Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 10:32 am Posted by : praja deveena

Union government Digital Arrest precautions : బిగ్ బ్రేకింగ్, డిజిటల్ దురాక్రమణ కు చెక్, భారత్‌లో డిజిటల్ అరెస్ట్ మోసాలకు కేంద్రం బ్రేక్ 

Union government Digital Arrest precautions  : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: సాంకేతికత ఎంత వేగంగా వృద్ధి చెందుతోందో, అదే వేగం తో సైబర్ నేరగాళ్ల వల కూడా అం తే స్థాయిలో విస్తరి స్తోం ది. ముఖ్యంగా గత కొంతకాలం గా దేశాన్ని కుదిపేస్తున్న డిజి టల్ అరెస్ట్ (Digital Arrest) మో సాలు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరినీ భ యాందోళనకు గురిచేస్తు న్నాయి. ఈ పెను ముప్పును గు ర్తించిన సుప్రీంకోర్టు, దీనిపై సీరియస్ అయ్యింది.

ఈక్రమంలో డిజిటల్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేం దుకు కేంద్ర ప్ర భుత్వం కీలక నిబంధన లతో కూడిన ఒక నివేదికను అ త్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. దే శ భద్రత మరియు పౌరుల ఆర్థిక రక్షణే ధ్యేయంగా, వివిధ రంగాల నిపుణులు, ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చలు జ రిపి ఈ కార్యాచ రణను రూపొందించారు. దీని అ మలు కోసం టెలీకమ్యూనికేషన్ వి భాగం, ఐటీ శాఖ మరియు ఆర్బీఐ సమన్వయంతో పనిచేయాలని కేంద్రం కోరింది.

 అడ్డుకట్టకు కేంద్రం సూచించిన అంశాలివే

సిమ్ కార్డు జారీ చేసే సమయంలో బయోమెట్రిక్ ఐడెంటిటీ వెరిఫికేష న్‌ను మరింత కఠినతరం చేయను న్నారు.టెలికాం ఆపరేటర్లు నిబం ధనల ఉల్లంఘన లేకుండా చూడటం ఇం దులో కీలకంగా మారనుంది. కాగా సిమ్ విక్రయించే పాయిం ట్ ఆఫ్ సేల్స్ ఏజెంట్లను ఎప్పటిక ప్పుడు ధృవీకరించడం, ద ర్యాప్తు సమయంలో వారి వివరాలను పా రదర్శకంగా ఉం చేలా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. సైబర్ క్రైమ్స్ లేదా డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలకు వాడుతున్నట్లు గు ర్తించిన వెంటనే ఆ సిమ్ కార్డులను వేగంగా నిలిపివేస్తారు.

వాట్సాప్ వంటి ప్రముఖ యాప్స్ ‘సిమ్ బైండింగ్’ విధానాన్ని మరిం త పటిష్టం చేయాలి. అంతేకాకుండా గంటల తరబడి సాగే మోసపూ రిత కాల్స్‌ను గుర్తించేలా అధునా తన సాంకే తిక ఫీచర్లను తీసుకురా వాల్సి ఉంటుంది. కేవలం సిమ్ కా ర్డులనే కాకుండా, నేరాలకు వాడు తున్న స్మార్ట్‌ఫోన్ల ‘డివైజ్ ఐడీ’లను గుర్తించి, వాటిని శాశ్వతంగా బ్లాక్ చేయనున్నా రు. దీనివల్ల నిందితు లు మరే ఇతర ఖాతా ద్వారా కూ డా నేరాలకు పాల్పడలేరు. అను మానాస్పద ఖాతాల నుంచి నగదు బయటకు వెళ్లకుండా తాత్కాలికం గా ఫ్రీజ్ చేసేందు కు, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) సిద్ధం చేయా లని ఆర్బీఐని కోరారు.

డిజిటల్ విప్లవంలో భాగస్వాము లవుతున్న భారతీయుల కు ఈ చ ర్యలు ఒక పెద్ద ఊరటనిచ్చే అంశం.రాబోయే రోజు ల్లో సాంకేతికత తో పాటు, పటిష్టమైన నిబంధనలు కూడా తోడవ్వడంతో సైబర్ నేరగా ళ్ల పప్పులు ఉడకవని స్పష్ట మ వుతోంది. ప్రభుత్వాల చర్యలతో పాటు, మనం కూడా ఎటు వంటి ఆన్‌ లైన్ కాల్స్‌కు లొంగిపోకుండా అప్ర మత్తంగా ఉం డటం అత్యంత ఆవశ్యకంగా నిపుణులు చెబుతున్నారు.