Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

forest minister : వన్యప్రాణుల వేటను ఉపేక్షిoచం

--అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

వన్యప్రాణుల వేటను ఉపేక్షిoచం

–అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

ప్రజా దీవెన/ హైదరాబాద్: రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha, Minister of Forest and Environment) ఆన్నారు. అదే సందర్భంలో వన్యప్రాణుల వేటను ఎట్టిపరి స్థిుల్లోనూ ఉపేక్షిoచబోమని స్పష్టం చేశారు. జయ శంకర్ భూపాల్ పల్లి జిల్లా కాటారం మండలంలోని మహదేవ్ పూర్ అటవీ (forest)  ప్రాంతంలో వేటగాళ్ళు వన్యప్రాణుల వేట కోసం అమర్చిన కరెంటు తీగలు తగిలి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఎ. ప్రవీణ్ కుమార్ మృతి చెందడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా ఈ సంఘటన జరగడం దురదృష్ట కరమని అన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రవీణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధా ల ఆదుకుంటుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈసంఘటనకు సంబంధించి సమగ్ర వివరాలు సమర్పించాలని చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ( Chief Wildlife Warden)  ఎమ్.సి.పర్గైన్ ను మంత్రి ఆదేశించారు.

అడవి జంతువులను వేటాడేందుకు వేటగాళ్ళు విద్యుత్ తీగలు అమర్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను సేకరించి గ్రేహౌండ్స్ తో పాటు స్థానిక పోలీసు అధికారులకు అందించాలని మంత్రి సూచించారు.

తద్వారా వారు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ముంద స్తు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నా రు. వన్యప్రాణు లను వేటాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకో వాలని మంత్రి అటవీ అధికారులను ఆదేశించారు.

*పులి సంచారం ప్రచారం అవాస్తవం…* నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలో పులి కనిపించిందనే ప్రచారం వాస్తవం కాదని అటవీ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో పులి సంచారానికి ( To the tiger) అవకాశం లేదని స్పష్టం చేసింది. యడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలిం చారు.

అయితే పులి సంచారానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని అధికారులు స్పష్టం చేశారు. చిరుత పులికి సంబంధించిన సమాచారం కూడా గుర్తించలేదని తెలిపారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ఎం.సీ. పర్గెయిన్ జిల్లా అటవీ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో పులి సంచరించే అవకాశం లేదని అటవీ అధికారులు తెలిపారు.

కొందరు పక్క రాష్ట్రాలకు చెందిన పులి సంచారం వీడియోలను ఈ ప్రాంతానికి చెందినదిగా సోషల్ మీడియా (social media) లో ప్రచారం చేస్తున్నారని, ఆ వార్తలను నమ్మొద్దని అటవీశాఖ అధికా రులు కోరారు. రాష్ట్రంలో ఎక్కడైనా పులితో పాటు, వన్యప్రాణుల సంచారం తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు 18004255364 కు ఫోన్ చేయటం లేదం టే స్థానికి అధికారులకు సమాచారం ఇవ్వా లని అటవీ శాఖ కోరింది.