
Cpi narayana sensational comments : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్ర పక్షమై న సీపీఐ నేత కె.నారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు రా ష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయలోపం, పాల నలో కనిపిస్తున్న లోటుపాట్లపై ఆయన చేసిన విమర్శలు రా జకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కాంగ్రెస్‌లో కొ నసాగు తున్న అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య సమ న్వయ లేమి ప్రతిపక్షానికి అనుకూలంగా మారే అవకాశం ఉందని నారాయణ హెచ్చరించారు. ముఖ్యంగా ఈ పరిస్థి తులు కొన సాగితే బీఆర్ఎస్ తిరిగి రాజకీయంగా బలం పుంజుకు నే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్న సంకేతాలు ఆయన వ్యాఖ్యల్లో కనిపించాయి.
సీఎం రేవంత్‌కి కీలక సూచన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మరింత నిక్కచ్చిత నం, జవాబుదారీతనం ఉండాలని నారాయణ సూచించా రు. సీఎం కఠినంగా వ్యవహరిస్తేనే మంత్రులు, కిందిస్థాయి అధికారుల్లో బా ధ్యత, జవాబుదారీతనం పెరుగు తుందని అభిప్రాయపడ్డారు.వివాదాస్పద 22A భూముల నిబంధ న లను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చే స్తున్నారనే ఆరోపణలు కూడా ఆయన ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిం చాల్సిన అవసరం ఉందని సూచించారు.
మేం ప్రభుత్వంలో భాగం కాదు
కాంగ్రెస్‌తో తమ సంబంధాలపై కూడా నారాయణ స్పష్టత ఇచ్చా రు. తాము ప్రభుత్వంలో భాగ స్వాములు కాదని, ఎ న్నికల సమయంలో మాత్రమే సీట్ల సర్దుబాటు జరిగిందని పేర్కొన్నారు. తమ పార్టీ తరఫున ఇస్తున్న సలహాలు, సూచ నలను ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.మొత్తంగా, అధికారంలోకి వచ్చి న కొంతకాలానికే మిత్రపక్షం నుంచి బహిరంగ విమర్శలు, హెచ్చరికలు రావడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలే పింది. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లోని అంతర్గత సమీకర ణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆస క్తికరంగా మారింది.




