-- ల్యాండర్, రోవర్ నుండి సిగ్నల్ అందడంలేదు -- తాజా సమాచారంలో ప్రకటన చేసిన ఇస్రో 

సంప్రదింపు ప్రయత్నాలు సాగుతున్నాయి

— ల్యాండర్, రోవర్ నుండి సిగ్నల్ అందడంలేదు
— తాజా సమాచారంలో ప్రకటన చేసిన ఇస్రో 

ప్రజా దీవన/ ఇస్రో: చంద్రయాన్ 3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను స్లీప్ మోడ్ వెలుపలకు తీసుకొచ్చెందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇస్రో వెల్లడించింది. ల్యాండర్, రోవర్ నుండి సంకేతాలు అందడంలేదని ( No signals from lander and rover) ఇస్రో తాజాగా తెలిపింది.

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఇస్రో ట్విట్టర్‌లో పోస్ట్( ISRO posted on Twitter that efforts to establish communication have begun)  చేసింది. ప్రస్తుతానికి వారి వైపు నుంచి ఎలాంటి సిగ్నల్ రాలేదని పరిచయాన్ని ఏర్పరచుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

ఇదిలా ఉండగా ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌తో భారతదేశం చరిత్ర సృష్టించిందని (India has created history with soft landing) తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్న నాలుగో దేశంగా కూడా భారత్ అవతరించిన విషయం విధితమే.

ఆయితే శనివారం ల్యాండర్, రోవర్‌ను సక్రియం చేయడానికి ప్రయత్నాలు ( Attempts to activate lander, rover) చేయనున్నట్లు చంద్రయాన్-3పై స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు.

సెప్టెంబరు 22 సాయంత్రంలోగా ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లను మళ్లీ యాక్టివేట్ చేయాలనేది మా ప్రణాళిక ( Our plan is to reactivate Pragyan rover and Vikram lander) అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల జరగలేదని, కేంద్ర సైన్స్ మంత్రి లోక్‌సభలో సమాచారం ఇస్తూ తిరిగి శనివారం ప్రయత్నిస్తామని చెప్పారు.

ల్యాండర్, రోవర్ 16 రోజుల పాటు స్లీప్ మోడ్‌లో ఉన్నాయని శుక్రవారం రెండూ యాక్టివేట్ అవుతాయని ఇప్పటికే ఇస్రో తెలిపింది. ప్రజ్ఞాన్, విక్రమ్ త్వరలో నిద్ర నుండి మేల్కొనబోతున్నాయని (Pragyan and Vikram are going to wake up soon) కేంద్ర సైన్స్ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు.