Sad On road : ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం --కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ప్రమాదం
ఘోర రోడ్డు ప్రమాదం
—ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
–కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ప్రమాదం
ప్రజా దీవెన/మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్డేన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాధంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలవ్వడంతో తీవ్ర విషాదo నెలకొంది.
పోలీసుల కథనం ప్రకారం.. భీమిని మండలం వెంకటా పూర్ గ్రామానికి చెందిన కోట తిరుపతి (41), కోట తిరుమల (37), తన కొడుకు అంజి (16)తో కలిసి మోటర్ సైకిల్ పై తాండూరు మండలం బోయపల్లి గ్రామంలోని పోచమ్మ గుడిలో మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లి తిరిగి హైవే రోడ్డు బెల్లంపల్లి (bellampally) మీదుగా ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో తాండూర్ వైపు నుండి అతివేగంగా వస్తున్న లారీ మోటర్ సైకిల్ ను బలంగా ఢీకొట్టింది.
దీంతో తిరుమల, ఆమె భర్త తిరుపతిలు అక్కడి కక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ వారి కొడుకు అంజిని మంచిర్యాలకు( manchiryaal) తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే తుది శ్వాస విడిచారు.
ఈ సంఘటనా స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, వన్లైన్ ఇన్స్పెక్టర్ ఎన్. దేవయ్య, రూరల్ ఇన్స్పెక్టర్ అఫ్టలోద్దిన్, వన్ టౌన్ ఎస్సై ప్రవీణ్ కుమార్, తాళ్లగురిజాల ఎస్సై నరేష్ లు పరిశీలిం చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.