Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 1:21 pm Posted by : praja deveena

Death Penalty for Cyber Scammers : బిగ్ బ్రేకింగ్, ఆప్రభుత్వం సంచలన నిర్ణయం, ఆన్ లైన్ లో సైబర్ స్కామర్లకు ఇక మరణదండన 

Death Penalty for Cyber Scammers : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉద్యో గం ఇస్తామని నమ్మించి, అక్రమంగా బం ధించి, చిత్రహింసలు పెడుతూ ఆన్లైన్ మోసాలు చేయించే సైబర్ క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సంచలన నిర్ణ యాన్ని మయన్మార్ ప్రభుత్వం తీసుకుంది. ప్రపంచవ్యా ప్తంగా వందల కో ట్ల డాలర్ల మోసాలకు నిలయం గా మారిన స్కామ్ సెంటర్ల అరా చకాలకు చెక్ పెట్టేందుకు ఎవరూ ఊ హించని రీతిలో అత్యంత కఠి నమైన చట్టాన్ని రాత్రికి రాత్రే ఆ మోదించింది. మయన్మార్ రాజ ధాని నెపిడాలో జరిగిన పార్లమెం ట్ ఉమ్మడి సమావేశంలో ‘యాం టీ-ఆన్లైన్ స్కామ్ బిల్లు’కు ఆమో దముద్ర పడింది. బిల్లు ముసా యిదాలో ఎలాంటి మార్పులు లే కుండా, నేరుగా ‘మరణశిక్ష’ నిబం ధనతోనే దీనిని చట్టంగా మారు స్తున్నట్లు స్పీకర్ ఆంగ్ లిన్ ద్వే, దిగువ సభ ఎంపీ ఏ చాంగ్ ధృవీ కరించారు.

నరకానికి ముగింపు, చట్టంలో కీలక నిబంధనలు ఇవే

ఉద్యోగాల పేరిట విదేశాల నుంచి అమాయకులను తీసుకు వచ్చి, అక్రమంగా బంధించి ఆన్లైన్ స్కా మ్‌లు చేయించే క్ర మంలో.. బాధితులు చిత్రహింసల వల్ల మరణిస్తే నేరస్తుల కు తప్పనిసరిగా ఉరి శిక్ష విధిస్తారు. వ్యక్తులను నిర్బం ధించ డం, తీవ్రంగా హింసించడం వంటి దారుణాలకు పాల్పడితే 1 0 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష తప్పదు. ఆన్లైన్ స్కా మ్ హబ్‌లు నడిపే ముఠా నాయకులకు, క్రిప్టోకరెన్సీ మరి యు డిజిటల్ కరెన్సీ మోసాలకు పాల్పడే సూత్రధారులకు గరిష్ఠంగా జీవిత ఖైదు విధిస్తారు.

     అసలు కథ ఏంటంటే

ఇటీవలి కాలంలో విదేశాల నుం చి ‘మంచి జీతం’ అంటూ యువ తను మయన్మార్ రప్పించి, వారి ని ‘స్కామ్ హబ్స్ ‘లో బంధించి బ లవంతంగా క్రిప్టో, డేటింగ్ మోసాలు చేయి స్తున్న ఘటనలు తీవ్ర క లకలం రేపాయి. చెప్పిన మాట విన కపోతే బాధితులను విచక్షణారహితంగా కొట్టడం, చిత్రహిం సలు పెట్టడం నెట్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఐ క్యరాజ్యసమితి సహా పలు దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి రా వడంతో మయన్మార్ ప్రభుత్వం ఈ విప్లవాత్మక చట్టాన్ని అ మల్లోకి తెచ్చింది. ఇకపై స్కామ్ సెంటర్లు నడిపినా, బాధితు ల ప్రాణాలు తీసినా నేరుగా ఉరిత్రాడే గతి అని ఈ చట్టంతో మయన్మార్ స్పష్టం చేసింది.