Cylinder symbol for TRS: టీఆర్ఎస్ కు సిలిండర్ గుర్తు
--తెలంగాణ రాజ్య సమితికి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ -- 5శాతం స్థానాల్లో విధిగా పోటీ చేయాలనే నిబంధన వర్తింపు -- లేదంటే ఇతరులకు ఆ గుర్తు కేటాయిస్తామని స్పష్టీకరణ
టీఆర్ఎస్ కు సిలిండర్ గుర్తు
–తెలంగాణ రాజ్య సమితికి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ
— 5శాతం స్థానాల్లో విధిగా పోటీ చేయాలనే నిబంధన వర్తింపు
— లేదంటే ఇతరులకు ఆ గుర్తు కేటాయిస్తామని స్పష్టీకరణ
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్)కి కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తును కేటాయించింది. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులతో కలిసి సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం ఈ పార్టీని ఎన్నికల కమిషన్ (Tupakula Balarangam of Ponnala village of Siddipet district along with the activists is the election commission of this party) కు దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 సెగ్మెంట్లలో పోటీ చేస్తామని ఎన్నికల సంఘానికి ఈ పార్టీ దరఖాస్తు చేసుకోగా విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ పలు షరతులతో ఉత్తర్వులు (When the party applied to the Election Commission, the EC, which considered the appeal, passed the order with several conditions) జారీ చేసింది. ఈ పార్టీ తరఫున బరిలో ఉండే అభ్యర్థులందరికీ గ్యాస్ సిలిండర్ గుర్తునే కేటాయించాలని ఆదేశించింది.
ఎన్నికల నిబంధనల ప్రకారం కనీసం 5 శాతం సీట్లలో ఆ పార్టీ పోటీ( According to the election rules, the party contests at least 5 percent of the seats) చేయాల్సి ఉంటుందని, లేకుంటే పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తును ఇతరులకు కేటాయించవచ్చని కూడా వెల్లడించింది.
టీఆర్ఎస్ రిజిస్టర్ చేసిందెవరు…సిద్దిపేట జిల్లాలోని పొన్నాల బాలరంగం స్వస్థలం కాగా 1983 నుంచి కేసీఆర్ తోనే ఉన్నారు. 1987, 1995లో పొన్నాల గ్రామ సర్పంచ్ గా పనిచేయడంతో పాటు 2001లో సిద్దిపేట మండల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. 2006లో సిద్దిపేట మండల జెడ్పీటీసీ సభ్యుడిగా, 2019 నుంచి 2021 వరకు ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు.
తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఈసీకి దరఖాస్తు చేసుకున్న బాలరంగం సికింద్రాబాద్ లోని ఓల్డ్ అల్వాల్ లో ఉన్న తన ఇంటి చిరునామాను ( Balarangam, who applied to the EC in the name of Telangana Rajya Samiti, gave his home address at Old Alwal, Secunderabad) పార్టీ కార్యాలయం అడ్రస్ గా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో ఏర్పాటైన టీఆర్ఎస్ పేరుతో పార్టీ ఏర్పాటు కావడం, దానికి సిలిండర్ గుర్తును కేటాయించడం ఆసక్తికరంగా మారింది.