Corruption money: అవినీతి సొమ్ము ప్రజల సొత్తు
దేశంలో అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకుంటున్న అవినీతి సొమ్ము పేద ప్రజల సొత్తుగా ప్రధానమంత్రి మోదీ అభివర్ణించారు. సదరు స్వాధీన సొమ్మును పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషి స్తున్న ట్లు వెల్లడించారు.
ఈడీ స్వాధీనం సొమ్ము పేదలకే చెందాలి
పంచేందుకు మార్గాలను అన్వేషి స్తున్నాం
రామమందిరం సాక్షిగా 400 సీట్లు గ్యారంటీగా గెలుస్తున్నాం
ఉచిత బస్సుల పథకంతో మెట్రోకు ముప్పువాటిల్లి, విస్తరణ నిలిచిoది
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ
ప్రజా దీవెన, ఉత్తర ప్రదేశ్: దేశంలో అవినీతి(Corruption) కేసుల్లో ఈడీ(ed)స్వాధీనం చేసుకుంటున్న అవినీతి సొమ్ము పేద ప్రజల సొత్తుగా ప్రధానమంత్రి మోదీ అభివర్ణించారు. సదరు స్వాధీన సొమ్మును పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషి స్తున్న ట్లు వెల్లడించారు. దర్యాప్తు సంస్థ లను కేంద్రం దుర్వినియోగం చేస్తోం దంటూ విపక్షాలు తరచూ ఆరోపణ లు చేస్తున్న నేపథ్యంలో వారికి మోదీ గట్టిగా బదులిచ్చారు. కాంగ్రె స్ హయాంలో ఈడీ నిరుపయోగం గా ఉండిపోయిందని ఆయన పేర్కొన్నారు .
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో నేడు జరిగిన ఎన్నిక ల(Election rally) ర్యాలీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో కొంద రు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నా. ఇందుకోసం న్యాయబృందం సలహా కోరు తామని, చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకా డబోమని, దర్యాప్తు సంస్థ స్వాధీ నం చేసుకున్న సొత్తును ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్ప టికే న్యాయవ్యవస్థను కోరామని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఈ ఎన్ని కల్లో ఎన్డీయే(NDA Alliance) కూటమి 400 సీట్లు సాధనే లక్ష్యంగా ముందుకు సాగు తోంది. ఈ అంశంపై ప్రధాని మరో సారి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యాన్ని పెట్టుకోవడానికి ప్రజలే కారణమన్నారు. తమ పార్టీ బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Corruption money belongs to people