Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Disruption of law and order will not be tolerated: శాంతిభద్రతలకు విఘాతాన్ని సహించం

--రౌడీయిజంకు పాల్పడుతున్న 12 మందిపై కేసులు --నల్లగొండ జిల్లా యస్ పి కె.అపూర్వ రావు

  • శాంతిభద్రతలకు విఘాతాన్ని సహించం

–రౌడీయిజంకు పాల్పడుతున్న 12 మందిపై కేసులు
–నల్లగొండ జిల్లా యస్ పి కె.అపూర్వ రావు

ప్రజా దీవెన/ నల్లగొండ: నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరస్పర దాడులకు పాల్పడుతున్న రెండు వర్గాలపై కఠిన చర్యలకు ( For strict action against the two factions who are indulging in mutual attacks) ఉపక్రమించింది నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ. ఇరువర్గాలపై హత్యాయత్నం, అక్రమ సమావేశం, ఆయుదాల చట్టం క్రింద కఠినమైన సెక్షన్ లతో కేసులు నమోదు చేశారు పోలీసులు.

నల్లగొండ వన్ టౌన్ పరిధిలోని షేక్ హసనుద్దిన్ కొన్ని రోజుల క్రితం దుబాయి, కతార్ వెళ్లి వచ్చిన అనుభవం తో ఏజెంట్ గా మారి ఎవరైనా కతార్ కానీ, దుబాయ్ కి వెళ్ళే వారి నుండి డబ్బులు తీసుకొని వీసా ఇప్పించడం వంటి కార్యక్రమాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో మాన్యంచెల్కకి చెందిన ముదసిర్ అమ్మద్ వద్ద రూ. లక్షా పది వేలు తీసుకొని కతార్ పంపుటకు ఒప్పందం కుదుర్చుకుని ( At Mudasir Ammad Rs. Agreed to take one lakh and ten thousand and send it to Qatar) వీసా ఏర్పాటు చేశాడు.

కరోనా సమయం లో లాక్ డౌన్ ఉన్న క్రమంలో అతని వీసా గడువు కాలం అయిపోవడంతో ముసిదర్ హమ్మద్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని షేక్ హాసనుద్దిన్ ను పలు మార్లు అడుగుతుండగా ఇవ్వక పోవడంతో (After asking Sheikh Hasanuddin to return his money many times, he did not give it) ముదాశిర్ అమ్మద్ తన స్నేహితుడు పిడి యాక్ట్ పైన గతంలో జైలు కి వెళ్ళివచ్చిన పాత రౌడీ షీటర్ షేక్ చాంద్ కి విషయం చెప్పి షేక్ చాంద్, షేక్ హసనుద్దిన్ ను డబ్బులు ఇవ్వమని పలు మార్లు బెదిరిoచాడు.

ఈ విషయంలో నిన్న ఫోన్ చేసి చర్చించుకుందాము అని చెప్పి షేక్ హస్నుద్దీన్ వర్గం, షేక్ చాంద్ వర్గం డబ్బుల విషయంలో లిటిల్ ప్లవర్ స్కూల్ చౌరస్తా వద్ద కు వచ్చి పరస్పరం ఒకరిపై ఒకరు మారణాయూదాలతో దాడులకు పాల్పడి ఇరు వర్గాలకు చెందిన ( They belong to both the groups who committed attacks with deadly weapons) వారు గాయపర్చుకున్నారు.

సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు తక్షణమే స్పందించి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ( On receiving the information, the city police responded immediately without any loss of life)  ఇరు వర్గాలను చెదరగొట్టారు. వెంటనే షేక్ హస్నుద్దీన్, ఖాజా సమీయుద్దీన్, మొహమ్మద్, ఫుర్ఖాన్ అలీ, సయ్యద్ నిజాముద్దీన్, జావీద్, షేక్ అబ్దుల్లా, మహమ్మద్ మన్నన్, సయ్యద్ హబీబ్, అజీమ తదితరులపై కేసు నమోదు చేసి నిందితులను రెండు కేసులలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

రెండు కేసులలో నేరస్తులపై అక్రమ సమావేశం, హత్యాయత్నం, ఆయుదాల చట్టం క్రింద కఠినమైన సెక్షన్ లతో కేసులు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పై కఠిన చర్యలు జిల్లా ఎస్పి అపూర్వారావు హెచ్చరించారు. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పుటకు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పని చేస్తుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని (We will not ignore anyone who disrupts peace and security) , కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అవసరమైతే పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకి పంపడం జరుగుతుందని హెచ్చరించారు.