Decision to reduce fuel prices: ఇంధన ధరల తగ్గింపుకు నిర్ణయం
--కసరత్తు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం --పెట్రోలియం సంస్థలతో చర్చలు ప్రారంభం --పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై కనీసం రూ.8 నుంచి రూ.10 వరకు తగ్గే అవకాశం
ఇంధన ధరల తగ్గింపుకు నిర్ణయం
–కసరత్తు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
–పెట్రోలియం సంస్థలతో చర్చలు ప్రారంభం
–పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై కనీసం రూ.8 నుంచి రూ.10 వరకు తగ్గే అవకాశం
ప్రజా దీవెన/న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేం దుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ( The central government is working to reduce the prices of petrol and diesel) ప్రారంభించింది. ఇంధన ధరలను భారీగా తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచనకు వచ్చినట్లు సమాచారం. ధరల తగ్గింపుకు సంబంధించి పెట్రోలియం సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపు తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై కనీసం రూ.8 నుంచి రూ.10 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఈ నెలాఖరులోపే ఇది అమలులోకి రావొచ్చని చెప్పకనే చెబుతున్నాయి. వచ్చే ఏడాది 2024 ఆరంభానికి అటు ఇటు గా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు తీసుకుంటు న్నట్లు సమాచారం. ఈ మేరకు సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి ( To relieve the common man) చమురు మార్కె టింగ్ కంపెనీలతో చర్చలు జరుగు తున్నాయి.
ధరల తగ్గింపు యొక్క భారాన్ని ప్రభుత్వం, ఓఎమ్‌సీలు సమానంగా భరించాలనే ప్రతిపాద న పరిశీలనలో ఉంది. కేంద్రం లీటరుకు రూ.10 వరకు అధిక ధరను తగ్గించే అవకాశం (The Center is likely to reduce the high price by Rs.10 per litre) ఉంది. ఇంధన ధరల తగ్గింపు నవంబర్‌లో మూడు నెలల గరిష్ట స్థాయి 5.55%కి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గిస్తుంది. ఇదే విషయమై పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల చర్చలు జరిపాయి.
దీనికి సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయానికి రిపోర్ట్‌ను సమర్పించాయి. ఇంధన ధరలపై ఈ రెండు మంత్రిత్వ శాఖలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చర్చలు జరుపుతాయి. ముడి చమురు ధరలు గత మూడు నెలలుగా బ్యారెల్‌కు 70-80 డాలర్ల శ్రేణిలో ఉన్నందున ఇంధన ధరల తగ్గింపుకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ( Central government favors reduction in fuel prices) ఉందని వర్గాలు తెలిపాయి.
నవంబర్ 2021, మే 2022లో రెండు విడతలుగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు పెట్రోల్‌పై లీటరుకు రూ. 13, డీజిల్‌పై లీటరుకు రూ. 16 చొప్పున తగ్గించింది. ఎక్సైజ్ తగ్గింపులు పూర్తిగా వినియోగదారులకు అందించబడ్డాయి. ఫలితంగా రిటైల్ ధరలు తగ్గాయి.