Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 3:06 pm Posted by : praja deveena

DCC President Punna Kailash Netha : డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఘాటు వ్యాఖ్యలు, బీఆర్‌ఎస్ దేళ్ళలో పదివేల రైతులబలిదానం

Nalgonda DCC President Punna Kailash Netha : ప్రజా దీవెన, శాలిగౌరారం: తెలంగాణ రాజకీయ ముఖచి త్రం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది.20 29లో పీఠం ఎవ రిది? ఈ ప్రశ్నలకు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ బాస్ పున్న కైలా ష్ నేత క్లియర్ కట్ జవా బు ఇచ్చేశారు. శాలిగౌరారం మం డల కేంద్రంలో జరిగిన ప్రెస్ మీట్‌ లో ఆయన బీఆర్‌ఎస్ గత పదేళ్ల పాలనను ఉతికి ఆరేస్తూనే, రాబోయే కాలం కాంగ్రెస్‌ దేనంటూ భవిష్యత్ రాజకీయాలపై సంచలన జోస్యం చె ప్పారు.

ఆ పదేళ్లు ‘రైతుల బలిదానాల’ కాలం

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రైతాంగం రోడ్డున ప డింది. ఏ కంగా 10 వేల మంది రైతులు బల వన్మరణాలకు పాల్పడ్డారు. ఇదేనా బీఆర్‌ఎస్ చెప్పిన అద్భుతమైన రై తు పాలన?” అని కైలాష్ నేత నిల దీశారు. ఏకకాలంలో రుణ మాఫీ చేస్తామని చెప్పి కోట్లాది మంది రైతులను వంచించా రని, నిరుద్యోగుల జీవితాలతో మాజీ సీఎం కేసీఆర్ చెలగా టమాడారని మండిపడ్డారు.గాలికొదిలేసిన ప్రాజెక్టులు నల్ల గొండ జిల్లాను బీఆర్‌ఎస్ నేతల అ సమర్థత వెనుకబాటు తనంలోకి నెట్టేసిందని కైలాష్ నేత ధ్వజమెత్తారు.

      పట్టించుకోని ప్రాజెక్టులు

డిండి, శ్రీశైలం సొరంగం, చర్లగౌరా రం, కిష్టారంపల్లి, బ్రాహ్మణ వెల్లం, శాలిగౌరారం అసిఫ్ నగర్ కాల్వలను గత ప్రభుత్వం పూర్తిగా గాలికొ దిలేసిందని ఆరోపించారు.”కోట్లు కుమ్మరిం చిన కాలేశ్వరం ప్రాజెక్టు కళ్లముందే కూలిపోయింది నిజం కా దా?” అంటూ ప్రశ్నించారు.

ఇదీ కాంగ్రెస్ మార్క్ ‘సంక్షేమ విప్లవం’

బీఆర్‌ఎస్ వదిలేసిన పెండింగ్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోందని ఆయన స్పష్టం చే శారు. అసిఫ్ న గర్ కాల్వ పరిధి రై తులకు నష్టపరిహారం అందించి ప నుల ను ప్రారంభించామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అసలైన ‘రైతు బాంధవుడు’ అని కొనియాడారు.ఏకకాలంలో రైతు భ రోసా అమలుతో పాటు సన్న వడ్లకు బోనస్, రేషన్ కార్డుల పంపిణీ, 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, చే నేత బీమా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉ చిత బస్సు ప్ర యాణం.

2029లో మళ్లీ రేవంత్ రెడ్డి సీఎం కావడం ఖాయం

రాబోయే రోజుల్లో పెండింగ్ ప్రాజెక్టు ల భవిష్యత్తు అంతా కాంగ్రెస్ పార్టీ తోనే ముడిపడి ఉందని, 2029 ఎన్నికల్లో సీ ఎం రేవంత్ రెడ్డి మళ్లీ గె లిచి తీరుతారని కైలాష్ నేత జో స్యం చెప్పారు. ముఖ్యమంత్రిపై హ రీష్ రావు, కేటీఆర్ చేస్తు న్న అసభ్య విమర్శలను చూసి సభ్య సమాజం తలదిం చు కుంటోందని దుయ్యబట్టారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్య క్షులు అన్నెబోయిన సుధా కర్, సిం గల్ విండో చైర్మన్ తాళ్లూరి ముర ళి, మండల కాం గ్రెస్ ప్రెసిడెంట్ చిం త ధనంజయ్, సర్పంచ్‌ల ఫోరం అధ్య క్షుడు తోటకూరి పరుశరామ్, శాలిగౌరారం సర్పంచ్ శేఖర్ బాబు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కా ర్యదర్శి వేముల గోపినాథ్, బొల్లి కొండ గణేష్, బండపల్లి కొమరయ్య, నోము ల జనార్దన్, వడ్లకొండ పరమేష్, భూపతి వెంకన్న, మం గ డుడ్ల శ్రీనివాస్, యంగలి రామకృ ష్ణ గౌడ్, జమ్ము అశోక్, ఆ కుల శ్రీని వాస్, ఉపసర్పంచ్ తాటిపాముల పాపారాములు తదితరులు పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.