Corona is again a black dance: కరోనా మళ్లీ కరాళనృత్యం
-కేరళలో మరోసారి కరోనా విజృంభన --కనుమరుగైందనుకున్న తరుణంలో ఉలికిపాటు --కేరళలో 19 కేసులు, రెండు మరణాలు నమోదు --అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటున్న కేoద్రం
కరోనా మళ్లీ కరాళనృత్యం
–-కేరళలో మరోసారి కరోనా విజృంభన
–కనుమరుగైందనుకున్న తరుణంలో ఉలికిపాటు
–కేరళలో 19 కేసులు, రెండు మరణాలు నమోదు
–అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటున్న కేoద్రం
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోమారు క రాల నృత్యం చేయనుందా అంటే అవునేమో అనే సమాధానo వ స్తుంది. ఎందుకంటే దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమో దైన రాష్ట్రం కేరళ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ మహ మ్మారి విస్తరిస్తుందని అధికారిక ప్రకటనలు వెల్లడిస్తున్నాయి. కనుమరు అయిందనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుం డడంతో ఆందోళన కలిగిస్తుంది.
కేరళలో ఒక్కసారిగా 19 కరోనా కేసులు, అంతేకాకుండా రెండు మరణాలు కూడా సంభవించడం ఉలిక్కిపాటుకు గురిచేసింది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ మాసంలోనే 470 కేసులు నమోదు కాగా డిసెంబర్ నెల మొదటి పది రోజుల్లోనే 825 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.
భారతదేశంలో అత్యధికంగా కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదైన విషయం తెలిసిందే. శ్వాస సంబంధిత లక్షణాలతో ఆసుపత్రులు చేరిన రోగులలో కోవిడ్ కేసులు కనుగొనబడ్డాయని వైద్యాధికారులు ప్రకటించారు. ఉమిక్రాన్ జెఎన్1 వేరియంటుని దక్షిణాది రాష్ట్రంలో గుర్తించినట్లు నివేదికలు ఉన్నప్పటికీ వైరస్ పై నిరంతరం పర్యవేక్షణ అవసరమని అధికారులు స్పష్టం చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం ఆంక్షలు విధించడం తో పాటు నివారణ చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే రంగంలోకి దిగిందని సమచారం. ఇండియన్ సార్స్ కోవ్2, జెనోమిక్స్ కన్సార్టియం లేదంటే ఇన్సాకోగ్ నుంచి వచ్చిన జేఎన్1 వేరియంట్ ఉనికిని కేరళ ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించింది కూడా.
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సింగపూర్ ఇండోనేషియా వంటి ఆగ్నేషియా దేశాల్లో ఈ తరహా కరుణ వేరియెంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదట లక్ష్యం లగ్సెంబర్గ్ లో ఆగస్టు నెలలో మొదట ఈ వేరెంటును గుర్తిoచారు. మరో వేరియంట్ బిఏ 2.86 ను ఈ ఏడాది జులైలో డెన్మార్క్ దేశంలో మొదటిసారి కనుగొన్నారు.
ఇదిలా ఉండగా భారత దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా నియంత్రణ లోనే ఉందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం దేశంలో 237 కొత్త కరోనా కేసులు నమోదయ్యా యి దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1296 కి పెరుగగా మర ణాల సంఖ్య 5,33, 310 గా, మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50, 03,830 గా ఉండగా వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44, 69,536 కు పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని, కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తుంది. వాతావర ణ కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా కోవిడి లక్షణాలు తీవ్రమవుతున్నాయని కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు.
అంటువ్యాధుల సంఖ్య పెరుగుతున్న ప్పటికీ కేసులు తీవ్రంగా లేవని మరణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఎక్కువ హాని కలిగిస్తుందని చెబుతున్నారు.