Encounters: వేర్వేరు భారీ ఎన్ కౌంటర్ లు
దేశంలో ఓ వైపు లోక్ సభ ఎన్నికలు జరుగుతుoడగా మరో వైపు రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఎన్ కౌంట ర్ జరిగాయి. ఛత్తీస్ గఢ్, మహారా ష్ట్రలలో సోమవారం జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్ ఘఢ్, మహారాష్ట్రలలో సంఘటనలు
చనిపోయిన 11 మంది మావోయి స్టులు
మృతుల్లో ఇద్దరు మహిళా నక్సలై ట్లు
భారీగా మారణాయుధాలు స్వాధీ నం
మావోయిస్టు ల మృతదేహాలు ఆస్పత్రికి తరలింపు
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ఓ వైపు లోక్ సభ ఎన్నికలు జరుగుతుoడగా మరో వైపు రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఎన్ కౌంట ర్ జరిగాయి. ఛత్తీస్ గఢ్, మహారా ష్ట్రలలో సోమవారం జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో చత్తీస్ గఢ్ లోని సెమ్రా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందగా మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లా బాంరగడ్ తాలుకా కత్రనట్ట అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్‌కౌం టర్ లో ముగ్గురు మావో యిస్టులు మృతి చెందారు.
మృతుల్లో ఇద్దరు మహిళా మావోలున్నట్లు అధికారు లు వివరిస్తున్నారు. వివరాలల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా బోటె తంగో ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం తో భద్రతా దళాలు స్థానిక పోలీసు లతో కలిసి కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్థులు తార సపడ్డారు. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
కాగా సోమవారం ఉదయం 7 గంట ల నుంచి సాయంత్రం 6 గంటల వర కు మావోలకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగినట్లు అధికా ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఘట నా ప్రాంతంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకు న్నారు. బోటెతంగో ప్రాంతంలో మా వోల కోసం డీఆర్జీ దళాలు, సీఆర్పీ ఎఫ్ జవాన్లు సంయుక్తంగా ఆపరే షన్ చేపట్టాయి. ఈ క్రమంలో తార సపడిన నక్సల్స్ కాల్పులు జరప డంతో భద్రతా బలగాలు అప్రమత్త మయ్యాయి. ఎదురుకాల్పులు జర పడంతో ఎన్ కౌంటర్ కు దారితీ సిందని అధికారులు వివరిస్తున్నా రు.మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లా బాంరగడ్ తాలుకా కత్రస్గట్ట అటవీ ప్రాంతం లో పోలీసులకు, మావోయి స్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ముగ్గు రు మావోయిస్టులు మృతి చెందా రు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. మృతుల్లో పెరిమిలి దళం కమాండర్ వాసు ఉన్నట్లు సమాచారం.
కాల్పులు అనంతరం భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి ఒక ఏకే-47 రైఫిల్, ఒక కార్బైన్ గన్ తో పాటు ఒక ఇన్ సాస్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల మృతదేహాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అటవీ ప్రాంతంలో కొందరు నక్సలైట్లు విడి ది చేసినట్లు తమకు సమాచారం అందడంతో అడిషనల్ ఎస్పీ ఆప్స్ యతీష్ దేశముఖ్ నేతృత్వంలో సీ60కి చెందిన రెండు యూనిట్లను వెంటనే రంగంలోకి దిగాయి. బల గాల రాకను గమనించిన మావోయి స్టులు విచక్షణారహితంగా కాల్పు లు జరిపారు. అప్రమత్తమైన సీ60 బృందాలు ఎదురుకాల్పులకు పాల్పడటంతో ముగ్గురు మావోయి స్టులు అక్కడికక్కడే మృతి చెందా రు. ఈక్రమంలో పారిపోయిన మావోల కోసం బాంరగడ్ తాలుకా కత్రన్ట్ అటవీ ప్రాంతంలో కూబింగ్ చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ ఆప్స్ యతీష్ దేశముఖ్ తెలిపారు.
వరుస ఎన్ కౌంటర్ లతో భారీ నష్టం… వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ పడుతోందని ఆ పార్టీ వర్గాలు భావి స్తున్నాయి. రెండు రోజుల కిందట బీజాపుర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందిన విష యం తెలిసిందే. పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ యాంటీనక్సల్స్ ఆపరేష న్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నా రు.
ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గఢ్ చరిత్రలోనే అతిపెద్ద ఎన్ కౌంటర్ ఘటనగా పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే ఏప్రిల్ 30న నారాయణ్‌పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో మరో 10మంది మరణించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో మొత్తం 111 మంది మావోయి స్టులు ప్రాణాలు కోల్పోయారని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Different massive encounters