Praja Deveena
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 8:28 am Posted by : praja deveena

Council chairman Gutha Sukender Reddy : సుఖేందర్మండలిచైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్య, జనా భా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

 

Council chairman Gutha Sukender Reddy: ప్రజా దీ వెన, నల్లగొండ: రాష్ట్ర రా జకీయాలు, రైతు సమస్యలు, మా రుతున్న సమీకరణాలు అన్న కో ణంలో నల్లగొండ జిల్లాలో భవిష్య త్ రాజకీయాలు, అభివృద్ధి దిశలపై తెలంగాణ శాస నమండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం నల్లగొం డలో మీడియాతో చిట్‌ చాట్ ప్రస్తుతానికి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలు రా బోయే రోజుల్లో రాష్ట్రానికి ఏ మార్గం చూపుతాయోనన్న ఆసక్తి నెలకొంది.

కేవలం జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కేంద్రం సీట్లను 50 శాతం పెంచే ఆలోచన లో ఉందని చెప్పారు. మరోవైపు, జనాభా + జీఎస్టీ కలిపి లెక్కించా లని రాష్ట్రాలు సూచిస్తు న్నాయని గుర్తు చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో కలపకూడ దని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని, జమిలీ ఎన్ని కలు జరిగితే దేశం రెండు విడతలుగా ఎన్నికలకు వెళ్లే అవ కాశముందని సూచించారు. తె లంగాణలో సుమారు 20 ల క్షల మంది వలస కూలీలు పనిచేస్తు న్నారని, ఇది రాష్ట్ర ఆ ర్థిక వ్యవస్థ లో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పా రు.

రాజకీయాల్లో డబ్బు ప్రవాహం త గ్గించకపోతే, భవిష్యత్‌లో సామాన్యుడు పోటీ చేయడం కష్టమవు తుందని గుత్తా హె చ్చరించారు. అ ధికార పార్టీలో అసంతృప్తి సహజ మని, బి ఆర్ఎస్ మళ్లీ టిఆర్ఎస్‌గా మారుతుందనే ప్రచారం జరుగు తుందని తెలిపారు. పేరు మార్పుపై ఆత్మపరిశీలన అవసర మని సూచించారు.

రైతులకు ఊరటగా ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు లేవని చెప్పా రు. సన్నధాన్యం సేకరణ సాఫీగా సాగుతోందని, మి ల్లులను మూసివేయించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కేం ద్రం 20 శాతం బాయిల్డ్ రైస్, 80 శాతం రారైస్ కోరుతుం టే, మి ల్లర్లు మాత్రం బాయిల్డ్ రైస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని, వే సవిలో రారైస్ సేకరణలో నష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.ఏఎమ్మార్పీ కింద 4000 క్యూసెక్కు ల నీరు రావా ల్సి ఉండ గా ప్రస్తుతం 2400 క్యూసెక్కులు మాత్రమే వ స్తు న్నాయి. సాగునీటి కాలువలను విస్తరించడం ద్వారా రైతు లకు మరింత లాభం చేకూరుతుందని సూచించారు.