Coordination with Border Police: సరిహద్దు పోలీసులతో సమన్వయం
-- సార్వత్రిక ఎన్నికల నియమావళి సమర్థవంతంగా అమలు -- అంతర్రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమావేశంలో ఎస్పీ అపూర్వ రావు
సరిహద్దు పోలీసులతో సమన్వయం
— సార్వత్రిక ఎన్నికల నియమావళి సమర్థవంతంగా అమలు
— అంతర్రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమావేశంలో ఎస్పీ అపూర్వ రావు
ప్రజా దీవెన/ నల్లగొండ: ఎన్నికల సమయంలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాను, ప్రలోబాలను నిరోధిస్తూ ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేయడం కోసం స్వేచ్ఛను కల్పించడానికి రక్షణ కల్పించడం కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని నల్లగొండ ఎస్పీ అపూర్వ రావు కోరారు. అనుకూల, ప్రతికూల పరిస్థితులను అన్నింటినీ అధిగమించడం కోసం అత్యంత అప్రమత్తంగా, ప్రణాళిక బద్దంగా పని చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా గురువారం జిల్లా ఎస్పి కె.అపూర్వ రావు ఐపిఎస్ అంతర్రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారులతో వాడపల్లి ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీ కాన్ఫిరెన్స్ హల్ లో సమన్వయ సమావేశాన్ని నిర్వహిoచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఉంచడం సరిహద్దు అధికారులు ఒకరికొకరు పరస్పరం సమచారాన్ని చేరవేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. అంతకు ముందు అంతరాష్ట్ర, అంతర్ జిల్లా పోలీస్ ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో 24/7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలక్షన్ల ముందు ఆ సమయంలో మద్యం, నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, పాత దొంగలు, నేరస్తుల సంచారం కట్టడి, ఇంటలిజెన్స్ సమాచారం పంచుకోవడం, ఎన్నికల నియమావళి అమలు తదితర ముఖ్యమైన విషయాలు ఇరు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయంతో ఎన్నికలు సాఫీగా సాగాలని సూచిoచారు.
ఈ సమావేశం లో సూర్యాపేట జిల్లా యస్.పి యస్.రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పల్నాడు జిల్లా వై. రవి శంకర్ రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి, కోదాడ డిఎస్పి ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్తనపల్లి డిఎస్పీ ఆదినారాయణ, గురజాల డిఎస్పీ పల్లపురాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు ఎస్ఐ లుపాల్గొన్నారు.