Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 2:32 pm Posted by : praja deveena

Council Chairman Gutta Sukender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రె డ్డి కీలకవ్యాఖ్య, ప్రభుత్వ కార్యక్ర మాల అమలులో ప్రజల భాగస్వా మ్యం అనివార్యం 

Council Chairman Gutta Sukender Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రజల భా గస్వామ్యం అవసరమని రాష్ట్ర శా సనమండలి చైర్మన్ గుత్తా సు ఖేం దర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణా ళిక 99 రోజుల కార్య చ రణ లో భాగంగా గురువారం న ల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని బైపాస్ వద్ద ఉన్న ఎంఎ న్ఆర్ ఫం క్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్ర మానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అ న్ని వర్గాల ప్రజల సంక్షే మం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ము ఖ్యంగా రైతులకు రైతు బీమా, రైతు భరోసా అలాగే 6 గ్యా రంటీల వంటి కార్యక్రమాలు అ మలు చేస్తున్నది చెప్పారు. అయి నప్పటికీ వివిధ రంగాలలో ఇంకా నెలకొన్న సమస్యల ను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రై తులు పంటల మార్పిడికి వెళ్లాలని, దేశ,కాల , వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటలపై అవగాహన కల్పించుకో వాలన్నారు.రోజురోజుకు తగ్గి పోతున్న పశుసం పదను పెంచుకోవా ల్సిన అవసరం ఉందన్నారు.

సమస్యలు ఉత్పన్నం అయ్యేందు కు మనమే కారణం కావ ద్దని, స మస్యల పరిష్కారంపై లోతుగా ఆ లోచించాలన్నా రు. విద్య, సాగునీ రు,వైద్య రంగంలో ఉన్న సమస్యల పరి ష్కారానికి కృషి చేయాల్సిన అ వసరం ఉందన్నారు. విద్యా రంగ అ భివృద్ధిలో భాగంగా యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు, మోడల్ పా ఠశాలలు ఏర్పాటు విద్యార్థులకు యూని ఫామ్స్, మధ్యాహ్న భో జ నం అమలు చేస్తున్నదని, అంతే కాక రానున్న విద్యా సంవ త్సరం నుండి అల్పాహారం కూడా అందిం చనుందని తెలి పారు.

ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళా శాల ఏర్పాటు చేసినప్ప టికీ ప్ర భు త్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గు తున్నదని,ఈ విష యంపై దృష్టి సారించి ప్రభుత్వ పా ఠశాల లను బలోపేతం చేయాల న్నారు. గ్రామాలలో పారిశుధ్యం కోసం ట్రాక్టర్లు ఏర్పాటు చేశామని, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ చే యడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతు లు పండించిన ప్రతి ధాన్యం గింజ ను కొనుగోలు చేస్తున్నామని, జూ న్ 2 నాటికి జిల్లాలో ధాన్యం కొను గోలు పూర్తి చేయాలని అధికారు లను ఆదేశించారు. ప్రభుత్వం అనే క కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇం కా పలు కార్యక్రమాలు. చేయాల్సి ఉందని, ప్రభుత్వం అమలు చే స్తు న్న పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలి పారు. ప్ర జాపాలన- ప్రగతి ప్రణాళిక ద్వారా అనేక కార్యక్ర మాలను ప్రజల ద గ్గ రికి తీసుకు వెళ్ళినట్టు చెప్పారు.

 

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక ప్రజల కార్యక్రమా లతో అంకితమైన కార్యక్రమం అని అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేసే కార్యక్రమాలను, త్వర లో అమలు చేయనున్న కొత్త పథకం కుటుంబ జీవిత బీమా పథకాన్ని వివరించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లా డుతూ సంక్షేమ పథ కాలను అమలు చేయడంలో అధి కా రుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాల ను అ మలు చేస్తున్నప్పటికీ ఇంకా సమ స్యలు ఉన్నాయని, వాటిపై కూడా దృష్టి సారించి పరిష్కరించాలన్నా రు.

 

అంతకు ముందు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్చి 6న ప్రారంభమైన ప్రజాపాలన- ప్ర గతి ప్రణాళిక కా ర్యక్రమంలో భా గంగా నిర్వహించిన కార్యక్రమాల ను, సా ధించిన విజయాలను పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ కార్యక్రమంతో పాటు, అలై వ్ ,అరైవ్ , రోడ్డు భద్రత పై తీసుకున్న చర్యల ను వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లా అ ధికారులు వారి శాఖ లకు సంబం ధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివ రించారు. రెవెన్యూ అ దనపు కలె క్టర్ జె .శ్రీ నివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అ దనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిప ల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఇత ర ప్రజా ప్ర తినిధులు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.