Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Solar Power Plants : ఉప ముఖ్యమంత్రి కీలక ప్రకటన,జీపి భవనం నుంచి సెక్రటేరియట్ వరకు అంతటా సోలార్ పవర్ ప్లాంట్ లు 

Solar Power Plants : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ భవనాల నుంచి సచివాలయం భవనం వరకు అన్ని స్థాయిల్లో ప్రతి చోట సోలార్ విద్యు త్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయ నున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి వి క్రమార్క కీలక ప్రకటన చేశారు. ఇం దిరా సౌర గిరిజల వికాసం వేగవం తం చేయాలని,ఏజెన్సీ ప్రాంత అధి కారులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల వివరాలు పంపించాలని ఆయన జి ల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చే యాలని సీఎం రేవంత్ రెడ్డి నాయక త్వంలోని యావత్ క్యాబినెట్ విధా న నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశా రు.

శనివారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రభు త్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాం ట్ల ఏర్పాటు, ఆర్ఓఎఫ్ ఆర్ భూ ముల్లో ఇందిరా సౌర గిరిజన వికా సం పథకం అమలుపై జిల్లా కలెక్టర్ల తో సమీక్ష నిర్వహించారు. సమావే శంలో సాంఘిక సంక్షేమ శాఖ మం త్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యు త్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, SPDCL సిఎండి ముషార ఫ్ ఫారుకి, రె డ్కో సిఎండి అనిలా తదితరులు పాల్గొన్నారు.

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, పార్కింగ్, క్యాంటీన్ ప్లాన్లు హై దరా బాద్ కు పంపాలని డిప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్ర వ్యా ప్తంగా కలె క్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనా లో నిర్మించినందు న సోలార్ పవర్ ప్లాంట్ లో ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైద రా బాదు నుంచి పంపి స్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. కలెక్టర్ కా ర్యాలయాల్లో మంచి డిజై న్లు ఉంటే ఆయా కలెక్టర్లు హైదరాబాద్ కు పంపవచ్చని డిప్యూటీ సీ ఎం సూచించారు.

గ్రామపంచాయతీ బిల్డింగ్ మొదలు కొని సెక్రటేరియట్ వరకు రా ష్ట్రంలో ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపా రు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసర మైన వివరాలకు సం బంధించి కలెక్టర్లు హైదరాబాద్ కు పంపాల్సిన వివరాలకు సంబం ధించి ఒక ప్రశ్నావ ళిని పంపిస్తున్నాం అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారం లో పు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యా లయానికి పంపాలని డిప్యూ టీ సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భ వ నాలతో పాటు ప్రభుత్వ పాఠశా లలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు , ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్ పవ ర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన భవనా ల వివరాలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.

నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థ లాలు ఉన్నాయి వాటి వివరాలు సై తం పంపాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం సూచించారు. ఏజెన్సీ ప్రాంతా ల్లో ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం కింద 6. 70 లక్షల ఎకరాల భూములను ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చే సిందని, ఈ భూముల్లో నల్లమల డి క్లరేషన్ కింద ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఉచి తంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయ నున్నట్టు డిప్యూటీ సీ ఎం కలెక్టర్లకు వివరించారు. నల్లమల డిక్లరేషన్ లో భాగంగా ఇప్పటి కే అచ్చంపేట ని యోజకవర్గం లో ప్రారంభించాం ఈ నెలలోనే ఆది లాబాద్ జిల్లాలో కొ న్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్ర భుత్వం ఉందని తెలిపారు.

ఇందిరా సౌర గిరిజల వికాసం పథ కాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకుంది కలెక్టర్లు ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా వారం లోగా వివరాలు పంపండి, ఈ విష యాల్లో ఎలాంటి సందే హాలు ఉన్న విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎ స్పీడీసీఎల్, np dcl సీఎండీలు, RE DCO VC&MD ని సంప్రదించాలని డిప్యూ టీ సీఎం కలెక్టర్లను ఆదేశించారు.